4, మే 2016, బుధవారం
3, మే 2016, మంగళవారం
ఖండకావ్యము - 16
ఋతుచక్రము
రచన : లక్ష్మీదేవి
వసంతఋతువు -
ఉ.
ఉ.
వేచె విభుండు వచ్చునని వేయి నిరాశలఁ గాలఁ దన్నుచున్
పూచిన సన్నజాజులను పొందిక కొప్పునఁ జుట్టి, గంధముల్
వీచెడు గాలులందు నిడి, ప్రేమగ స్వాగతగీతి కోయిలన్
దాచిన గొంతుతో పలికెఁ, దా వనకన్య వసంతురాకకై.
పూచిన సన్నజాజులను పొందిక కొప్పునఁ జుట్టి, గంధముల్
వీచెడు గాలులందు నిడి, ప్రేమగ స్వాగతగీతి కోయిలన్
దాచిన గొంతుతో పలికెఁ, దా వనకన్య వసంతురాకకై.
గ్రీష్మఋతువు -
చం.
చం.
భగభగ మండు టెండలకు బావులు, కాలువలెండిపోవగా,
దగఁ గొని, నీడకోరి, రహదారులఁ సాగెడు గడ్డురోజులన్
సెగలను తాళలేక యిల జీవులు వాడి తపింప, గ్రీష్మమున్
పగను శపించుచుండిరిక పంతముతో నసహాయ మానవుల్.
దగఁ గొని, నీడకోరి, రహదారులఁ సాగెడు గడ్డురోజులన్
సెగలను తాళలేక యిల జీవులు వాడి తపింప, గ్రీష్మమున్
పగను శపించుచుండిరిక పంతముతో నసహాయ మానవుల్.
వర్షఋతువు -
చ.
చ.
చిటపట సద్దు చేయుచును చేరును జల్లులు నింగి వీడుచున్,
పటపట రేకు పైఁ సడుల, పచ్చని చెట్టులు తానమాడ, తా
మటునిటు సాగు కాలువల యందున నల్లరి పిల్లమూకలన్
కటువుగ పెద్దలెల్ల యిడు గర్జన పోలెడు మేఘమాలికల్
దిటవుగ నిండునాకసము, దిక్కదె వర్షపు వేళ జీవికిన్.
పటపట రేకు పైఁ సడుల, పచ్చని చెట్టులు తానమాడ, తా
మటునిటు సాగు కాలువల యందున నల్లరి పిల్లమూకలన్
కటువుగ పెద్దలెల్ల యిడు గర్జన పోలెడు మేఘమాలికల్
దిటవుగ నిండునాకసము, దిక్కదె వర్షపు వేళ జీవికిన్.
శరదృతువు -
ఉ.
ఉ.
చల్లని వెన్నెలెల్ల యెడ సైయను జంటల కాంక్షమాడ్కినిన్,
చల్లని పిండులో యనగ, జాజుల మల్లెల పాన్పులో యనన్,
తెల్లని పాల సంద్రమన దిక్కులముంచెను, తేటగా నదుల్
పల్లెల పట్టణమ్ములను పారెను పంటల దాహమార్చుచున్.
చల్లని పిండులో యనగ, జాజుల మల్లెల పాన్పులో యనన్,
తెల్లని పాల సంద్రమన దిక్కులముంచెను, తేటగా నదుల్
పల్లెల పట్టణమ్ములను పారెను పంటల దాహమార్చుచున్.
హేమంతఋతువు -
చం.
చం.
చలిపులి మెత్త కత్తులనుఁ జంపుచునుండగ వృద్ధకోటి, లో
పలకునుఁ జేర వెచ్చనగు పానుపుకోరుచుఁ ,బంటదుప్పటుల్
పలుచగ భూమిఁ గప్పె, నెల ప్రాయము కాచెను నెల్ల జంటలన్,
తెలి విరులెల్ల తీర్చె నిక తీరగు చుక్కల నింగిగా నిలన్.
పలకునుఁ జేర వెచ్చనగు పానుపుకోరుచుఁ ,బంటదుప్పటుల్
పలుచగ భూమిఁ గప్పె, నెల ప్రాయము కాచెను నెల్ల జంటలన్,
తెలి విరులెల్ల తీర్చె నిక తీరగు చుక్కల నింగిగా నిలన్.
శిశిరఋతువు -
ఉ.
ఉ.
పత్రములెల్ల రాల్చి నవపల్లవ కోమల శోభఁ గోరుచున్
చిత్రము చేయునా శిశిరజృంభణ హేల! సదా చలించు, నే
మాత్రము దారి తప్పదు సుమా, ఋతుచక్రము! పెక్కు భంగులన్
గాత్రము మార్చునీ పృథివి కన్నుల పండుగగాగఁ జేయుచున్.
చిత్రము చేయునా శిశిరజృంభణ హేల! సదా చలించు, నే
మాత్రము దారి తప్పదు సుమా, ఋతుచక్రము! పెక్కు భంగులన్
గాత్రము మార్చునీ పృథివి కన్నుల పండుగగాగఁ జేయుచున్.
