1, మే 2016, ఆదివారం

సమస్య - 2020 (కార మది లోక...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.. 
కార మది లోకకళ్యాణ కారకమ్ము.

78 కామెంట్‌లు:

 1. శుచిగ బోవలె గుడికంట శుభము గలుగు
  విమల యశమున బ్రతుకంత వెలుగు నట్లు
  పరవ శించగ జగతిని పరులకు సహ
  కార మది లోక కళ్యాణ కార కమ్ము.

  రిప్లయితొలగించండి
 2. బాలభాస్కరుం డల్లదే పసిడి కాంతి
  పంచిపెట్టగ ధాత్రికి పరుగుతోడ
  పొడుపు కొండల నెక్కె కనుడు మహోప
  కార మది లోక కల్యాణ కారకమ్ము.

  రిప్లయితొలగించండి
 3. అర్కజునివంశ నుదయించి యవనిపైన
  నరుని రూపంబు ధరియించె నాడురామ
  ధరణి యందున శిక్షించ దానవులను
  కార మది లోక కళ్యాణ కార కమ్ము

  "శ్రీను "

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పద్యం బాగుంది. కాని సమస్య సమర్థంగా పూరించినట్టు లేదు.
   ‘వంశమున బుట్టి యవనిపైన... నాడు హరియె... దానవాంధ|కార మది...’ అనండి.

   తొలగించండి
 4. డా.ఎన్.వి.ఎన్.చారి
  ధర్మసంస్థాప నార్థమ్ము ధరణి వెలసి
  దుష్ట దానవ కోటిని దునిమి వేసి
  శిష్ట సంరక్షణము జేయు శ్రీకరు నుప
  కార మది లోక కళ్యాణ కారకమ్ము

  రిప్లయితొలగించండి
 5. తనకుటుంబపు వృఇద్ధికై తపన పడక
  మానవత్వము తోడను మనుచు సతము
  పేదవారికి నిచ్చెడి ప్రేమయు సహ
  కారమదిలోక క్ళ్యాణ కారకమ్ము  రిప్లయితొలగించండి
 6. భానుడుదయాద్రిపై నెక్కి పగడమటుల
  దినము వెల్గులు ప్రసరించు మన గురించి
  నిజము, నిత్యమై జను, యినుని మహితోప
  కార మది , లోక కళ్యాణ కారణమ్ము!

  రిప్లయితొలగించండి
 7. రావణాసురు జంపిన రామచంద్రు
  డతని సోదరుని విభీషణాఖ్యు చేసి
  రాజుగా - నిచ్చె లంకాపురము పయినధి
  కార మది లోకకళ్యాణ కారకమ్ము.

  రిప్లయితొలగించండి
 8. మనము దిన్నది క్షణములో మాయమగును
  పరులకిడినట్టి దానంబు పరమ యోగ్య
  మై నిలచు. పేదవారి సమ్మానపు మమ
  కారమది లోక కల్యాణ కారకమ్ము

  రిప్లయితొలగించండి
 9. బండకాడి అంజయ్య గౌడు గారి (వాట్సప్) పూరణ....

  ఎప్పుడేమౌనొ దెలియగ నెవరి తరము
  హితులు మిత్రులు బంధువు లెవరికైన
  ఆపదల్ గల్గు వేళలో యందెడి మమ
  కార, మది లోకకల్యాణ కారకమ్ము"

  రిప్లయితొలగించండి
 10. లోక కల్యాణమైనను, ప్రాకటముగ
  పెండ్లి, పండుగ నేదేని వేడ్కలందు
  శోభ గుమ్మాల గూర్చెడు సుందర సహ
  కారమది,లోకకల్యాణ కారకమ్ము.

  రిప్లయితొలగించండి
 11. రిప్లయిలు
  1. సర్వ భూత హితుండు నఖర్వ విష్ణు
   భక్తుడును బద్మజ సుతుండు పావనుండు
   లోక సంచారు నారదు రూప కలహ
   కార మది లోక కళ్యాణ కారకమ్ము.

   తొలగించండి
  2. మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 12. [10:24AM, 5/1/2016] అంబటిభానుప్రకాశ్.: 🙏🌺🙏

  అంబటి భానుప్రకాశ్,
  దుప్పల్లి.

  తే**
  రాము వెలసెను రక్కసు రాజు జంప,
  కట్టి దాటెను వారధి ,కపివ ర,సహ
  కార మది,లోక కళ్యాణ కార కమ్ము,
  ధరణు రాముని చరితను దైవ మందు ! !


