2, మే 2016, సోమవారం

పద్యరచన - 1212

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

49 కామెంట్‌లు:

 1. ముక్కున గఱచిన పోచల
  మక్కువతో దెచ్చి మిగుల మార్దవ మందన్
  చక్కని గూడును గట్టును
  యెక్కడివీ పిచ్చుకలకు నింతటి నేర్పుల్?!

  రిప్లయితొలగించండి
 2. పలువిధమ్ములైన పక్షిజాతులతోడ
  పరిఢవిల్లినట్టి పల్లెలందు
  వెదకికాంచ లేము పిచ్చుక గూళ్ళను
  ప్రకృతి నాశమయ్యె పజల కతన

  రిప్లయితొలగించండి
 3. అందము చిందెడి పిచ్చుక
  బంధము కొఱకని గట్టె పచ్చని గూడున్
  విందులు చేయగ సఖుడిక
  తొందరలో జేరునంచు తోడుగ తనకున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పద్యం బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదంలో గణదోషం. ‘కొఱకనుచు గట్టె’ అనండి.

   తొలగించండి

 4. సీసము:
  ఏకులవృత్తియే నీకు నేర్పెదనంచు
  తండ్రి జేరుచు నేర్పె తాను చెపుమ
  ఏయూనివర్సిటీ కీపిట్ట వెడలుచు
  సాంకేతికపువిద్య చదివె చెపుమ
  ఏశిక్షణాకేంద్ర మీరీతి గట్టగా
  చెప్పిబంపెను బూని విప్పి చెపుమ
  ఏనెట్టులోన తానెట్టులో వెదకుచు
  విధము జూచె నిదియ విధిగ జెపుమ

  ఆటవెలది:
  ఎండవానబడదు ఏసీగ గదియుండు
  గ్రుడ్లుపొదుగ పిట్ట గూడదియె
  సాఫ్టువేరు చిప్పు సరిదాని మెదడులో
  ప్రకృతి పెట్టె దాని ప్రగతి గనుమ.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. హనుమచ్ఛాస్త్రిగారూ చక్కటి పద్యం!

   తొలగించండి
  2. చాలా బాగుంది మీ పద్యం. అభినందనలు.

   తొలగించండి
  3. మాస్టరుగారూ! మిస్సన్నగారూ! ధన్యవాదములు.

   తొలగించండి
  4. చిన్న సవరణతో.......
   సీసము:
   ఏకులవృత్తియే నీకు నేర్పెదనంచు
   తండ్రి జేరుచు నేర్పె తాను చెపుమ
   ఏయూనివర్సిటీ కీపిట్ట వెడలుచు
   సాంకేతికపువిద్య చదివె చెపుమ
   ఏశిక్షణాకేంద్ర మీరీతి గట్టగా
   చెప్పిబంపెను బూని విప్పి చెపుమ
   ఏనెట్టులోన తానెట్టులో వెదకుచు
   విధము జూచె నిదియ విధిగ జెపుమ

   ఆటవెలది:
   ఎండవానబడదు ఏసీగ గదియుండు
   గ్రుడ్లుపొదుగ పిట్ట గూడదియె
   సాఫ్టువేరు చిప్పు సరిదాని మెదడులో
   ప్రకృతి పెట్టె దాని ప్రతిభ గనుమ.

   తొలగించండి
 5. చటకారామాద్భుత బిల
  పటుతర నిర్మాణ శైలి ప్రాప్తంబగునే
  ఘటికులు విజ్ఞానులకున్
  వటపత్ర శయనుని లీల పరమాద్భుతమే

  రిప్లయితొలగించండి
 6. అల్లుచు నున్నది గూటిని
  పిల్లల రక్షించఁ గోరి పిచ్చుక గనుమా!
  సెల్లది వచ్చెను వాడఁగ
  గొల్లమని గతించె జాతి ఘోర విపత్తున్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. హృదయవిదారకమైన వాస్తవాన్ని తెలియజేస్తూ చక్కని పద్యాన్ని వ్రాశారు. అభినందనలు.

   తొలగించండి
 7. నీడకు పోచల పోగిడి
  గూడును పిచ్చుక సృజించె కూరిమి తోడన్
  కూడును బడయవలె ననుచు
  మాడున ఎండ మితిమీర మార్గము వెతికెన్౹౹

  రిప్లయితొలగించండి
 8. నీడకు పోచల పోగిడి
  గూడును పిచ్చుక సృజించె కూరిమి తోడన్
  కూడును బడయవలె ననుచు
  మాడున ఎండ మితిమీర మార్గము వెతికెన్౹౹

  రిప్లయితొలగించండి
 9. పరకల నేరిదెచ్చి తగు ప్రజ్ఞను వానకు నెండ కింతయున్
  చిరుగని రీతి గూడొకటి చేసి సుఖమ్ముగ పెంటి పిట్టతో
  మురియుచు గూడియుండెదవు, ముద్దుల పిల్లల మేటి బాధ్యతన్
  సరియగు రీతి రెక్కలను చక్కగ సాగెడు దాక పిచ్చుకా
  మురిపెము మీర సాకెదవు, ముత్యము నీదగు తీరు మెచ్చెదన్.


