కం:ఇతడు గణపతియె, మరి గణ పతి ప్రక్కన గీసె తీవు పార్వతి నా ? నా మతికిన్ లక్ష్మి గా దోచెను స్థితరూపముఁ గని పలుకుము శ్రీయొ యగజయో” (గణపతి ప్రక్కన స్త్రీ దేవత ను గీసాడు. పార్వతి కావచ్చు.లక్ష్మీ గణపతి బొమ్మ ఐతే ఆమె లక్ష్మి ఐ యుండ వచ్చు. )
మ:సుత! లక్ష్మీగణపత్యుపాసకుడ నంచున్ దెల్పు నీ దీక్ష తో నతిభక్తిన్ వెలయించు శిల్పమున నా యంబన్ బరీక్షించితే? మతిలో భావము శిల్ప మందు నెటులో మారెన్ గదా! శిల్పసం స్థితరూపమ్మును జూచి పల్కుమిపుడే శ్రీదేవియో గౌరియో” (లక్ష్మీ గణపతి శిల్పం చెక్క బోతే ఆ భావం శిల్పం లో లేక ఆమె లక్ష్మియా? పార్వతియా? అనే సందేహం వచ్చింది. )
అతులితమౌ జ్ఞానివిగద ,
రిప్లయితొలగించండితతంగ మంతటను జుచి తప్పు సలుపకన్
చతురుడవగుచో నీవా
స్థితరూపముఁ గని పలుకుము శ్రీయొ యగజయో”
రిప్లయితొలగించండిస్మిత వదనము కరమందును
శత పత్రము రక్త వర్ణ సంవ్యాసముతో
ద్యుతినొలుకు నయనము లవ
స్థితరూపముఁ గని పలుకుము శ్రీయొ యగజయో.
శత పత్రమ్మది యాసనమ్ము కరమున్ సారంగమున్ దాల్చి రో
హిత వర్ణాంబర ధారియై కారముతో హేమంబు నే రాల్చుచున్
ద్యుతితోభాసిలు నేత్ర రాజములతో ద్యోతించెనే య య్యవ
స్థితరూపమ్మును జూచి పల్కుమిపుడే శ్రీదేవియో గౌరియో.
వ్రతదీక్షాపరులౌ దం
రిప్లయితొలగించండిపతులకు పుట్టెను గొమరిత వ్రతఫలమనగా
రతనంబును బోలెడి సం
స్థితరూపముఁ గని పలుకుము శ్రీయొ యగజయో
పతియుంబత్నియు సంతు కోరి సతమున్ బ్రార్థించిరాదైవమున్
జతగా తామొనరించినట్టి వ్రతముల్ సాకారమౌ రీతినిన్
రతనంబున్ దలపించునట్టి సుత సంప్రాప్తించె నీనాడు సం
స్థితరూపమ్మును జూచి పల్కుమిపుడే శ్రీదేవియో గౌరియో
పతిదేవుని యురమున శా
రిప్లయితొలగించండిశ్వతముగ తానుండు నెవరు? పతి దేహమునన్
స్థితమగు నర్ధాంగి యెవరు?
స్థితరూపముఁ గని పలుకుము శ్రీయొ యగజయో
సతి తానెవ్వరు భర్త గుండియ నివాసంబై చరించున్ సదా
రిప్లయితొలగించండిపతిదేహంబున తా వశించి సగమై భాసిల్లె నేదేవియో
సతతం బిర్వురిలోన నెవ్వరిని విశ్వాసించి పూజింతువో
స్థితరూపమ్మును జూచి పల్కుమిపుడే శ్రీదేవియో గౌరియో
మనసా!
రిప్లయితొలగించండికందం
పతనావస్థన్ జననిన్
గతిజూపియు వలయు శక్తిఁ గలుగఁగ భక్తిన్
నుతియింప వెలసిన వ్యవ
స్థితరూపముఁ గని పలుకుము శ్రీయొ! యగజయో!
మత్తేభవిక్రీడితము
పతనావస్థకుఁ జేరితిన్ బ్రతుకునన్ బాధింప లోకమ్మదే
గతినీవే తగఁ జూపి శక్తి జననీ! గల్గింప రమ్మంచు నే
నుతియింపన్ గరుణాంతరంగ నిలిచెన్ దోడుండ నా ముందు సం
స్థితరూపమ్మును జూచి పల్కుమిపుడే శ్రీదేవియో! గౌరియో!
