10, ఏప్రిల్ 2025, గురువారం

సమస్య - 5089

11-4-2025 (శుక్రవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“కాంతుఁడు శాత్రవుఁడు గాదె కాంతకుఁ జూడన్”

(లేదా...)

“కాంతునిఁ బోలు శాత్రవులు కాంతకుఁ గల్గుదురే తలంచినన్”

23 కామెంట్‌లు:

  1. కందం
    ఇంతులతో సంబంధము
    లంతకునంతకు పెరుగగనానందముతో
    సంతుకు ద్రోహము సేసెడు
    కాంతుఁడు శాత్రవుఁడు గాదె కాంతకుఁ జూడన్!

    ఉత్పలమాల
    ఇంతులసంగతిన్ గుతుక మేర్పడనంతకు భర్తమీరుచున్
    జెంతననుండియున్ వికృత చేష్టలరెచ్చుచునార్థికమ్ముగన్
    సంతుకు ద్రోహమున్ సలిపి సైపఁగ జాలని వర్తనమ్ముతో
    కాంతునిఁ బోలు శాత్రవులు కాంతకుఁ గల్గుదురే తలంచినన్!

    రిప్లయితొలగించండి
  2. చెంతనె యందమైన సతి చిత్తము
    రంజిల చేయుచుండగా
    సంతసమొందకన్ పరుల చానను
    బొందగ గోరునట్టి యా
    వింత వికార దుర్గుణిని వేదన
    పాలొనరించు మూర్ఖుడౌ
    కాంతుకు బోలు శాత్రవులు కాంతకు
    గల్గుదురే తలంచినన్

    రిప్లయితొలగించండి
  3. శాంతిగనుండనీడు మది శర్వరుతో సరి రూపురేఖలన్
    భ్రాంతి యెలర్చు నెమ్మనము బాములపెట్టు వియోగమందునన్
    స్వాంతమునందు దీయనగు బాళికి గల్గును పారవశ్యమే
    కాంతునిఁ బోలు శాత్రవులు కాంతకుఁ గల్గుదురే తలంచినన్

    రిప్లయితొలగించండి
  4. ఎంతగ వలదని జెప్పిన
    పంతము బట్టి పెరవాని వశగ తలచకన్
    మంతనముగ వచ్చిన సఖి
    కాంతుఁడు శాత్రవుఁడు గాదె కాంతకుఁ జూడన్

    రిప్లయితొలగించండి
  5. కంతుఁడు మానసచోరుఁడు
    స్వాంతమునన్ విరహ బాధ ప్రచురము సేయున్
    శాంతిని దోచెడు నా ప్రియ
    కాంతుఁడు శాత్రవుఁడు గాదె కాంతకుఁ జూడన్

    రిప్లయితొలగించండి

  6. చెంతన పురుషుడు వేడని
    చింతించెడివేళ యింతి చిత్తమున కళా
    వంతుడు వాంఛలు రేపిన
    కాంతుఁడు శాత్రవుఁడు గాదె కాంతకుఁ జూడన్.


    ఎంతటి సౌరభమ్మదియొ యింపగు మల్లెలవిచ్చు చుండ భా
    సంతుని చంద్రకాంతి వనజాక్షిని ముద్దులనాడు చుండగా
    నంతట నా పడంతి విరహమ్మును తాళగ లేకపోయె నా
    కాంతునిఁ బోలు శాత్రవులు కాంతకుఁ గల్గుదురే తలంచినన్.

    రిప్లయితొలగించండి
  7. కాంతుడు చెంతను లేడని
    సంతాపమునకు గురియగు శాలిని మదిలో
    శాంతము హరించు రజనీ
    కాంతుఁడు శాత్రవుఁడు గాదె కాంతకుఁ జూడన్

    కాంతుడు దూరమైన తఱి కంతుని బాణము గాయపర్చగా
    రంతువు కైతపించుచు నిరామయ వేదన చిత్త మందు నా
    సాంతము నిండగా తననశాంతతకున్ గురి చేయు రోహిణీ
    కాంతునిఁ బోలు శాత్రవులు కాంతకుఁ గల్గుదురే తలంచినన్