  🌺🙏🌺
  [10:28AM, 5/1/2016] అంబటిభానుప్రకాశ్.: 🙏🌺🙏

  తే**
  లోక మందలి జనులకు నొక్క టైన,
  మంచి కార్యము జేయగ మనసు నందు,
  తలచి కదలిన కష్టము తొలగునె సహ,
  కార మదిలోక కల్యాణ కార కమ్ము,

  🌺
  [10:33AM, 5/1/2016] అంబటిభానుప్రకాశ్.:

  తే**
  సడియు లేకను కపులను నుడుత. గూడి,
  కట్ట వచ్చెను వారధి, మట్టి పులిమి,!
  సర్వ జనులకు హితమది పర్వమె,సహ
  కారమది లోక కల్యాణ కార కమ్ము! !

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   మొదటి పూరణలో మొదటి పాదాన్ని ‘రాముడు వెలసె రాక్షసరాజు జంప’ అనండి. నాల్గవ పాదంలో ‘ధరను...’ అనండి.

   తొలగించండి
 13. మనము దిన్నది క్షణములో మాయమగును
  పరులకిడినట్టి దానంబు పరమ యోగ్య
  మై నిలచు. పేదవారి సమ్మానపు మమ
  కారమది లోక కల్యాణ కారకమ్ము

  రిప్లయితొలగించండి
 14. దోచుకొని , గుప్తధనమును దాచు కొనక
  బడుగు వర్గపు ప్రగతికై పాటు పడగ
  ధనిక వర్గము జూప సుంతైనను మమ
  కార మది లోకకళ్యాణ కారకమ్ము.

  రిప్లయితొలగించండి
 15. పరిచయము తెల్పు పావని ప్రతిభ జూచి
  లక్ష్మణునితోడ పలికె రాము డపుడు
  శాస్త్ర మెరిగినట్టి హనుమ చక్కని నుడి
  కారమది లోక కళ్యాణ కారకమ్ము.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవపాదంలో గణదోషం. ‘పలికెను’ అనండి.

   తొలగించండి
  2. పలికెగా అని వ్రాసుకున్నాను. బ్లాగులోకి తర్జుమా చేయడంలో తప్పు జరిగింది. మన్నించ గోర్తాను.. సవరించి వ్రాస్తున్నాను.
   పరిచయము తెల్పు పావని ప్రతిభ జూచి
   లక్ష్మణునితోడ పలికెగా రాముడపుడు
   శాస్త్ర మెరిగినట్టి హనుమ చక్కని నుడి
   కారమది లోక కళ్యాణ కారకమ్ము

   తొలగించండి

 16. దుష్టజనులనురక్షించిశిష్టులనిల రక్షజేయగజన్మించిరామునిగను పుట్టిలోకానశాంతినిపొడమినమమ కారమదిలోకకళ్యాణకారకమ్ము

  రిప్లయితొలగించండి
 17. తనకు కల్గిన దానిని తాను పంచు
  తాను ఇవ్వలేకున్నచొ తగిన వారి
  చేసహాయముపేదల్కి చేయుట ఉప
  కారమది లోకకళ్యాణ కారకమ్ము

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. మీ పద్యానికి నా సవరణ....

   తనకు గల్గినదానిని తాను పంచు
   తా నొసగలేకున్నచో తగిన వారి
   చే సహాయము పేదకు చేసెడి యుప
   కార మది....

   తొలగించండి
 18. సూర్యచంద్రులు, తరువులు,సురభి, విరులు
  సురటితానము, నీరము, పరుల కొరకు
  కదలు దినదినము నరయ ఘన పరోప
  కారమది లోక కల్యాణ కారకమ్ము !!!

  రిప్లయితొలగించండి
 19. శ్రీరాం కవి గారి పూరణ...