  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మిస్సన్న గారూ,
   చక్కని పద్యాన్ని అందించారు. అభినందనలు.

   తొలగించండి
 10. అంబటి భానుప్రకాశ్.
  గద్వాల.

  చిత్రానికి తగిన పద్యం.
  ఆ**
  చిన్ని ప్రాణి యొకటి చింతయె లేకుండా,
  కట్టు కొనియె గూడు చెట్టు పైన,!
  సోమ రితన మిడువ సుందర మగుగాని,
  కష్ట మనగ దలువ. కార్య మౌన. !!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పద్యం బాగున్నది. అభినందనలు.
   విడువను ఇడువ అన్నారు. ‘సోమరితన మేది’ అందామా?

   తొలగించండి
 11. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 12. పక్షివైన నేమి పటిమతో నిర్మించు
  కుంటివంట యిల్లు కొమ్మలందు
  నీదు జాణతనము నెఱిగింప దే నీదు
  గృహము పులుగురాడు కీర్తి ఘనము

  గడ్డి పోచలన్ దెచ్చుచున్ గట్టినావు
  తూగు టుయ్యేల గృహమును బాగు బాగు
  రాణి వాసమొ యన్నట్లు రమ్యమైన
  సదనమదికాద మాకట్లు సాధ్యమగునె.

  రిప్లయితొలగించండి
 13. . విద్యను నేర్వలేదెచట|వీలునుబట్టియు పుల్ల లెన్నియో
  అద్యయనంబు జేయగల ఆర్యుల వోలెనుబట్టిదెచ్చి నీ
  విద్యనుజూపి లోకులకు పిట్టవుగాదిల శాస్త్రవేత్తవే|
  పద్యములల్లు రీతిగను పట్టుగ గూటిని గూర్చ?వింతయౌ|

  రిప్లయితొలగించండి
 14. 1పుల్ల పుడక దెచ్చి పుడమీరుహము పైన
  గూడు కట్టు చుండె గువ్వ యొకటి
  జంట కొరకు తాను జాలిగా చూచుచు
  గడుపు చుండె గాదె కాలమెల్ల.

  2.ముక్కున కరచుకు పుల్లల
  చక్కగ గూడును పిచుకలు సంబరపడుచున్
  అక్కజముగ నిర్మించుచు
  మక్కువ తోడను పిచుకలు సంతస మందెన్.

  3.పుల్లలు పుడకలు దెచ్చుచు
  నల్లుకొనియె గనుమిటు నానందముతో
  పిల్లల కొరకని ముదమున
  చల్లని వేళల మురియుచు చక్కగపిచుకల్
  .
  4.బంధము పెంచుట కొరకై
  యందముగానొక్క గూడు నాశతొ గట్టెన్
  డెందెము సంతస మందగ
  నందును సఖుడుండ గోరి యాత్రత తోడన్.

  5.పిచ్చుకమ్మ కెవరు ప్రేమతో నేర్పిరో
  చిక్కనైన గూడు సిద్ధమయ్యె
  సంతసమున తాను సఖునితో గడపంగ
  నెదురు చూచె పిచుక నిదుర మాని.

  రిప్లయితొలగించండి
 15. మిత్రులందఱకు నమస్సులు!

  శీర్షిక:- ...గిజిగాఁడు...

  చం.
  తగఁ జని తుమ్మకొమ్మలకొ, తాళ కుజాలకొ, యీఁత చెట్లకో
  తగులఁగఁ జేసి, గూండ్లు ఘనతం బ్రకటింపఁగ నేర్పు మీఱఁగన్
  బగఁ గొని పాములో యితర వైరులొ దాడినిఁ జేయకుంటకై
  గగనముఁ దాఁకునట్లు గిజిగాఁడు రచించుటఁ జూడఁ జిత్రమౌ!!


  తే.గీ.
  అద్భుతమ్ముగఁ గూఁడుఁ దా నాస్థఁ గట్టు
  నేర్పుఁ జూడంగఁ జిత్రమౌ నిర్మిత! మది
  తరుల శాఖల వ్రేలెడి తాజమహలొ?
  గగనసీమను విహరించు గౌరగృహమొ??


