4, మే 2016, బుధవారం

పద్యరచన - 1214

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.
(సోదరీమణులైన కవయిత్రులు మన్నించాలి!)

39 కామెంట్‌లు:

  1. అర్ధము దెలియని పురుషులు
    వ్యర్ధము గాపలుకు చుండి వ్యాకుల పడగన్
    స్వార్ధపు రక్షణ కొరకని
    నర్ధము కారని పడతుల నాక్షేపింపన్

    రిప్లయితొలగించండి
  2. పుస్తకము లెన్నిజదివిన
    మస్తకమున తెలియలేరు మగువ లనంగా
    వస్తువులు కారు వనితలు
    హస్త గతంబైన గాని ఔరా యనరే ?

    రిప్లయితొలగించండి
  3. మగువ తెలసికొనును మగ వానిమనసు ను
    క్షణములోన తాను ఖచ్చితముగ
    కలువ కంటి మనసు తెలుసుకొన తరమె
    హరికినైనను పురహరునికైన

    రిప్లయితొలగించండి
  4. ప్రొద్దు తిరుగు డంట పొలతుల మనములు
    కలత బెట్టి తాము వెలితి బడగ
    చాప క్రింద జారు సలిలము వలెనుండి
    మోద మందు ముంచి యెదను కోయు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      ఈరోజు మీలో కవితావేశం పొంగిపొరలినట్లున్నది. పద్యాలు బాగున్నవి. అభినందనలు.
      చివరి పద్యంలో ప్రాసయతి తప్పింది. ‘మోదమందు ముంచి వేదన నిడు’ అందామా?

      తొలగించండి
  5. చిన్ని పొత్తము జాలును చేతికంద
    మగల మనసును వ్రాయగ జగతిపైన
    పుస్తకమ్ములు జాలవు విస్తరించ
    పడతి మనసులు దెలియగ పుడమి పైన
    అనుభవమ్ముల జదివెడి యంతరమున!.

    రిప్లయితొలగించండి
  6. చిత్తము బెట్టుచు నొక్కడు
    పొత్తములను వ్రాసె మగువ,పురుషుల కుండే
    చిత్తపు లోతుల, చిత్రము
    మొత్తముదెలిసెను మగ మది,మున్నీరయె స్త్రీ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘ఉండే’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు.

      తొలగించండి
    2. మాస్టరుగారూ! ధన్యవాదములు.చిన్న సవరణ చేస్తున్నాను.
      చిత్తము బెట్టుచు నొక్కడు
      పొత్తములను వ్రాసె గనుచు,పురుషుల స్త్రీలన్
      చిత్తపు లోతుల, చిత్రము
      మొత్తముదెలిసెను మగ మది,మున్నీరయె స్త్రీ.

      తొలగించండి
  7. ఆడవారిమనము నవగతమెనరించ
    వలయునన్నవలయు వలపు పేర్మి
    నదియులేక సతము నవమాన పరచంగ
    నర్థ మెపుడు కాదు నరసి జూడ.

    రిప్లయితొలగించండి
  8. చిత్తరువు నందు గలయట్టి పొత్త ములను
    జూడ నవగత మయ్యెను సులువు గాను
    చేడి యలనిల నర్ధము చే సి కొనుట
    బహుళ కష్టమనుచు దోచె బా ర్వ తమ్మ !
    పురుషు లనబడు వారలు పొలుపు గలిగి
    చేయి చేతిని గలుపుచు జేరి యుండ్రు

    రిప్లయితొలగించండి
  9. పుస్తకమ్ములేల పురుషపుంగవులార
    యింతగేలిచేయనేలమీరు
    పాలనమ్ము చాలు లలన మనసు తెలియ
    కాస్త తెలివి యున్న కష్టతరమె

    రిప్లయితొలగించండి
  10. రిప్లయిలు
    1. పుస్తకమ్ములేల పురుషపుంగవులార
      యింతగేలిచేయనేలమీరు
      లాలనమ్ము చాలు లలనలను తెలియ
      కాస్త తెలివి యున్న కష్టతరమె

      తొలగించండి
  11. పుస్తకములెన్ని చదివిన
    మస్తకమున మగువ కున్న మరుగునెరుంగన్
    దుస్తరము విబుధుడైనను
    వాస్తవ మిది యెరిగి నడువు వసుధను మిత్రా!