  చేయి చేయి కలిపి మన శ్రేష్ఠశక్తి
  బలిమి చాటుచును నిలిచి కలిమి పెంచి
  కలలు కనుచును ప్రగతిని గాంచెడి సహ
  కార మది లోకకళ్యాణ కారకమ్ము

  రిప్లయితొలగించండి
 20. బయటి పనులకు వనితలు బయలుదేరు
  వేళ, వారిపై దాడులు పెరుగు చుండె
  స్వీయ రక్షణ కోసమై స్ప్రేగ వాడ
  కార మది లోకకళ్యాణ కారకమ్ము

  రిప్లయితొలగించండి
 21. [12:01, 01/05/2016] Kanthi Krishna: జనక భూవిభుడంతట తనదు కూతు
  పరిణయమ్మొనరించగ ప్రకటనీయ
  రమణి సీతపై గురిపించు రాముడిమమ
  కార మది లోక కళ్యాణ కారకమ్ము
  [12:47, 01/05/2016] Kanthi Krishna: జీవులందున్న పరమాత్మ చేవనెరిగి యన్ని జీవుల నొకరీతి నాదరించి లోకమందున జనులు సలుపు పరోప
  కార మది లోక కళ్యాణ కారకమ్ము

  రిప్లయితొలగించండి
 22. రిప్లయిలు
  1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   మొదటిపూరణలో ‘ప్రకటన+ఈయ=ప్రకటన నీయ’ అవుతుంది. ‘ప్రకటన నిడ’ అనండి.

   తొలగించండి
 23. పిన్నక నాగేశ్వరరావు గారి పూరణ....

  ఉగ్ర వాదమ్ము నణచగ నుర్వి లోన
  అగ్ర రాజ్యాలు కూడ సౌహార్ద పగిది
  చిన్న దేశములకు నందజేసెడు సహ
  కారమది లోక కళ్యాణ కారకమ్ము.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పిన్నక నాగేశ్వర రావు గారూ,
   శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   వాట్సప్‍లో మధుసూదన్ గారు సూచించినట్లు ‘సౌహార్ద విధిని’ అనండి.

   తొలగించండి
 24. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘సహకార పంచ’ అనడం దుష్టసమాసం. ‘మంచి మమకారమును పంచు మార్గ మెంచి’ అనండి.

   తొలగించండి
 25. మిత్రులందఱకు నమస్సులు!

  ఉన్నదాని తోన నొదిగి సంతృప్తితో
  మనుట మేలు! పరుల ధనము పట్ల
  మదిని నిర్వి
  కార మది లోక కళ్యాణ
  కారకమ్ము!
  ముక్తి కాకరమ్ము!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పాదభ్రంశం చేసి ఆటవెలదిలో చేసిన మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
 26. పుట్టిరెక్కడో నిద్దరు! పుస్తెతోడ
  ఆలుమగలౌచు సంతతి నందు వారి
  రసభరిత జీవనమున పరస్పరాధి
  కార మది లోకకళ్యాణ కారకమ్ము!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘పుట్టి రెక్కడో యిద్దరు...’ అనండి.

   తొలగించండి
  2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పద్యం:

   పుట్టిరెక్కడో యిద్దరు! పుస్తెతోడ
   ఆలుమగలౌచు సంతతి నందు వారి
   రసభరిత జీవనమున పరస్పరాధి
   కార మది లోకకళ్యాణ కారకమ్ము!

   తొలగించండి
 27. అంబటి భానుప్రకాశ్,
  దుప్పల్లి.
  సవరించిన పద్యం

  తే**
  రాముడు వెలసె రాక్షస రాజు జంప,
  కట్టి దాటెను వారధి ,కపివ ర,సహ
  కార మది,లోక కళ్యాణ కార కమ్ము,
  ధరను రాముని చరితను దైవ మందు ! !

  రిప్లయితొలగించండి
 28. ‘చెన్నకేశవ’ గారి పూరణము....

  స్వజను లనుజంప లేనని సవ్యసాచి
  వాసు దేవుని తోడన వగచె నంత
  చంప చంపించ నెవ్వరు? చక్ర ధరుని
  కార మదిలోక కళ్యాణ కారకమ్ము

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ‘చెన్నకేశవ’ గారూ,
   మీ పూరణ బాగున్నది. కాని ‘చక్రధరుని కారము’... అర్థం కాలేదు.

   తొలగించండి
 29. 1.నరకుని దునుమ కృష్ణుడు నారితోడ
  సాగ సంధించె శరమును సత్యభామ
  జనులు హర్షించి పొగడంగ జగమునకుప
  కారమది లోక కల్యాణ కారకమ్ము.
  2ఆత్మలింగము గోరుచు నసురవరుడు
  తపము నొనరించి గొనిపోవ ధరణియందు
  శివకుమారుడసురునాపి చేయగ నుప
  కారమది లోక కల్యాణ కారకమ్ము
  3బాలభానుడు ప్రభవించ ప్రజలకునుప
  కారమది లోక కల్యాణ కారకమ్ము
  సూర్యరశ్మియు సోకంగ సులువుగాను
  తరువు లెల్ల పరవశించె తలల నూపి.

