1, మే 2016, ఆదివారం

ఖండకావ్యము - 14

శ్రీ ఉమా రామలింగేశ్వరా!
రచన : వడ్డూరి అచ్యుతరామ కవి

ఉ.      రాజకళాధరాయ! నగరాజ సుతా హృదయేశ్వరాయ! గో
రాజ తురంగమాయ! ఫణిరాజ మనోహర భూషణాయ! నీ
రాజిత రాజమౌళి మణిరత్న సముచ్చయ పాదుకాయ! నీ
రేజ భవార్చితాయ! హర! ఋగ్వినుతాయ! శివా! నమోస్తుతే.

సీ.      కమనీయ గగన గంగాతరంగ విలాస
భాస్వజ్జటా జూట భాసురాయ!
మహనీయ మాణిక్య మణి మనోహర లస
ద్భోగీంద్ర భూషణ భూషితాయ!
కాలానలాభీల కీలోగ్ర మాలికా
లులిత కుంతల ఫాలలోచనాయ!
శిశిర శీతల సుధాశీకర శీతాంశు
ఖండమండిత జటా మండలాయ!
తే.      పాండురాంగాయ! ఫుల్ల విబ్రాజితాయ!
మల్లికార్జున దేవాయ! మంగళాయ!
అచ్యుతార్చిత పాదాయ! అవ్యయాయ!
ఓం నమశ్శంకరాయ! మృత్యుంజయాయ!

సీ.      ప్రణవ స్వరూపాయ! పాపౌఘ నాశాయ!
పార్వతీ హృదయాబ్జ భాస్కరాయ!
ఖండేందు భూషాయ! కమనీయ వేషాయ!
కాంచనాచల దివ్యకార్ముకాయ!
కైలాస వాసాయ! గజదైత్య నాశాయ!
గంగాధరాయ! జగన్నుతాయ!
శర్వాయ! సర్వాయ! నిర్వాణ సుఖదాయ!
గర్విత దుష్టాంధకాంతకాయ!
తే.      పరమ పురుషాయ! భక్తౌఘ పాలనాయ!
అచ్యుతార్చిత దివ్య పదాంబుజాయ!
ప్రణవ రూపాయ! తే నమో భవహరాయ!

శ్రీ ఉమారామలింగాయ! చిన్మయాయ!

25 కామెంట్‌లు:

 1. రిప్లయిలు
  1. మా తండ్రి గారు రచించిన పద్యాల పై మీ అభిప్రాయాలను తెలియజేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేయుచున్నాను.

   తొలగించండి
  2. నేను కీ.శే. వడ్డూరి. అచ్యుతరామ కవి గారి నాల్గవ కుమారుడను నేను తణుకు లో ఉంటాను నా పేరు రామకృష్ణ

   తొలగించండి
  3. రామకృష్ణ గారు. నమస్కారములు. మీ నాన్న గారు శివానుగ్రహ భక్త శిఖామణులు. ధన్యజీవులు. మహోదాత్తమైన భక్తిరస ప్రవాహముగా విలసిల్లిన శివస్తోత్రాన్ని చదువగల్గిన మహద్భాగ్యాన్ని ప్రసాదించారు. ధన్యవాదములు.

   తొలగించండి
 2. బ్రహ్మాండంగా శబ్దశోభితంగా ఉంది. తెలుగు వ్యాకరణంలోనయినా, అనుష్టుప్శ్లో కం చదువుతున్న భావన కలిగింది.

  రిప్లయితొలగించండి
 3. సుకవులు శ్రీ వడ్డూరి అచ్యుతరామ కవి గారూ...నమస్సులు! మీ పద్యరచన భక్తిభావస్ఫోరకంగా, మృదుమధురపదార్థభావగ్రాహకంగా, గంగాపగాప్రవాహధారాసమన్వితంగా ఉండి పఠితల నాహ్లాదపరుస్తోంది. ఇట్టి రచన నందించినందులకు మీకు, శ్రీ కంది శంకరయ్యగారికి శుభాభినందన పూర్వక ధన్యవాదాలర్పిస్తున్నాను.

  రిప్లయితొలగించండి
 4. సుకవులు శ్రీ వడ్డూరి అచ్యుతరామ కవి గారూ...నమస్సులు! మీ పద్యరచన భక్తిభావస్ఫోరకంగా, మృదుమధురపదార్థభావగ్రాహకంగా, గంగాపగాప్రవాహధారాసమన్వితంగా ఉండి పఠితల నాహ్లాదపరుస్తోంది. ఇట్టి రచన నందించినందులకు మీకు, శ్రీ కంది శంకరయ్యగారికి శుభాభినందన పూర్వక ధన్యవాదాలర్పిస్తున్నాను.

