5, ఏప్రిల్ 2025, శనివారం

సమస్య - 5084

6-4-2025 (ఆదివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“ధనమున మోక్షంబుఁ బొందఁ దగు నెవఁడైనన్”

(లేదా...)

“ధనమే మోక్ష పథంబుఁ జూపు భవబంధచ్ఛేదముం జేయుచున్”

19 కామెంట్‌లు:

  1. కందం
    అనయము ఋజువర్తనమున
    నినవంశోత్తమ తిలకుని నెంచుచుమదిలోఁ
    బెనఁగక చింతఁ దపో సా
    ధనమున మోక్షంబుఁ బొందఁ దగు నెవఁడైనన్

    మత్తేభవిక్రీడితము
    అనయమ్మున్ ఋజువర్తనానుగతులై యర్చించి భక్త్యాత్ములై
    యినవంశోత్తము రామచంద్రుమదిలో నింపారగా నిల్పుచున్
    బెనఁగన్ మానుచు చింతలన్ మునుగ నిర్వేదాన. ,సద్ధ్యాన సా
    ధనమే మోక్ష పథంబుఁ జూపు భవబంధచ్ఛేదముం జేయుచున్

    రిప్లయితొలగించండి
  2. మనమున నీశుని నిల్పియు
    నను దిన మును దీక్ష తోడ నాపక జపమున్
    మును కొని సల్పు చు ను తపో
    ధనము న మోక్ష ంబు బొంద దగు నె వ డైన న్

    రిప్లయితొలగించండి
  3. కం॥ మనమున సద్భక్తిఁ బొదవి
    తనవున మోహము తరుగఁగ తత్పరుఁడుగనై
    తనరి శివునిఁ గొలుచు తపో
    ధనమన మోక్షంబుఁ బొందఁ దగు నెవఁడైనన్

    మ॥ తనువున్ దీరిచి శిక్షణా విధిని సద్భక్తిన్ సదాచార సా
    ధనతో నిష్ఠగ విష్ణునామమును సద్భాగ్యమ్ముగా నెంచుచున్
    మనసా యధ్యయనించి చాగగను సమ్మానించుఁ దానై తపో
    ధనమే మోక్ష పథంబుఁ జూపు భవబంధచ్ఛేదమున్ జేయుచున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మరొక పూరణ అండి (కురుసేనను చూసి బంధువర్గమని కలత చెందిన అర్జునునితో శ్రీకృష్ణుడు)

      మ॥ కనులన్ జూచుచు బంధువర్గమని భగంబొంది పౌంస్యమ్మునన్
      మనమున్ వీడఁగ భీరువందురు రిపుల్ మాన్యుండు కానేరవే
      ధనువున్ జేకొని పోరు సల్పుట కదా ధర్మంబు పార్థా యశో
      ధనమే మోక్ష పథంబుఁ జూపు భవబంధచ్ఛేదమున్ జేయున్

      తొలగించండి
  4. మునులున్ బోధొనరించినారెపుడొ
    సంపూర్ణంబుగా మానవు
    ల్లనయం బాపరమాత్మ నాత్మలో
    మరవక న్నర్చించుచున్ శ్రద్ధతో
    మనినన్ దక్కను భవ్య సత్పథము
    సుమ్మా! భక్తి మార్గంపు సా
    ధనమే మోక్షపధంబు జూపు భవ
    బంధచ్ఛేదనంజేయుచున్

    రిప్లయితొలగించండి
  5. మనసది మందిరమనుకొని
    సనాతనుడగు శివుడొకడె శాశ్వత మని నీ
    వనునిత్యము చేసెడి సా
    ధనమున మోక్షంబుఁ బొందఁ దగు నెవఁడైనన్.


    వినుమా మిత్రమ నాదు మాటలపయిన్ విశ్వా
    సమ్మునే వీడకా
    నను నిత్యమ్మును విశ్వతో ముఖుని సత్యాణ్వేషణన్ జేయుచున్
    మనసేమందిరమంచునెంచుచును సమ్మానించుచున్ చైయు సా
    ధనమే మోక్ష పథంబుఁ జూపు భవబంధచ్ఛేదముం జేయుచున్.

    రిప్లయితొలగించండి
  6. తనువుపయి మమతను విడిచి
    యనిశము పరమము పయిననె యాదట తోడన్
    మనసును నిలుపుకొనెడి సా
    ధనమున మోక్షంబుఁ బొందఁ దగు నెవఁడైనన్

    రిప్లయితొలగించండి
  7. ముహూర్త నిర్ణయములో నైధన తారను వర్జించవలెను:-

    తనరన్ లగ్నము జూడపెండ్లి కొరకై తారాబలంబేగదా
    జనులిచ్ఛింపగ క్షేమ సాధనములన్ సంపత్తు మిత్రత్వముల్
    పనిలేదింక విపత్తు జన్మములతో ప్రత్యక్కులందింక నై
    ధనమే మోక్ష పథంబుఁ జూపు భవబంధచ్ఛేదముం జేయుచున్!!

