25, అక్టోబర్ 2026, ఆదివారం

సమస్య - 5631

26-10-2026 (సోమవారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“తనయుఁడు జనించక మునుపె తాత యయ్యె”

(లేదా...)

“ఇంకన్ బుత్రుఁడె పుట్టలేదు మనుమం డేతెంచెఁ దాతన్ గనన్”

5 కామెంట్‌లు:

  1. తేటగీతి
    నాకు తమ్ములు పదిమంది చేకురంగ,
    పెద్దకూతురికిన్ నేనుఁ బెళ్ళిఁ జేయఁ
    దనయ పుట్టెను,చిన్న సోదరునికింక
    తనయుఁడు జనించక మునుపె తాత యయ్యె!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శార్దూలవిక్రీడితము
      సంకోచించక పూరణన్ సలుపుదున్ సాధింతు నుత్తీర్ణతన్
      శంకన్ వీడుము నాకుతమ్ములన నెంచన్ వారు రెండైదులున్
      శ్రీంకారీ సుత నాకిడన్ మనుమనిన్, చిన్నోడు తమ్మయ్యకే
      యింకన్ బుత్రుఁడె పుట్టలేదు! మనుమం డేతెంచెఁ దాతన్ గనన్!!

      తొలగించండి
  2. పుత్రునికై చూస్తున్న దంపతులకు

    వెంకమ్మా చినరాజు దంపతులకున్ వెన్వెంటనే పుట్టె నీ
    ఆంకాళ్ళమ్మ, మునెమ్మ, లచ్చి చినవెంకాయమ్మ, సూరమ్మలున్
    కుంకుళ్ళమ్మయు, రాములమ్మ, సిరియున్ కొండమ్మ పిచ్చమ్మయున్
    ఇంకన్ బుత్రుఁడె పుట్టలేదు మనుమం డేతెంచెఁ దాతన్ గనన్

    రిప్లయితొలగించండి
  3. ఏళ్ళు గడిచె పురుష బిడ్డ యెసగ కుండె
    ఆడు బిడ్డ యెదిగినంత యత్త వారి
    సదనముకుపంప నరుదెంచె సంతు తోడ
    తనయుఁడు జనించక మునుపె తాత యయ్యె”

    రిప్లయితొలగించండి

  4. బ్రహ్మచారి భ్రాత సుతుని భార్య కచట
    స్వజుడొకడు బుట్ట మిత్రులు పలికి రిట్లు
    వయసు మీర కుండనె నందివర్ధను డిట
    తనయుఁడు జనించక మునుపె తాత యయ్యె.


    శంకింపన్ పని లేదు శాంతనవుడే సంగ్రామమందున్ గనన్
    ఖాంకుండై చెలగంగ పాండవులు పోకాడంగ సంపత్తి కై
    సంకోచమ్మది యుండబోదన కృపాచార్యుం డిటుల్ పాల్కె నే
    యింకన్ బుత్రుఁడె పుట్టలేదు మనుమం డేతెంచెఁ దాతన్ గనన్.

    రిప్లయితొలగించండి