29-8-2026 (శనివారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రమ్ము నిడెదరంట స్త్రీలు రమకున్ భక్తిన్”
(లేదా...)
“రమ్ము నొసంగుచుందురఁట రామలు లక్ష్మికి నిండు భక్తితోన్”
('అనంతచ్ఛందం' వారి సమస్య)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
మధ్యే.. మధ్యే.. పానీయం సమర్పయామి....కందంకమ్మని ప్రసాదములమర నిమ్ముగ స్తోత్రాలఁ గొలచి నీరాజనముల్నెమ్మి నివేదింపఁగ నీరమ్ము నిడెదరంట స్త్రీలు రమకున్ భక్తిన్ఉత్పలమాల కమ్మని సుప్రసాదముల కంచములందునఁ బేర్చి పంక్తిగానిమ్ముగ స్తోత్రముల్ సదివి నీరజలోచన మోదమొందగన్ నెమ్మి నివేదనల్ సలుప నిష్ఠగఁ దీరిచి మధ్యమధ్య నీరమ్ము నొసంగుచుందురఁట రామలు లక్ష్మికి నిండు భక్తితోన్
ఇమ్ముగ నింటి ముంగిట వరించెడి ముగ్గుల మోదకాంతులున్నెమ్మినొసంగు నవ్య సుమనిర్మల రమ్య నికుంజమాలికల్సమ్ముదమందు దేవికిడిచక్కని పీఠి యమర్చి రూప సారమ్ము నొసంగుచుందురటరామలు లక్ష్మికి నిండుభక్తితోన్!
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
సొమ్ములిడగ గుడియందలి యమ్మదరికి జేరి యామెనడుగు దలపుతోఇమ్మగు రీతిగ గయివా రమ్ము నిడెదరంట స్త్రీలు రమకున్ భక్తిన్”
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
అమ్మను కొలిచిన సౌభా గ్యమ్మని పెద్దలు వచింప కాంచన మయమౌ బొమ్మకు చేమంతుల హా రమ్ము నిడెదరంట స్త్రీలు రమకున్ భక్తిన్.కొమ్మలు నమ్మి కొల్చినను కోరిన కోరిక లెల్ల తీర్చు నా యమ్మ యటంచు చెప్పగనె యచ్చట నున్న చొకార మొప్పెడిన్ బొమ్మయె లోకమాత యని పూవులు గాజులె కాక రత్న హా రమ్ము నొసంగుచుందురఁట రామలు లక్ష్మికి నిండు భక్తితోన్.
నమ్మితి నిన్నే సంపదలిమ్మని వేడుచు కొలుతురు లిబ్బపడతినేనెమ్మనమున కుట్మల హారమ్ము నిడెదరంట స్త్రీలు రమకున్ భక్తిన్అమ్మను గొల్చినన్ గలుగు హాయిగ సంపద లంచు భక్తులేనెమ్మనమందు నమ్మి జననీ వరమిమ్మని పూజసల్పుచున్గమ్మని పిండివంటలును గంధము కుంకుమ తమ్మి పూల హా రమ్ము నొసంగుచుందురఁట రామలు లక్ష్మికి నిండు భక్తితోన్
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
కొమ్మలు లక్ష్మి ని గొలుచుచు కమ్మగ నుతుల నొనర్చి రి గానము జేతన్ సొమ్ములు ధరియించి యు హా రమ్ము నిడె ద రంట స్త్రీ లు రమకు న్ భక్తిన్
నెమ్మనమున్ స్థిరంబుగను నిల్పి ప్రభూత విరాళి తోడ పెద్దమ్మను గొల్చుచున్ పలువిధంబుల పువ్వులుతో యజించుచున్ కమ్మని పిండివంటలు సుగంధము తోడగ దివ్యమైన హారమ్ము నొసంగు చుందురట రామలు లక్ష్మికి నిండు భక్తి తోన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు."పువ్వులతో"
-తమ్ములు పెద్దన్నల తోరమ్ముల సంతస బరచి బరాతము గొని, మాయమ్మా! గావుమనుచు హా రమ్ము నిడెదరంట స్త్రీలు రమకున్ భక్తిన్జిలేబీయంత్రము
