14, జులై 2026, మంగళవారం

సమస్య - 5528

15-7-2026 (బుధవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“విశ్వమానవసేవయే వేదన నిడె”
(లేదా...)
“విశ్వమానవసేవ మిక్కిలి వేదనన్ మిగిలించెలే”

7 కామెంట్‌లు:

  1. మనసు కోరెడు రీతిగ మనెదననగ
    వయసు మీరిన కతమున వలనుకాక
    వాడుకగ సలుపు చుండెడి పనియయినను
    విశ్వమానవసేవయే వేదన నిడె

    రిప్లయితొలగించండి
  2. కాశీ'విశ్వ'నాథునితో ఒక దేశభక్తుడు:

    తేటగీతి
    తెల్లవారలు భారతదేశము విడ
    శాంత్యహింసల సాధింప జాతిపితగ!
    కాని వాడని నాథురాం కాల్చనకట!
    విశ్వ! మానవసేవయే వేదన నిడె

    మత్తకోకిల
    ఈశ్వరున్దలఁదాల్చి గాంధి యహింస, సత్యము లెంచుచున్
    శాశ్వతమ్ముగఁ బంపె మ్లేచ్చుల జాతికే పితరుండనన్
    నశ్వరమ్మని వారిబాటయె 'నాథురామ్' కసి కూల్చెనే!
    విశ్వ!మానవసేవ మిక్కిలి వేదనన్ మిగిలించెలే!

    రిప్లయితొలగించండి
  3. తేటగీతి:
    రంతిదేవునికీవి నరకమొసగెనె?
    అభవమందజేసె హరియె యంత్యమందు!
    పాటులేమిజేసె పరమభాగవతుల?
    విశ్వ మానవ సేవ 'యే' వేదననిడె?

    రిప్లయితొలగించండి

  4. బానిసత్వమున్ మ్రగ్గెడి భరత జాతి
    స్వేచ్ఛ గోరి నాడట సమ్మె చేసి నట్టి
    కరముచందు గాంధి నొకడు కాల్చి చంపె
    విశ్వమానవసేవయే వేదన నిడె.


    శాశ్వతమ్మగు స్వేచ్ఛ గోరుచు సమ్మె జేసిన గాంధియే
    విశ్వమందు మతాంత రమ్ముల భేదమెంచకు మంచనే
    నిస్వనమ్మది నచ్చదంచును నిష్ఠురుండట కాల్చెనే
    విశ్వమానవసేవ మిక్కిలి వేదనన్ మిగిలించెలే.

    రిప్లయితొలగించండి
  5. విశ్వమిత్రులై తనరారు వేదవిదులు
    విశ్వశాంతికి బాటలన్ వేసిరి గద
    విశ్వమానవసేవయే! వేదన నిడె
    విశ్వకద్రుల కలహాలు పెచ్చురేగ

    నశ్వరంబగు జీవితమ్మని నాడు తల్చిన మౌనులే
    విశ్వశాంతికి దూపటిల్లిన వేళ సల్పిరి చక్కనౌ
    విశ్వమానవసేవ; మిక్కిలి వేదనన్ మిగిలించెలే
    విశ్వకద్రులు మాటిమాటికి విచ్చుకత్తులు దూయగా

    రిప్లయితొలగించండి
  6. విశ్వ మెల్లను కాచు ఈశుని వేడు కొంచును భక్తితో
    విశ్వ శాంతిని కోరు చుండెడు విశ్ర మించని బాపునున్
    విశ్వ సించక కాల్చి చంపెగ భీకరంబుగ నాథురామ్
    విశ్వమానవ సేవ మిక్కిలి వేదనన్ మిగిలించెలే

    రిప్లయితొలగించండి