  రిప్లయితొలగించండి
 30. పరుల మేలొన గూర్చెడి పనులుజరిపి
  మంచిమమకార మును బంచుమార్గమెంచి
  ధర్మ మార్గాన మెలగుట నిర్మల సహ
  కారమది|లోక కళ్యాణ కారకమ్ము|

  రిప్లయితొలగించండి
 31. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 32. మూగ జీవుల పాలన ముఖ్యమనుచు,
  చెట్టు కెపుడు చెఱుపు తల పెట్టననుచు,
  చెన్నుగ నపకారికినైన చేసెడి నుప
  కారమది లోక కళ్యాణ కారకమ్ము!

  గురువు గారికి నమస్కారములు. నిన్నటి సమస్యకు నేను వ్రాసిన పూరణ కూడా చదువ గోరుతాను.
  ధన్యవాదములు. శ్రీధర రావు.

  ఏటి కొక మారు వచ్చెడి
  పోటీ కూడిన పరీక్ష వుసి గొలుపంగా,
  ధాటిగ వ్రాయుటలో పొర
  పాటు పడిన వారికెట్లు ఫలితము దక్కున్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   ‘ఉసి’ని ‘వుసి’ అనరాదు. ‘వు,వూ,వొ,వో లతో ప్రారంభమయ్యే తెలుగు పదాలు లేవు’. ‘పరీక్ష యుసిగొలుపంగన్’ అనండి.

   తొలగించండి
 33. ద్వేష మాక్రోష క్రోధము విశ్వమందు
  మానవత భావ బంధాల మట్టి గలుపు
  సర్వమున్నను వ్యర్థమే సజ్జన! మమ
  కార మది లోకకళ్యాణ కారకమ్ము.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగుంది. అభినందనలు.
   ‘ద్వేష మాక్రోశ క్రోధముల్... మానవత భవబంధాల...’ అనండి.

   తొలగించండి
 34. అణువిభేదన మొనరించి అస్త్రములను
  అగ్రదదేశాలు ఉత్పత్తి నాపు జేసి
  విశ్వమందున శాంతి స్థాపింప జేయు
  కార మది లోకకళ్యాణ కారకమ్ము.

  రిప్లయితొలగించండి
 35. అణువిభేదన మొనరించి అస్త్రములను
  అగ్రదదేశాలు ఉత్పత్తి నాపు జేసి
  విశ్వమందున శాంతి స్థాపింప జేయు
  కార మది లోకకళ్యాణ కారకమ్ము.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘అస్త్రములను+ఉగ్రదేశాలు+ఉత్పత్తి’ ఇక్కడ సంధి నిత్యం, మీరు విసంధిగా వ్రాశారు. ‘...మొనరించి యస్త్రరాశి| నగ్రదేశమ్ము లుత్పత్తి నాపుజేసి...’ అనండి.
   ‘స్థాపింపజేయు కారము’..?

   తొలగించండి
 36. ఐదుసంవత్సరాలకునొక్కసారి
  వచ్చు యవకాశ మోయినీవదలబోకు
  జనుల కోసము నుపయుక్త జనితమునధి
  కారమది లోకకళ్యాణ కారకమ్ము

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది.
   మొదటిపాదంలో యతి తప్పింది.
   ‘ఐదు వత్సరముల గడువైన పిదప
   వచ్చు నవకాశ మిది నీవు వదలబోకు...’ అనండి.

   తొలగించండి
 37. [3:43PM, 5/1/2016] అంబటిభానుప్రకాశ్.: 🌺🙏🌺

  ఆ**
  అహము తోడ చెలగి అభిమాన వంతులు,
  పరుల హాని జేయ తరలు నెపుడు,
  మదిన హం'కార మది లోక కళ్యాణ,
  కార కమ్ము 'గాదు, కనుము నెపుడు.

  🌺
  అంబటి భానుప్రకాశ్.
  [3:44PM, 5/1/2016] అంబటిభానుప్రకాశ్.: సార్ మీరు ఇచ్చిన పూరణ ఆటవెలదిలో......

  రిప్లయితొలగించండి
 38. లడ్లు జాంగిరీలు జిలేబి రాజభోగ్లు
  సున్ని యుండలు హల్వ మైసూరు పాక్లు
  కొల్ల గొట్టగ జిహ్వను గొడ్డు కొరివి
  కార మది లోకకళ్యాణ కారకమ్ము!

  రిప్లయితొలగించండి