    రిప్లయితొలగించండి
  12. మగవారి మనసు మడుగట
    తగవారిం దెలియ సులభ తరమట సుమ్మీ
    మగువల మన సది గుంభన
    మగు గంభీ రాంబుధి గన నాశ్చర్యముగన్

    రిప్లయితొలగించండి
  13. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    పురుషు డర్థమౌ నొక చిన్న పుస్తకమును

    చదువగా | చేడియల మనస్తత్వ మి౦క

    బూర్తిగా దెల్ప గలిగిన పుస్తకముల

    వ్రాయు శాస్త్రనిపుణు లేరి వసుధ లోన ?

    రిప్లయితొలగించండి
  14. సాగరమును గొలువ సాధ్యమగును గాని
    నెలత మనసు లోతు నెరుగ డెవడు
    పురుషు డన్ననేమి బోళరా భువియందు
    మనసు దాచలేదు మర్మములను

    తరుణి మనసున భడబాగ్ని దాగియుండు
    స్నేహమందించ గలదామె చిచ్చు బెట్టు
    ఆటుపోటుల గూడిన యంతరంగ
    మామె నెవరెంత శోధింప నర్థమవరు

    అబలలు గా గనబడినను
    సబలలె గదయాడవారు సాగర సమముల్
    నభమే గదపురు షుడిమన
    సు భావ మేదాచలేని శూన్యము సుమ్మీ

    రిప్లయితొలగించండి
  15. సత్య-మనోజ్ఞ భావనలు సాకెడి కృష్ణుడి కర్థ మౌన?తా
    నిత్యము సంతసంబొసగు నిర్మలభార్యయు భర్త కర్తమా?
    సత్యము నిత్య మైన మనసందున జేరిన నాశ దోషమౌ
    పత్యము నున్న పద్దతులు బంచెడి వారికి నర్థమౌనటే?

    రిప్లయితొలగించండి
  16. అంబటి భానుప్రకాశ్.గద్వాల.
    ఆ**
    నాతి మనసు దెలువ నలువత రముగాదు,
    రాయు చుండ సాగు రాత లైన,!
    పురుషు దెలుప గాను పూర్తియౌ చరితము,
    ఆలు పిల్ల లంత అతని కధయె "!!

    ఆ**
    చీర సారె లంటు చేసెడి గొడవయె,
    నాడ దాని నిలుపు నవని పైనె,!
    సాను భూతి తోడ సాధించు కొనునులే,
    అతివ యర్థ మౌన అవని యందు. !!

    రిప్లయితొలగించండి
  17. వేసము దాల్చుచు పురుషులు
    మోసము చేయుచుసతతము ముదితల మనముల్
    రోసపు మాటలునాడుచు
    దోసములేయెంచుచుంద్రు తోచక వారల్

    (పురుషులు అందరూకారు కొందరని గ్రహించ మనవి)

    రిప్లయితొలగించండి
  18. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  19. మగువల మనసును చదువగ
    జగమేలెడి సామి కైన సాధ్యంబగునే?
    మగవారిని తెలుసుకొనగ
    తగు సమయము చాలునంట తరుణులకిలలో!!!

    రిప్లయితొలగించండి
  20. అబల లభద్రత కతనన్
    కబుర్ల వచియించు విధమె కారణ మగుచున్
    ప్రబలిన యపోహ! తగు నే
    నిబద్ధతల దస్త్రముండె నిరసించంగన్!

    రిప్లయితొలగించండి
  21. ఆడవారిమనసు లోతుగ లమహాఆర్న వమనిభావనగ లిగి న
    ఆడవారిమాటలకు అర్ధ ము వే రుఅనుకొనిపొరబడకసలహాలు
    ఇడుటయందునమం త్రిగాప నులుచేయుటయం దున చరణదాసియన
    పడతిచూపునుప్రేమనుప్రేయసి పలుఅవతారములుధరియించి
    ఆడవారిని అర్ధము చేసుకొ అవసరమెరిగి తెలుసుకొనుము

    రిప్లయితొలగించండి
  22. లేదేదీ నీకు సమము
    గేదెను తలదన్ను మనము గీకగ తరమా...
    నీదొక పాకెటు బుక్కున...
    నీదే పై చేయొ యెపుడు నీరజ నేత్రీ!

    రిప్లయితొలగించండి