సమ్ముదముగ కోవెలలోనిమ్ముగ పూజలను సల్పి యిచ్ఛలు దీర్చన్కమ్మని భక్ష్యములును క్షీరమ్ము నిడెదరంట స్త్రీలు రమకున్ భక్తిన్
ఇమ్ముగ రత్న పీఠమున నింతులు లక్ష్మిని గొల్వుదీర్చి మోదమ్ముగ నర్ఘ్యపాద్యముల దల్లికి పూజలు సల్పి దీక్షతోనిమ్మని భోగభాగ్యముల నెల్లరికిన్ కుశలమ్మటంచు క్షీరమ్ము నొసంగుచుందురఁట రామలు లక్ష్మికి నిండు భక్తితోన్
కం:రమ్ము గుడి కి నీ భృగు వారమ్మును మనసార, భక్తి రంజిల సింగారమ్మున్ జేసి నగల భారమ్ము నిడెదరంట స్త్రీలు రమకున్ భక్తిన్
ఉ:రమ్ము బిరమ్మునన్ గుడికి, రానని చేయకు నీవు వట్టి గారమ్మును భక్తి మీర వరలక్ష్మికి శ్రావణమాసశుక్రవారమ్మున గోర్కెలన్ దెలిపి రంజిలగా నగ లిచ్చి పుష్పహారమ్ము నొసంగుచుందురఁట రామలు లక్ష్మికి నిండు భక్తితోన్”
ఉ॥ ఇమ్మహి సంపదాదులకు నిందిర దేవత యంచు నమ్ముచున్ నెమ్మినిఁ బూజ సేయఁగను నేమము మీరఁగ శ్రావణమ్మునన్బెమ్మినిఁ గాంచి ప్రోచునని ప్రీతిగ మ్రొక్కుచు కాంచనంపు హారమ్ము నొసంగు చుందురఁట రామలు లక్ష్మికి నిండు భక్తితో(శ్రావణ మాసము వరమహాలక్ష్మి పూజలో నగలు అమ్మవారికి పెట్టడం ఆనవాయితి అండి)
ఇమ్ముగ శ్రావణమ్మున స్తుతించుచు నిందిర చిత్తశుద్ధి స్వ చ్ఛమ్మగు నీరమున్ సలిపి స్నానముఁ దాలిచి నూత్న వస్త్రముల్ కమ్మని పాయసాన్నములు గారెలు, బూరెల తోడ గోవు క్షీరమ్ము నొసంగుచుందురఁట రామలు లక్ష్మికి నిండు భక్తితోన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమధ్యే.. మధ్యే.. పానీయం సమర్పయామి....
తొలగించండికందం
కమ్మని ప్రసాదములమర
నిమ్ముగ స్తోత్రాలఁ గొలచి నీరాజనముల్
నెమ్మి నివేదింపఁగ నీ
రమ్ము నిడెదరంట స్త్రీలు రమకున్ భక్తిన్
ఉత్పలమాల
కమ్మని సుప్రసాదముల కంచములందునఁ బేర్చి పంక్తిగా
నిమ్ముగ స్తోత్రముల్ సదివి నీరజలోచన మోదమొందగన్
నెమ్మి నివేదనల్ సలుప నిష్ఠగఁ దీరిచి మధ్యమధ్య నీ
రమ్ము నొసంగుచుందురఁట రామలు లక్ష్మికి నిండు భక్తితోన్
ఇమ్ముగ నింటి ముంగిట వ
రిప్లయితొలగించండిరించెడి ముగ్గుల మోదకాంతులున్
నెమ్మినొసంగు నవ్య సుమ
నిర్మల రమ్య నికుంజమాలికల్
సమ్ముదమందు దేవికిడి
చక్కని పీఠి యమర్చి రూప సా
రమ్ము నొసంగుచుందురట
రామలు లక్ష్మికి నిండుభక్తితోన్!
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిసొమ్ములిడగ గుడియందలి
రిప్లయితొలగించండియమ్మదరికి జేరి యామెనడుగు దలపుతో
ఇమ్మగు రీతిగ గయివా
రమ్ము నిడెదరంట స్త్రీలు రమకున్ భక్తిన్”
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఅమ్మను కొలిచిన సౌభా
గ్యమ్మని పెద్దలు వచింప కాంచన మయమౌ
బొమ్మకు చేమంతుల హా
రమ్ము నిడెదరంట స్త్రీలు రమకున్ భక్తిన్.
కొమ్మలు నమ్మి కొల్చినను కోరిన కోరిక లెల్ల తీర్చు నా
యమ్మ యటంచు చెప్పగనె యచ్చట నున్న చొకార మొప్పెడిన్
బొమ్మయె లోకమాత యని పూవులు గాజులె కాక రత్న హా
రమ్ము నొసంగుచుందురఁట రామలు లక్ష్మికి నిండు భక్తితోన్.