    రిప్లయితొలగించండి
  8. సునిశితమౌ కృషి తోడన్
    దన సుఖభోగంబులువిడి దైవముపైనన్
    మనసు నిలుపు వర్తని శో
    ధనమున మోక్షంబుఁ బొందఁ దగు నెవఁడైనన్

    మనసే దేవునిపైననిల్పి మరి సన్మార్గమ్ము కైరోయుచున్
    ధనమున్ వీడి తపోధనార్జనముపై తాదృష్టి సారించుచున్
    దనలోజీవుడు దైవమందు లయమౌ తత్వంబునన్ సల్పు సా
    ధనమే మోక్ష పథంబుఁ జూపు భవబంధచ్ఛేదముం జేయుచున్

    రిప్లయితొలగించండి
  9. మనమున నీశ్వరుని నిలిపి
    తనువున నణువణువునందు తాదాత్మ్యముతో
    ఘనముగ నొనరించెడు సా
    ధనమున మోక్షంబుఁ బొందఁ దగు నెవఁడైనన్

    రిప్లయితొలగించండి
  10. మనమున్ కాయము నొక్కచో నిలిపి సంభావించి సర్వేశ్వరున్
    ధనమందెన్నఁడు నిచ్ఛజూపక సదా దైవంబు నున్గొల్చుచున్
    ఘనమౌ రీతిగ దానధర్మముల తా గావించుచున్ చేయుసా
    ధనమే మోక్ష పథంబుఁ జూపు భవబంధచ్ఛేదముం జేయుచున్

    రిప్లయితొలగించండి
  11. కనులను తెరచిన కాలము
    తనువుయు నెపుడును నడపుచు ధర్మమునందున్
    మనమున భగవానుని ప్రా
    ర్ధనమున మోక్షంబుఁ బొందఁ దగు నెవఁడైనన్

    రిప్లయితొలగించండి
  12. కం:తన జాతి యేమి యైనను
    ఘన మగు మోక్షేచ్ఛ,శ్రద్ధ గలిగిన,యోగ
    మ్మును పాటించిన తత్సా
    ధనమున మోక్షంబుఁ బొందఁ దగునెవఁడైనన్”

    రిప్లయితొలగించండి
  13. మ:ఘనదారిద్ర్యయుతుండు తిండి కరవై కాంక్షించునే మోక్షమున్?
    ఘనమౌ సంపద గల్గ దాని నెపుడున్ కాపాడుటే కోరు ,జా
    లిన యంతే తన కుండి తృప్తి పడి పాలింపంగ సద్భక్తిసా
    ధనమే మోక్ష పథంబుఁ జూపు భవబంధచ్ఛేదముం జేయుచున్”

    రిప్లయితొలగించండి
  14. (3)మ:ఘనుడా యోగియె,వాని దర్శనమె మోక్షమ్మిచ్చు నన్ ప్రాఖ్య వ
    చ్చెను కానీ పదపూజ జేయ బది వేల్ చెల్లించ లే నైతి నన్
    గనునా యోగి?ధనాఢ్యులే యచట మెల్గన్ శక్తు లేమో! కలిన్
    ధనమే మోక్ష పథంబుఁ జూపు భవబంధచ్ఛేదముం జేయుచున్”
    (గొప్ప గొప్ప స్వామీజీల వద్ద ధనికుల,వ్యాపారుల పలుకుబడి చూస్తే సామాన్య భక్తునికి ఇలా అనిపిస్తుంది.ఇది ఈనాటి ఆధ్యాత్మికసంస్థల తీరు.)

    రిప్లయితొలగించండి
  15. మనమున శ్రద్ధను బూనియు
    వినయముతో గురువు వద్ద విద్యను నేర్వన్
    ఘనకీర్తి గలుగు...విద్యా
    ధనమున మోక్షంబుఁ బొందఁ దగు నెవఁడైనన్

    రిప్లయితొలగించండి
  16. వనజాక్షునిపై సద్భ
    క్తి నిలిపి వేదోక్త భంగిఁ దీర్చినఁ బనులన్
    మనుజాళి ననవరత సా
    ధనమున మోక్షంబుఁ బొందఁ దగు నెవఁ డైనన్


    అనివార్యం బిల జన్మసంభవము పాపాలోచ నానీక సం
    హన నాబంధము లాభ హీన నిజ కర్మాసక్తి మర్త్యాలికిన్
    ఘన లోభావృత మోహ రోష మద కాంక్షారణ్య దావాన లేం
    ధనమే మోక్ష పథంబుఁ జూపు భవబంధచ్ఛేదముం జేయుచున్

    రిప్లయితొలగించండి
  17. ధనమే నిత్యము సత్యమంచుఁ బలు విద్యల్సూపి యార్జించు సా
    ధనమే యొక్క విశేషలక్ష్యమయినన్ "దానొక్కడైపోవు" నిం
    ధనమై గర్వము లెక్క సేయకయె బంధాలన్; విలోకించినన్
    “ధనమే మోక్ష పథంబుఁ జూపు భవబంధచ్ఛేదముం జేయుచున్”

    రిప్లయితొలగించండి

  18. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    అనయము నడచుచు ఋజు వ
    ర్తనమున దేవుని భజించి ప్రతి దినమందున్
    మనసున భక్తి యనెడు సా
    ధనమున మోక్షంబుఁ బొందఁ దగు నెవడైనన్.

    రిప్లయితొలగించండి