  రిప్లయితొలగించండి
 5. శ్రీ వడ్డూరి అచ్యుతరామకవి గారు నమస్కారాలు.

  గంగాధరుని వర్ణన గంగాప్రవాహంలా,శబ్దప్రవాహం ఢమరుక నాదంలా సాగింది.
  చక్కని రచన నందించినందులకు కృతజ్ఞతలు.
  కవిగారి కభినందనలు,.

  శంకరయ్య గార్కి నమస్సులు.

  రిప్లయితొలగించండి
 6. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి

 7. రామలింగనిగూర్చియురమ్యముగను రచనజేసినవడ్డూరిరాజసంబు గోచరంబయ్యెజక్కటిగుంఫనమును నతనికాతడేసాటియయార్య!యిలను

  రిప్లయితొలగించండి
 8. శ్రీ వడ్డూరి అచ్యుతరామ కవి గారికి నమస్సులు.మీ కవితా గంగాప్రవాహం గంభీర సుమనోహరం.శివనామ పారాయణ చేస్తున్న అనుభూతి కలిగించింది.

  రిప్లయితొలగించండి
 9. శ్రీ వడ్డూరి అచ్యుతరామ కవి గారికి నమస్సులు.మీ కవితా గంగాప్రవాహం గంభీర సుమనోహరం.శివనామ పారాయణ చేస్తున్న అనుభూతి కలిగించింది.

  రిప్లయితొలగించండి
 10. శ్రీ వడ్డూరిఅచ్యుత రామకవీశ్వరులకువందనచందనాలుశ్రీ ఉమా రామలింగేశ్వరా|తమరిదయవల్లరచనలందున ఉత్పల,సీస మాలికల పరిమళ భక్తి గంధమునుపంచిన రచనకు మీకుహరునకు వందనములు
  చక్కని అంత్య ప్రాసకు
  చిక్కితివా పార్వతీశ|శ్రీహర|మిమ్మే
  మ్రొక్కగ భక్తిగ సుఖమును
  దక్కగ జేయంగ రచన?దర్పణమాయెన్|

  రిప్లయితొలగించండి
 11. చాలా బాగుందండి.
  పాండురాంగాయ అనే పదమును కొంత వివరించ ప్రార్థన.

  రిప్లయితొలగించండి
 12. సుర్యభగవానుని స్తోత్రం
  ఓం శ్రీ సవిత్రే నమః రచన :వడ్డూరి అచ్యుతరామ కవి
  శా . ఓంకారంబున సంభవించు జగమాయోం కార మందమత మౌ
  నోంకారంబునవృద్ధిజెందు సలంబొంకారమై యొప్పు నా
  యోంకారాకృతి యై వెలింగెడి పరం జ్యోతిన్ పరబ్రహ్మమున్
  ఓంకారప్రణవ స్వరూపునకు దేజోమూర్తికిన్ మ్రొక్కెదన్ .
  ఉ . శ్రీయుననా మయం బయిన జీవన మాయువు నాత్మ విద్యయున్
  బాయని ప్రేమ నిత్తువట భక్తులకున్ జగదీశ సర్వదా
  నాయెడ సత్కృపన్ గలిగి నాస్తవమున్ దయ స్వీకరించి నన్
  శ్రీ యుతమూర్తి బ్రోవగదె చిత్తమునన్ వసియించి భాస్కరా !
  చ. సరసిజబాంధవా!నిగమసన్నుత!దీనశరన్య!మౌనిఖే
  చరగరుడోరగ ప్రముఖ సన్నుత భక్త జనావనా శుభం
  కర శరణంటి బ్రోవగదె కాలనియామక, కాల రూప! యో
  హరిహర ధాతృ తేజ!పరమాత్మ!దయానిధి!దేవ!భాస్కరా!
  మ. వికలాంగుల్ జడులంధులున్ బధిరులున్ విశ్వాత్మకంబై న నీ
  యకలంకోత్తమ దివ్య నామమును నిత్యంబున్ స్మరింపన్ భువిన్
  సకలారిష్టము లంతరింప శుభముల్ సౌఖ్యంబులన్ బొంది పా
  యకస్వర్గంబును గాంతు రంతమున దేవా!సూర్యనారాయణా!
  శా . త్రే తాగ్నుల్ చతురాగమంబులు ధరిత్రిన్ బంచ భూతంబు లున్
  శీతోష్ణాది విబేధ కాల ఋతువుల్ శీతాంశులు గ్రంశులున్
  వాలో ద్దూత మహోగ్ర వృష్టి విలయ వ్యాపార సృష్టి స్టితుల్
  భూతేశా!భువి నీవ!నీవలన వే బోల్పోందు నో భాస్కరా !
  మ. నర దేవాసుర మౌని దివ్యు లేవరైనను గాని నీ రాకచే
  నురు కర్తవ్యము,కాలకృత్యములు,సంధ్యో పాసనల్ సేయుచున్
  ధరలో జీవితయాత్ర సల్పుదురు నిన్ దర్శింప లేకున్న నె
  వ్వరు కర్తవ్య మెరుంగ లేరుగద !దేవా ! సూర్యనారాయణా !
  మ. మహనీయుల్ ఋషులున్,ద్విజుల్ బుధవరుల్ మార్తాండ నిన్భక్తి తో
  గ్రహరాజా !భవదీయ దర్శన మె దన్ గాంక్షించి పూతాత్ములై
  బహు మంత్రోక్తుల నర్ఘ్య పాద్యములతో "బ్రహ్మార్పణం"బంచు నిన్
  బహురీతిన్ ప్రచిం చు చుందురు పరబ్రహ్మ స్వరూపా !రవీ !