నమ్మితి నిన్నే సంపద
రిప్లయితొలగించండిలిమ్మని వేడుచు కొలుతురు లిబ్బపడతినే
నెమ్మనమున కుట్మల హా
రమ్ము నిడెదరంట స్త్రీలు రమకున్ భక్తిన్
అమ్మను గొల్చినన్ గలుగు హాయిగ సంపద లంచు భక్తులే
నెమ్మనమందు నమ్మి జననీ వరమిమ్మని పూజసల్పుచున్
గమ్మని పిండివంటలును గంధము కుంకుమ తమ్మి పూల హా
రమ్ము నొసంగుచుందురఁట రామలు లక్ష్మికి నిండు భక్తితోన్
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండికొమ్మలు లక్ష్మి ని గొలుచుచు
రిప్లయితొలగించండికమ్మగ నుతుల నొనర్చి రి గానము జేతన్
సొమ్ములు ధరియించి యు హా
రమ్ము నిడె ద రంట స్త్రీ లు రమకు న్ భక్తిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినెమ్మనమున్ స్థిరంబుగను నిల్పి ప్రభూత విరాళి తోడ పె
రిప్లయితొలగించండిద్దమ్మను గొల్చుచున్ పలువిధంబుల పువ్వులుతో యజించుచున్
కమ్మని పిండివంటలు సుగంధము తోడగ దివ్యమైన హా
రమ్ము నొసంగు చుందురట రామలు లక్ష్మికి నిండు భక్తి తోన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి"పువ్వులతో"
-
రిప్లయితొలగించండితమ్ములు పెద్దన్నల తో
రమ్ముల సంతస బరచి బరాతము గొని, మా
యమ్మా! గావుమనుచు హా
రమ్ము నిడెదరంట స్త్రీలు రమకున్ భక్తిన్
జిలేబీయంత్రము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసమ్ముదముగ కోవెలలో
రిప్లయితొలగించండినిమ్ముగ పూజలను సల్పి యిచ్ఛలు దీర్చన్
కమ్మని భక్ష్యములును క్షీ
రమ్ము నిడెదరంట స్త్రీలు రమకున్ భక్తిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఇమ్ముగ రత్న పీఠమున నింతులు లక్ష్మిని గొల్వుదీర్చి మో
రిప్లయితొలగించండిదమ్ముగ నర్ఘ్యపాద్యముల దల్లికి పూజలు సల్పి దీక్షతో
నిమ్మని భోగభాగ్యముల నెల్లరికిన్ కుశలమ్మటంచు క్షీ
రమ్ము నొసంగుచుందురఁట రామలు లక్ష్మికి నిండు భక్తితోన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండికం:రమ్ము గుడి కి నీ భృగు వా
రిప్లయితొలగించండిరమ్మును మనసార, భక్తి రంజిల సింగా
రమ్మున్ జేసి నగల భా
రమ్ము నిడెదరంట స్త్రీలు రమకున్ భక్తిన్
ఉ:రమ్ము బిరమ్మునన్ గుడికి, రానని చేయకు నీవు వట్టి గా
రిప్లయితొలగించండిరమ్మును భక్తి మీర వరలక్ష్మికి శ్రావణమాసశుక్రవా
రమ్మున గోర్కెలన్ దెలిపి రంజిలగా నగ లిచ్చి పుష్పహా
రమ్ము నొసంగుచుందురఁట రామలు లక్ష్మికి నిండు భక్తితోన్”
ఉ॥ ఇమ్మహి సంపదాదులకు నిందిర దేవత యంచు నమ్ముచున్
రిప్లయితొలగించండినెమ్మినిఁ బూజ సేయఁగను నేమము మీరఁగ శ్రావణమ్మునన్
బెమ్మినిఁ గాంచి ప్రోచునని ప్రీతిగ మ్రొక్కుచు కాంచనంపు హా
రమ్ము నొసంగు చుందురఁట రామలు లక్ష్మికి నిండు భక్తితో
(శ్రావణ మాసము వరమహాలక్ష్మి పూజలో నగలు అమ్మవారికి పెట్టడం ఆనవాయితి అండి)
ఇమ్ముగ శ్రావణమ్మున స్తుతించుచు నిందిర చిత్తశుద్ధి స్వ
రిప్లయితొలగించండిచ్ఛమ్మగు నీరమున్ సలిపి స్నానముఁ దాలిచి నూత్న వస్త్రముల్
కమ్మని పాయసాన్నములు గారెలు, బూరెల తోడ గోవు క్షీ
రమ్ము నొసంగుచుందురఁట రామలు లక్ష్మికి నిండు భక్తితోన్