ఆ.వె:తన జనాళి పైన తన విలాసముల భా రమ్ము మోపు వాడు రాజు కాదు భరత!జనులు దుఃఖ పడగ నా దుఃఖభా రమ్ముఁ గ్రోలువాఁడె రాజ్యమేలు” (రాముడు అరణ్యానికి పోతూ కూడా రాజ్యం ఎంత ధర్మం గా చెయ్యాలో భరతునికి చెప్పినట్టు.తన భారం ప్రజల మీద మోపటం కాదు.వారి భారం తాను తీసుకోవాలి.)
ఆటవెలది
రిప్లయితొలగించండిఉన్నతుండనంగ నూరూర గుడిఁగట్టి
ప్రజలు గొల్చుచుండ పాలకుడని
దాశరథినిమెచ్చి ధర్మతత్వంపు సా
రమ్ముఁ గ్రోలువాఁడె రాజ్యమేలు
ఉత్పలమాల
నమ్మకముంచి యెన్నికల నాయకుడంచును గద్దె నీయ సే
మమ్మునపాలకుండనెడు మన్ననలందుచు రామచంద్రునిన్
నెమ్మది నాచరించి తగునేర్పున నేతగ ధర్మతత్వ సా
రమ్మునుఁ గ్రోలు నా ఘనుఁడె రాజ్యము నేలు యశోధనుండునై!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఎవరు రాజ్యమేలనిమడెదరని యెంచ
రిప్లయితొలగించండితాను పుట్టినట్టి తానమయిన
పట్టమున వసించు ప్రజలొసగు సహకా
రమ్ముఁ గ్రోలువాఁడె రాజ్యమేలు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆ॥యుద్ధ నీతి నెరిగి యోగ్యత సాధించి
రిప్లయితొలగించండిప్రజల సౌఖ్యమరసి పరిణతఁ గని
ధరణియందు రాజ ధర్మసూక్ష్మముల మా
రమ్ముఁ గ్రోలు వాఁడె రాజ్యమేలు
ఉ॥ దమ్ముగ యుద్ధ విద్యలను ధాటిగ నేర్చి ప్రజాభిమానమున్
సొమ్ముగ నొందు సాధనను స్ఫూర్తినిఁ గాంచుచు జాగరూకుఁడై
నెమ్మిని రాజ్యరక్షణను నీతినిఁ బాయక సేయు ధర్మ మా
రమ్మునుఁ గ్రోలు నాఘనుఁడె రాజ్యము నేలు యశోధనుండునై
క్రోలుకు గ్రహించు (నిఘంటువు) అర్థము తీసుకున్నానండి. మారము మర్మము
రిప్లయితొలగించండిఎవడు జనులు మెచ్చె డింపైన పాలనన్
జేయునంచు నడుగ జెప్పె నిటుల
స్వస్తి గోరువాడు శ్రద్ధగా ధర్మసా
రమ్ముఁ గ్రోలువాఁడె రాజ్యమేలు.
నమ్మకముంచి యోటరులు నాయకునిన్ గెలిపించి నేతగా
నిమ్మహి నప్పగింపగ మహేంద్రుడు బాధ్యత గుర్తెరంగి శ్రే
యమ్ము జనాలకెల్లరుల కందగ జేయగ ధర్మ మర్మ సా
రమ్మునుఁ గ్రోలు నా ఘనుఁడె రాజ్యము నేలు యశోధనుండునై.
ప్రజల కోరుకొన్న పరిపాలనమ్మిడి
రిప్లయితొలగించండిసర్వ జనుల మేలు సాధ్యపడగ
సతము నేర్పు తోడ చాణక్య నీతి సా
రమ్ముఁ గ్రోలువాఁడె రాజ్యమేలు
అమ్మ యశోద ప్రశ్నలకు నాతడొసంగిన మారుమాటలే
నమ్మక వీక్షసేయ భువనమ్ములు నోటను చూపినాడహో
కిమ్మన కుండ పూతనను కేవల మాయమ చన్నులందు క్షీ
రమ్మునుఁ గ్రోలు నా ఘనుఁడె రాజ్యము నేలు యశోధనుండునై
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండినెమ్మనమందు నీశ్వరుని నిష్ఠగనిల్పి తదేక దీక్షతో
రిప్లయితొలగించండినిమ్ముగ ధర్మరక్షణము నేర్పడ సల్పుచు పేదవారి శ్రే
యమ్మునకెల్ల వేళల సమంచితరీతి శ్రమించి ధర్మసా
రమ్మునుఁ గ్రోలు నా ఘనుఁడె రాజ్యము నేలు యశోధనుండునై
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఆ. వె.
రిప్లయితొలగించండిప్రజల వృద్ధి గోరి బాటలేయ దలచి
వారి బాధలన్ని పార ద్రోలి,
యిలను,మంచి పంచి, యేల వలెనను,, సా
రమ్ముఁ గ్రోలువాఁడె రాజ్యమేలు”
సురేష్ కుమార్ రామోజు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు ఆర్యా..
