14, ఏప్రిల్ 2025, సోమవారం

సమస్య - 5093

15-4-2025 (మంగళవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“కుంకుడు కాయలను గడిగి కూరను జేసెన్”

(లేదా...)

“కుంకుడు కాయలన్ గడిగి కోమలి కూరను జేసె భర్తకై”

(హంసగీతి గారికి ధన్యవాదాలతో...)

17 కామెంట్‌లు:

  1. కందం
    వెంకమ పెరటిన్ *రాలగ
    సంకీర్ణంబౌచు* 'హరితశాకము' తోడన్
    సంకటపడి విడదీయుచు
    *కుంకుడు కాయ*లను, 'గడిగి కూరను జేసెన్'

    ఉత్పలమాల
    వెంకమ యింటిలో పెరడు వేడ్కనొసంగును కాయగూరలన్
    "*సంకరమై పడన్* 'హరితశాకము' తోడను గాలివీచగన్
    సంకటమైన నోరిమిని చక్కగ నేరుచు ప్రక్కనుంచుచున్
    *కుంకుడు కాయ*లన్, 'గడిగి కోమలి కూరను జేసె భర్తకై

    రిప్లయితొలగించండి
  2. శంకింపక పొరుగు పెరటి
    వంకాయలనెంచితెచ్చి వామనయనయే
    పొంకముగా తన కరములు
    కుంకుడు కాయలను గడిగి కూరను జేసెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అంకిలి లేనితోటయని హాయిగ నందున సంచరించుచున్
      బంకజ నేత్రిగాంచె పరిపక్వపు మామిడి కాయ నొక్కటిన్
      టెంకను తీసివేసి మరి ఠీవిగ తానట రెండుచేతులున్
      గుంకుడు కాయలన్ గడిగి కోమలి కూరను జేసె భర్తకై

      తొలగించండి
  3. కం॥ వేంకటరమణునిఁ దలఁచుచు
    సంకట హరణమును జేసి స్వస్థతఁ గూర్చన్
    బింకము నొసఁగుచు భర్తకు
    కుంకుడు కాయలను గడిగి కూరను జేసెన్

    ఉ॥ వేంకట శైలవాసుఁడటు ప్రీతినిఁ గాంచగ మ్రొక్కి వేడుచున్
    సంకట మెల్ల పాపి తగు స్వస్థతఁ గూర్చుచు ఱేనిఁ బ్రోవఁగన్
    బొంకము నొందు రీతిగను బోఁడిమి మీరఁగ సర్వదా యటుల్
    కుంకుడు కాయలన్ గడిగి కోమలి కూరను జేసె భర్తకై

    కుంకుడు ఫేనిలము రేగుపండు నిఘంటువు సహాయమండి

    రిప్లయితొలగించండి

  4. కుంక యటంచు దలంచుచు
    లంకిని బోలిన పడంతి రమణుని జంపన్
    టంకర లోనను పిడికెడు
    కుంకుడు కాయలను గడిగి కూరను జేసెన్.


    కుంకయె నీదు భర్తయని కూళుని యెట్లు భరింతు వంచు నా
    లంకిని బోలినట్టి రుచి రాంగికి చెప్పెను మిత్రురాలు తా
    టంకిని, మన్మథాలయపు టంకర యందున గుప్పెడంత తా
    కుంకుడు కాయలన్ గడిగి కోమలి కూరను జేసె భర్తకై.

    రిప్లయితొలగించండి
  5. పంకజముఖి వంటయనిన
    సంకటపడు తానెరుఁగమి శాకము జేయన్
    కొంకక శాకమ్మనుకొని
    కుంకుడు కాయలను గడిగి కూరను జేసెన్

    రిప్లయితొలగించండి
  6. కుంకుడుకాయలన్ మునుపు కోమలి గాంచని కారణమ్మునన్
    పంకము బాపి కేశముల స్వచ్ఛత గూర్చునటం చెరుంగకన్
    కొంకక తాదలంచి యవి కూరకునై యుపయుక్తమౌననిన్
    కుంకుడు కాయలన్ గడిగి కోమలి కూరను జేసె భర్తకై