సమస్య - 2022 (దీపాలంకృత గృహమున...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది..
దీపాలంకృత గృహమునఁ దిమిరము నిండెన్.
2, మే 2016, సోమవారం
ఖండకావ్యము - 15
తెలుఁగు వెలుఁగు.
రచన : మిస్సన్న (దువ్వూరి వేంకట సరసింహ సుబ్బారావు)
పాప నవ్వువోలె పాల మీగడ వోలె
మంచి గంధ మట్లు మల్లె లట్లువీణ పాట రీతి విన సొంపుగా నుండు
తీయ తేనె లొలుకు తెలుఁగు పలుకు.
వేమనార్యుఁడన్న విలువైన మాటలు
సుమతి శతక కర్త సూక్తి సుధలు
భవిత తీర్చి దిద్దు బంగరు బాటలై
తెలుఁగు జాతి రీతి తెలియఁ జెప్పు.
తేటగీతి సీస మాటవెలందియు
నందమైన కంద చందములును
కృష్ణ రాయ విభుడు కీర్తించె హర్షించి
దేశ భాషలందు తెలుఁగు లెస్స.
అమ్ములేసి నిలిపె నల్లూరి దొరలను
సింగమట్లు దూకె టంగుటూరి
అమరజీవి యాయె నా పొట్టి రాములు
తెలుఁగు కీర్తి దిశలఁ దేజరిల్ల.
భోజనమ్ము నందు బొబ్బట్లు పులిహార
పనసపొట్టు కూర పచ్చిపులుసు
ఆవకాయ ఘాటు లాపైన గోంగూర
తినిన జిహ్వ లేచు తెలుఁగు రుచుల.
అట్లతద్ది భోగి యాపైన సంక్రాంతి
కనుమ బొమ్మనోము ఘన యుగాది
చవితి దశమి దివిలి శివరాత్రి బతుకమ్మ
తెలుఁగు పండుగలకు తీరు మిన్న,
అతిథి నాదరించు నయ్యల పూజించు
నమ్మ నాన్నలన్న నమిత భక్తి
అన్నదమ్ములందు నైకమత్యమ్మును
తెలుఁగు నేల నంత వెలుఁగుచుండు.
ఆంధ్రమందునైన అమెరికాలో నైన
వెలుఁగులీను చుండు తెలుఁగు పలుకు
మనిషి దూరమైన మమతలు మాయునా
మైత్రి మహిమ మిన్న ధాత్రి లోన.
సమస్య - 2021 (కొయ్యగుఱ్ఱ మెక్కి...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది..
కొయ్యగుఱ్ఱ మెక్కి కయ్యమాడె.
1, మే 2016, ఆదివారం
ఖండకావ్యము - 14
శ్రీ ఉమా రామలింగేశ్వరా!
రచన : వడ్డూరి అచ్యుతరామ
కవి
ఉ. రాజకళాధరాయ! నగరాజ సుతా హృదయేశ్వరాయ! గో
రాజ తురంగమాయ! ఫణిరాజ మనోహర భూషణాయ! నీ
రాజిత రాజమౌళి మణిరత్న సముచ్చయ పాదుకాయ! నీ
రేజ భవార్చితాయ! హర! ఋగ్వినుతాయ! శివా! నమోస్తుతే.
సీ. కమనీయ గగన గంగాతరంగ విలాస
భాస్వజ్జటా జూట భాసురాయ!
మహనీయ మాణిక్య మణి మనోహర లస
ద్భోగీంద్ర భూషణ భూషితాయ!
కాలానలాభీల కీలోగ్ర మాలికా
లులిత కుంతల ఫాలలోచనాయ!
శిశిర శీతల సుధాశీకర శీతాంశు
ఖండమండిత జటా మండలాయ!
తే. పాండురాంగాయ! ఫుల్ల విబ్రాజితాయ!
మల్లికార్జున దేవాయ! మంగళాయ!
అచ్యుతార్చిత పాదాయ! అవ్యయాయ!
ఓం నమశ్శంకరాయ! మృత్యుంజయాయ!
సీ. ప్రణవ స్వరూపాయ! పాపౌఘ నాశాయ!
పార్వతీ హృదయాబ్జ భాస్కరాయ!
ఖండేందు భూషాయ! కమనీయ వేషాయ!
కాంచనాచల దివ్యకార్ముకాయ!
కైలాస వాసాయ! గజదైత్య నాశాయ!
గంగాధరాయ! జగన్నుతాయ!
శర్వాయ! సర్వాయ! నిర్వాణ సుఖదాయ!
గర్విత దుష్టాంధకాంతకాయ!
తే. పరమ పురుషాయ! భక్తౌఘ పాలనాయ!
అచ్యుతార్చిత దివ్య పదాంబుజాయ!
ప్రణవ రూపాయ! తే నమో భవహరాయ!
శ్రీ ఉమారామలింగాయ! చిన్మయాయ!
సమస్య - 2020 (కార మది లోక...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది..
కార మది లోకకళ్యాణ కారకమ్ము.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)