మ॥ స్థితరూపమ్మును జూచి పల్కుమిపుడే శ్రీదేవియో గౌరియో
రిప్లయితొలగించండిమతి చాంచల్యమొ యిద్దరొక్కటియె సంభావించి సద్భక్తితో
నుతులన్ బూజల సేయుమిర్వురనటుల్ నోముల్ ధరన్ నోచుచున్
వెతలున్ వీడును రూప భేధముననే వేరింతియే గాదొకో
మతి నుప యో గించు చు
రిప్లయితొలగించండిప్రతిమల ను పరీక్ష చేసి వచి యింప వలె న్
చతురము గా యోచించు చు
స్థిత రూపము గని పలుకుము శ్రీ యొ యగజ యో?
కం:ఇతడు గణపతియె, మరి గణ
రిప్లయితొలగించండిపతి ప్రక్కన గీసె తీవు పార్వతి నా ? నా
మతికిన్ లక్ష్మి గా దోచెను
స్థితరూపముఁ గని పలుకుము శ్రీయొ యగజయో”
(గణపతి ప్రక్కన స్త్రీ దేవత ను గీసాడు. పార్వతి కావచ్చు.లక్ష్మీ గణపతి బొమ్మ ఐతే ఆమె లక్ష్మి ఐ యుండ వచ్చు. )
మ:సుత! లక్ష్మీగణపత్యుపాసకుడ నంచున్ దెల్పు నీ దీక్ష తో
రిప్లయితొలగించండినతిభక్తిన్ వెలయించు శిల్పమున నా యంబన్ బరీక్షించితే?
మతిలో భావము శిల్ప మందు నెటులో మారెన్ గదా! శిల్పసం
స్థితరూపమ్మును జూచి పల్కుమిపుడే శ్రీదేవియో గౌరియో”
(లక్ష్మీ గణపతి శిల్పం చెక్క బోతే ఆ భావం శిల్పం లో లేక ఆమె లక్ష్మియా? పార్వతియా? అనే సందేహం వచ్చింది. )
సతతం బుండఁగ గళమున
రిప్లయితొలగించండిసతియై సరసను వెలుంగ సంతోషముగన్
మతి నూహించి వెస నుప
స్థిత రూపముఁ గని పలుకుము శ్రీయొ యగజయో
[శ్రీ = విషము; అగజ = పార్వతి]
సతతం బెన్న సతీ విలోలు లిరువుర్ సందేహ శూన్యమ్ముగా
నుత నారాయణ నాగభూషణులు నే నోరార వాకృచ్చెదన్
స్తుత నారీ మణు లెవ్వ రెవ్వరఁట వక్షోభాగ వామార్ధ సం
స్థిత రూపమ్మును జూచి పల్కు మిపుడే శ్రీదేవియో గౌరియో
భర్త భార్యతో
రిప్లయితొలగించండిఅతులమ్మౌ గృహబాధలన్ మడచగా, యత్యంత నెయ్యమ్ముతో
గతినీవే యని మ్రొక్క పార్వతికి నాకాంక్షించి సౌభాగ్యమున్
సతి! కన్పించె వరాలతల్లి యదిగో! సౌజన్యమున్ జూపి సం
స్థితరూపమ్మును జూచి పల్కుమిపుడే శ్రీదేవియో గౌరియో!
భార్యను పొగుడుతూ
రిప్లయితొలగించండిప్రతిరూపంబగు నీదు మోము గనినన్ బ్రాహ్మీసమా భాసిలున్
నతనీలాలక భామినీ నిను గనన్ నారాయణీ తోచెడున్
గతిసౌందర్యము నీకు సాటి యనగా గంగాధరున్ రాణియే
స్థితరూపమ్మును జూచి పల్కుమిపుడే శ్రీదేవియో గౌరియో
#ఛందం #యంత్రం
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
వెతలన్ బాపుదు వనుచును
సతతము పూజింతు వీవు సద్భక్తి మెయిన్
స్తుతులందించగ శుభ సం
స్థితరూపముఁ గని పలుకుము శ్రీయొ,
యగజయో!