    రిప్లయితొలగించండి
  7. శంకరు భక్తురాలనని సాధ్విని నేనని పట్టుబట్టుచున్
    శంకను వీడుమా యనుచు సద్దినిగట్టగ పంకజాక్షి బొ
    ద్దింకల పట్టిదెచ్చి పరమేశుని సాక్షిగ వంటజేయుచున్
    *కుంకుడు కాయలన్ గడికి కోమలి కూరను జేసె భర్తకై.*

    రిప్లయితొలగించండి
  8. అంకురముల వెలచ నొదవె
    కుంకుడు కాయలను ; గడిగి కూరను జేసెన్
    పొంకముగ కంద గడ్డను
    నంకము సలుపక కుడుచుట కనువుగ నుండన్

    రిప్లయితొలగించండి
  9. ఇంకను కూర సేయవలె నింటిమగండు బయల్పడంగ తాఁ
    బొంకము తోడ దేవళముఁ బోవగ స్నానము పూర్తి కావలెన్
    లంకెలు తీరు రీతి ఘన లాలనమూని సకాలమందునన్
    కుంకుడు కాయలన్ గడిగి కోమలి కూరను జేసె భర్తకై!!

    రిప్లయితొలగించండి
  10. జంకక పతిపై యలుక గ
    పంకజ లోచన గృహమున వండ గ దల చెన్ సంకట మును గూర్చు ట కై
    కుంకుడు కాయలను గడిగి కూరను వండె న్

    రిప్లయితొలగించండి
  11. కం: పెంకె సుతకు తల నంటగ
    జంకుచు భర్తకును తిండి సద్దగ వడిగా
    నుంకించి భార్య యోర్పుగ
    కుంకుడు కాయలను గడిగి కూరను జేసెన్”
    (పిల్లల తలంటికి తొందర,భర్తకి అన్నం సద్దటం తొందర.ఆమె ఈ రెండూ ఓర్పుతో చేసింది.)

    రిప్లయితొలగించండి
  12. ఉ: పెంకెది బిడ్డ , భర్తయును వేగమె వండు మటంచు జెప్పు, నే
    నింకను విశ్రమించ దగునే యని బిడ్డ తలంట వద్దనన్
    పెంకెను బుజ్జగించి యతి వేగమె రెంటిని జేయ నోర్పుతో
    కుంకుడు కాయలన్ గడిగి కోమలి కూరను జేసె భర్తకై”

    రిప్లయితొలగించండి
  13. పంకజ లోచన గని న
    ల్వంకలఁ జెదరంగ నచట వస్తువు లెల్లన్
    వంకాయల నేఱి విడిచి
    కుంకుడు కాయలను గడిగి కూరను జేసెన్


    వంకలు వెట్ట నేల నతివల్ గడు నేర్పరు లన్న వింతయే
    పంకజ జన్ముఁ డైన మఱి వారిజ నేత్రల దూఱ శక్యుఁడే
    జంకక దొండకాయలను జక్కఁగ నుంచఁగ నుప్పు నీటిలోఁ
    గుంకుడు కాయలం గడిగి కోమలి కూరను జేసె భర్తకై

    [కుంకుడు = మునుక/ మునుఁగుట]

    రిప్లయితొలగించండి
  14. జంకకు మని యుడికించెను
    కుంకుడుకాయలను,గడిగి కూరను చేసెన్
    వంకాయలతోరుచిగా
    పంకజముఖితా నొడుపుగ వడిగా నచ్చో
    : డా బల్లూరి ఉమాదేవి


    శంకయదేల వెంట్రుకలు చక్కగ పెర్గునటంచుపూసెతా
    కుంకుడుకాయలన్ ,కడిగి కోమలి కూరను చేసె భర్తకై
    కంకులుదెచ్చితీయుచునుకమ్మగ నుప్పును చేర్చుచున్ వడిన్
    పంకజనేత్రి వడ్డనము వాసిగ చేసిన మెచ్చి రందరున్

    రిప్లయితొలగించండి