తొలగించండినెమ్మనమ్మునందు నియతిగ ధర్మము
రిప్లయితొలగించండిపాదుకొలుపునట్టి ప్రాజ్ఞుడైన
ధరణినేలు దండధరునిగ ధర్మసా
రమ్ముఁ గ్రోలువాఁడె రాజ్యమేలు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసమస్య:
రిప్లయితొలగించండిరమ్మును గ్రోలు నా ఘనుడె రాజ్యము నేలు యశోధనుండునై
ఉత్పలమాల:
మమ్ముల వీడిపొమ్ము మరి మాకడ పొంచెను మామ మృత్యువై
ముమ్మరు ముద్దులిచ్చి పతి మూగపు సైగల వేగనిమ్మనన్
పొమ్మని తొందరించి తన పుత్రుని దేవకి భర్తకీయ, క్షీ
రమ్మును గ్రోలు నా ఘనుడె రాజ్యము నేలు యశోధనుండునై
ప్రజల బాగు కొఱకు పాలన సాగించు
రిప్లయితొలగించండినేత నెన్ను కొనగనాత డపుడు
చక్క నైన రీతి నిక్కుచు నధి కా
రమ్ము గ్రోలు వాడె రాజ్య మే లు
చివరి పాదంలో సాధి కా అని సవరణ చేయడమైనది
తొలగించండివమ్మొనరింపడాశలను వమ్మొనరించునరాచకంబులన్
రిప్లయితొలగించండినమ్మిన వారి గాచు శరణమ్మని వేడిన వారి సైచు దా
కమ్మగ మాటలాడు కవి గాయక వర్యుల శ్రావ్య కావ్య సా
రమ్మునుఁ గ్రోలు నా ఘనుఁడె రాజ్యము నేలు యశోధనుండునై
ఆ.వె:తన జనాళి పైన తన విలాసముల భా
రిప్లయితొలగించండిరమ్ము మోపు వాడు రాజు కాదు
భరత!జనులు దుఃఖ పడగ నా దుఃఖభా
రమ్ముఁ గ్రోలువాఁడె రాజ్యమేలు”
(రాముడు అరణ్యానికి పోతూ కూడా రాజ్యం ఎంత ధర్మం గా చెయ్యాలో భరతునికి చెప్పినట్టు.తన భారం ప్రజల మీద మోపటం కాదు.వారి భారం తాను తీసుకోవాలి.)
ఉ:క్రమ్మగ నుగ్రవాదములు కాలును చెయ్యి కదల్చ లేక ద
రిప్లయితొలగించండిద్దమ్మగ శాంతిమార్గమును దాల్చెడు నేతలు కాదు శుష్కప
థ్యమ్మును వీడి పౌరుషము దాల్చుచు వర్రగ నింత యుప్పు,కా
రమ్మునుఁ గ్రోలు నా ఘనుఁడె రాజ్యము నేలు యశోధనుండునై”
(ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా చెప్పాను.ఉప్పు,కారం తినే నాయకుడు కావాలి.ప్తస్తుతం దేశానికి ఉన్నాడు లెండి.)
భక్తిభావమూని పగలురేయియనక
రిప్లయితొలగించండిజపముతపముతోడసన్మనమున
రఘువరునితలంచి రయముగ నామసా
*“రమ్ముఁ గ్రోలువాఁడె రాజ్యమేలు”*
నమ్మినవారియాశలను న్యాయమటంచు తలంచుచున్సదా
కమ్మగమాటలాడుచునుకష్టసుఖమ్ములెరింగిదైవమున్
నమ్ముచుసాగుచున్ జనుల నమ్మకముల్ నిలుపంగధర్మసా
*“రమ్మునుఁ గ్రోలు నా ఘనుఁడె రాజ్యము నేలు యశోధనుండునై”*
నిత్య సత్య వచన నిరతుండు నుపకారి
రిప్లయితొలగించండిసజ్జన హితకారి సంతతమ్ము
మాన వోత్త మాభిమానమ్ము నతి మధు
రమ్ముఁ గ్రోలువాఁడె రాజ్య మేలు
ఇమ్మహి శక్తిమంత మనుజేశ్వరుఁ డెవ్వఁ డనంగ రాజ్య భా
రమ్మువలీలఁ బూనఁ గల రాజ కులస్థుఁడు నిశ్చయమ్ముగా
నెమ్మిఁ బ్రజాభిమాన ధన నిర్భర మాన సుధా రసమ్ముఁ దో
రమ్మునుఁ గ్రోలు నా ఘనుఁడె రాజ్యము నేలు యశోధనుండునై
ధన్యవాదములు సర్
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
ప్రజల క్షేమమునకు పాటుపడెడు వాడు
ధర్మ మార్గమందు తా చరించి
పాలనమున మెలకువలు నేర్చి వాటి సా
రమ్ముఁ గ్రోలు వాడె రాజ్యమేలు.