31-8-2026 (సోమవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చీమనుఁ జూచి భీతిలెను సింహము గ్రూరమృగాభిశంకతో”
(లేదా...)
“చీమం జూచి భయపడెను సింహమ్ము గడున్”
(పట్వర్ధన్ గారి శతావధానంలో పోటు హైమవతి గారి సమస్య)
కందంపాములు శార్దాలమ్ములుఁదాముగ ప్రహ్లాదుముందు తగ్గి నిలువఁగానేమిదియని వడకె భటుడుచీమం జూచి భయపడెను సింహమ్ము గడున్!ఉత్పలమాలసేమము గాదు శ్రీహరిని చిత్తమునింపి భజించుటన్నఁదానీమము దప్పకే కొలువ, నిల్పిన కానల బాలభక్తుఁ దామేమన కున్నఁ బెబ్బులులు మీదట సైనికుడెంతొ జంకెనేచీమనుఁ జూచి భీతిలెను సింహము గ్రూరమృగాభిశంకతో!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
ఏమాత్రము నమ్మదగని దౌ మాటను గూర్చి మాకు దబ్బుమనగనేయా మాటకాడనె నిటులచీమం జూచి భయపడెను సింహమ్ము గడున్”
కందం
రిప్లయితొలగించండిపాములు శార్దాలమ్ములుఁ
దాముగ ప్రహ్లాదుముందు తగ్గి నిలువఁగా
నేమిదియని వడకె భటుడు
చీమం జూచి భయపడెను సింహమ్ము గడున్!
ఉత్పలమాల
సేమము గాదు శ్రీహరిని చిత్తమునింపి భజించుటన్నఁదా
నీమము దప్పకే కొలువ, నిల్పిన కానల బాలభక్తుఁ దా
మేమన కున్నఁ బెబ్బులులు మీదట సైనికుడెంతొ జంకెనే
చీమనుఁ జూచి భీతిలెను సింహము గ్రూరమృగాభిశంకతో!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఏమాత్రము నమ్మదగని
రిప్లయితొలగించండిదౌ మాటను గూర్చి మాకు దబ్బుమనగనే
యా మాటకాడనె నిటుల
చీమం జూచి భయపడెను సింహమ్ము గడున్”