  రిప్లయితొలగించండి
 13. శ్రీ వేంకటేశ్వర భక్తిమాల
  రచన : వడ్డూరి అచ్యుతరామకవి
  1. నల్లని మేనివాడు చిరునవ్వులు చల్లెడివాడు మోముపై
  తెల్లని నామాముల్గలిగి దివ్యకిరీటము దాల్చి భక్తులన్
  చల్లగ జూచువాడు నవసారస నేత్రుడు మంగమా మనో
  వల్లభు డీశ్వరేశ్వరు డవశ్యము నాకు బ్రసన్నుడయ్యెడున్

  2. పంకజాసన వాసవార్చిత భక్తలోక శుభంకరా
  వేంకటాచలవాస కేశవ విశ్వకారణశ్రీధరా
  శంకరార్చిత పాదపంకజ శంఖ చక్ర గదాధరా
  వేంకటేశ్వర వేంకటేశ్వర వేంకటేశ్వర పాహిమాం

  3. శ్రీమద్వేంకట శైలమందు విభవ శ్రీమీరనాంచారియున్
  భామారత్నము మంగమాంబయును సంభావించి సేవింపగా
  కామారాతి మహేంద్ర ముఖ్యులు నుతుల్ గావింప భక్తాళికిన్
  సేమంబుల్ సమకూర్చు దేవుగొలుతున్ శ్రీవేంకటేశ ప్రభున్
  4. నరకమురారి దానవ వినాశన కారికిదుఃఖహారికిన్
  గరుడ విహారికిన్ మహిత కౌస్తుభధారికి చక్రధారికిన్
  దురిత విదారికిన్ జననదుఃఖనివారక నామధారికిన్
  తిరుమల వేంకటేశునకు దేవరకున్ శరణార్ధి నయ్యెదన్
  5. ఎవనిని బ్రహ్మ రుద్ర మరుదింద్ర సుధాశన ముఖ్యులెల్ల సం
  స్తవ మొనరింతు రెవ్వని యశస్కర గీతికలాగమావళుల్
  దవిలి నుతించు మౌనులు హృదబ్జమునన్ గనుగొందు రెవ్వనిన్
  ఎవనిననంతుడండ్రతడ వీవని యెంచెద వేంకటేశ్వరా
  6. విషరుహోద్భవ విషధరాధిప విషగాళా దులకైన నీ
  విషయముల్ గ్రహియింప సాధ్యమె విషధి శయన వృషాధిపా
  విషయ వృత్తుల మాన్పి నామది విషరుహోదర నీ కధా
  విషయముల గ్రహియింప జేయుము వెంకటేశ్వర మ్రొక్కెదన్

  రిప్లయితొలగించండి
 14. మా నాన్న గారు రచించిన వేంకటేశ్వర భక్తిమాల శ్రీ వేంకటేశ్వర స్తోత్ర శతకము నుండి కొన్ని పద్యాలు శంకరాభరణం కవిమిత్రుల కొరకు -వడ్డూరి రామకృష్ణ సెల్.9440953315

  రిప్లయితొలగించండి