    రిప్లయితొలగించండి
  8. వింతగు చేష్టల జేయుచు
    చెంతకు జేరక సతతము చెడు వర్త ను డై
    సుంతయు ప్రేమను జూపని
    కాంతుడు శాత్రవుడు గాదె కాంతకు జూడ న్

    రిప్లయితొలగించండి
  9. కం:వింత యనుబంధమే కద
    యింతులకును భర్తలకును హిందూ ధరణిన్
    కాంతునకు కాంత శత్రువు,
    కాంతుఁడు శాత్రవుఁడు గాదె కాంతకుఁ జూడన్”

    రిప్లయితొలగించండి
  10. చెంత సుగంధ సౌరభము చెన్నగు చందురు వెండివెన్నెలన్
    కంతుడు చేయు చేష్టలట కట్టలు దాటుచు వెక్కిరింప మే
    నంతట కోర్కె రేగ నిజ నాథుడు చెంతన లేని నాడు నా
    కాంతుని బోలు శాత్రవులు కాంతకు గల్గుదురే తలంచినన్

    శశిభూషణ సిద్ధాంతి, నంద్యాల,11-04-2025

    రిప్లయితొలగించండి
  11. ఉ:ఇంతుల పక్ష ముండు రచయిత్రి స్థిరమ్ముగ బల్కె నిట్టులన్
    "సుంతయు భార్య లక్షణము జూడక యగ్నిపరీక్ష వెట్టి యా
    యింతి పరీక్ష నెగ్గినను నెవ్వరొ వాగగ కాన కంపు నా
    కాంతునిఁ బోలు శాత్రవులు కాంతకుఁ గల్గుదురే తలంచినన్”
    (ఒక స్త్రీవాద రచయిత్రి రాముణ్ని ఇలా విమర్శించింది.)

    రిప్లయితొలగించండి
  12. మొదటి పూరణను కాస్త మార్చి ఇలా రాస్తున్నాను.
    (1)కం:"వింత యగుబంధమే?" మన
    యింతికి భర్తకు నడుమనె హెచ్చౌ ప్రేమల్
    కొంత చెడ కాంత శత్రువు,
    కాంతుఁడు శాత్రవుఁడు గాదె కాంతకుఁ జూడన్”
    (ప్రేమ,శత్రుత్వం రెండూ భార్యాభర్తల మధ్యే ఉంటాయి. )

    రిప్లయితొలగించండి
  13. సంతాపము నందుచు న
    త్యంత మెడఁద లోనఁ దాను ద్యాజ్యం బైనన్
    సంతత మనుమానించెడు
    కాంతుఁడు శాత్రవుఁడు గాదె కాంతకుఁ జూడన్


    సాంతము వంశ గౌరవము వ్యస్తము గాఁగ నిరంతరమ్మునున్
    వంత లొసంగ నింతులకు వారని కోర్కెలఁ జేయు చుండఁగా
    నంత మెఱుంగనట్టి దురితావళి రావణ నామ చండ భూ
    కాంతునిఁ బోలు శాత్రవులు కాంతకుఁ గల్గుదురే తలంచినన్

    రిప్లయితొలగించండి

  14. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    సుంతయు వలపే లేకను
    పంతముతో హింస పెట్టి బాధించి సతిన్
    సంతును సరిగా చూడని
    కాంతుడు శాత్రవుడు గాదె కాంతకుఁ జూడన్.

    రిప్లయితొలగించండి
  15. ఎంతగ చెప్పినన్ వినక యెవ్వరి మాటలు లెక్క చేయకే
    ధ్వాంతమునందుతిట్టుచునుతన్నుచు ప్రేలుచు కారుకూతలన్
    వింతగనాడుచున్విడకవేదనకూర్చుచునేడిపించునా
    కాంతుని బోలు శాత్రవులుకాంతకుకల్గుదురే తలంచినన్
    డా బల్లూరి ఉమాదేవి


    సుంతయు ప్రేమను చూపక
    శాంతిని నింపుచు సతతము సదనము నందున్
    వింతగ వర్తించెడు నా
    కాంతుడు శాత్రవుడు గాదె కాంతకు జూడన్

    రిప్లయితొలగించండి