22-10-2026 (గురువారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రాణ్మహేంద్రిలో నొక్కటే రాలు మణులు”
(లేదా...)
“రాణ్మహేంద్రవరమ్మునందున రాలు రత్నము లొక్కటే”
(మొన్న రాజమండ్రిలో న.చ. సాహిత్ అష్టావధానంలో నేను ఇవ్వాలకున్న సమస్య. కాని తీరా సమయానికి నన్ను సంచాలకుణ్ణి చేశారు)
భారతావని నంతను బట్టిచూడ
రిప్లయితొలగించండిఆంధ్ర భాషపై పరిహాస మాడుట యగు
రాణ్మహేంద్రిలో నొక్కటే ; రాలు మణులు
కాదు రాళ్ళు , వినిన వారి కయిల నుండి
తేటగీతి:
రిప్లయితొలగించండికళల కాణాచి నిలయము కవివరులకు
గలగలా పారు గోదారి గంగనీరు
పంట భూములు తలపించు పసిడి గనులు
రాణ్మహేంద్రిలో నొక్కటే రాలు మణులు
మత్తకోకిల:
మృణ్మయమ్మగు పంటభూములు మేలు బంగరు క్షేత్రముల్
రాణ్మహేంద్రియె నన్నయార్యుని రాజితమ్మగు ధామమే
రాణ్మహేంద్రుఁడు రాజరాజు విరాజమానఁపు పాలనన్
రాణ్మహేంద్రవరమ్మునందున రాలు రత్నము లొక్కటే
కవి వరే ణ్యు ల కేలోటు కాను పింప
రిప్లయితొలగించండిదట్టి పురమున వెలసియు నలరు నట్టి
కవిత లన్నియు శ్రేష్ఠ మై కమ్ర మగుచు
రా ణ్మ హేంద్రి లో నొక్కటే రాలు మణులు
షణ్మహాంగవిభాసవేదవిచారదక్షులు, సాహితీ
రిప్లయితొలగించండిత్విణ్మనోజ్ఞయశస్వరూపులు, ధీప్రకాండులు, కర్షకుల్,
ద్విణ్మదాంతకదివ్యశస్తసువీర్యు లందఱు నందఱే
రాణ్మహేంద్రవరమ్మునందున రాలు రత్నము లొక్కటే.
రిప్లయితొలగించండికవుల బోషించు వారలే కలరచోట
నీదు పాండిత్యమును గాంచ నిశ్చయముగ
సత్కృతము దక్కు నచ్చోట సత్య మిదియె
రాణ్మహేంద్రిలో నొక్కటే రాలు మణులు.
రాణ్మహాత్ములు మెచ్చు కైతల వ్రాసెడిన్ గవి శ్రేష్టులన్
రాణ్మహేంద్రవరమ్ము నేలెడి రాజ రాజ నరేంద్రడే
షణ్మహాంగ విభాస వేదుల సత్కృతమ్మును జేయగా
రాణ్మహేంద్రవరమ్మునందున రాలు రత్నము లొక్కటే.
షణ్ముఖాలయమునఁ జూడ చక్కనైన
రిప్లయితొలగించండిమృణ్మయ కలశము లభించె మెలుతకిచట
షణ్మతంబులు మెలఁగగ సమత తోడ
రాణ్మహేంద్రిలో నొక్కటే రాలు మణులు
మృణ్మయాలయ మొక్కటున్నది మేము గాంచిన తావునన్
షణ్ముఖుండిట దర్శనంబిడు సర్వవేళల యందునన్
షణ్మతంబుల వారికున్నవి సామ్యవాదపు భావనల్
రాణ్మహేంద్రవరమ్ము నందున రాలు రత్నము లొక్కటే