  ఆ.వె.
  సాక్ష్య మిచ్చు నెట్టి సాంకేతిక జ్ఞాన
  మో యదంచు జనులు మోహమంద!
  నందమైన యట్టి యానంద నిలయమ్ము
  కాదె చూడ నదియు కాంక్ష మీఱ?


  తే.గీ.
  అదియ గూఁటి నల్లెడి తీరు; లందముగనుఁ
  బిల్లలకుఁ దిండి నోఁటనుఁ బెట్టు విధము;
  శత్రుతతుల నెదుర్కొను సరణి; దాని
  యాటపాటల వైఖరి యచ్చెరు విడు!


  తే.గీ.
  గూండ్లఁ జిన్ని పిట్టలు తమ గోల లెగయ;
  భూనభోఽంతరాందోళికా భోగ సహిత
  సూక్ష్మ గేహాంతర స్థిత శోభ వెలయ
  నూఁగులాడుచుండును తూఁగుటూయలట్లు!


  శా.
  ఏదేనొక్క పృదాకు వేఁగఁ గని తా మెంతెంతయో నార్చుచున్
  బో దాఁకన్ ఘనమైన రీతిగను శబ్దోచ్చారణమ్ముల్ దగన్
  నాదౌద్ధత్యముఁ జూపి తత్తఱలఁ బెంచంగానె యా సర్పమున్
  నాదారెద్దియటంచుఁ బర్వులిడు నా నైపుణ్యముం గాచితే?


  ఆ.వె.
  శిరసు పైన స్వర్ణ శీర్షకమ్మున్నట్లు
  పసుపు వన్నె మిగుల బంగరువయి,
  చిబుక చూచుకములు చిక్కనౌ నలుపయి,
  నీలి గోధుమ బరి నెఱక లొలయు!


  తే.గీ.
  బిడ్డలకుఁ దిండిఁ బెట్టెడి పెద్దఱికమె
  యింతులకు బాధ్యతగఁ దగ నిడియు; గూఁడు
  నేర్పుగాఁ గట్టు బాధ్యత నెలమి మగఁడు
  కొనియు మెలఁగు చుండును భార్య మనము నెఱిఁగి!


  ఆ.వె.
  వరియు గడ్డి యాకు వంటి పీచునుఁ గొని
  నేసి కొంత గూఁటిఁ బ్రేయసికినిఁ
  జూపి, ముదము గొనిననే పూర్తిగాఁ దాను
  నేయు; లేదొ, పర కులాయ మల్లు!


  కం.
  గేహముఁ బూర్తిగ నేసియు
  గేహినిఁ బిలువంగ మివులఁ గేరింతలతో
  స్నేహము నెఱపుచుఁ దిరుగుచు
  మోహపరవశ యయి చేరు మురిపెమునఁ జెలున్!


  ఉ.
  నేలకు నింగికిన్ సరిగ నేస్తము లల్లిన గూఁటి వన్నియల్;
  మాలిమి తోడ వర్తిలెడి మంజుమనోహర నాట్యరీతి; రా
  గాలసమైన పాట; కవులాదరమున్ వెలిఁబుచ్చుచుండఁ దాఁ
  గాలముఁ బుచ్చుచుండు గిజిగాఁ డట హాయినిఁ జిల్కరించుచున్!


  -:శుభం భూయాత్:-

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. తొమ్మిదవ పద్యమందలి రెండవ పాదమున....టైపాటు ...యతిభంగం...

   నేను నేరుగా టైపుచేయుచు ...ముందుగా ఆ పాదమును..."నేసి కొంత గూఁటి నా సఖికినిఁ" అని టైపుచేసి...మఱల నెందులకో దానిని "...బ్రేయసి..." యని మరో పదం పెట్టాను. యతిభంగం గమనించలేదు. కాన, గత పాఠముతోనే తిరిగి పెడుతున్నాను.

   ఆ.వె.
   వరియు గడ్డి యాకు వంటి పీచునుఁ గొని
   నేసి కొంత గూఁటి నా సఖికినిఁ
   జూపి, ముదము గొనిననే పూర్తిగాఁ దాను
   నేయు; లేదొ, పర కులాయ మల్లు!

   ఇంతకన్న మంచి సవరణ నాలోచించు నోపిక లేక....అదే యిడితిని. మీ రేమైన సూచించగలరు.

   తొలగించండి
  2. మధుసూదన్ గారు "నెచ్చెలువకు" అంటే యెలా ఉంటుంది?

   తొలగించండి
  3. మధురకవి అని ఊరకే అన్నారా? అద్భుతమైన ఖండకావ్యాన్ని అందింది ఆనందాన్ని కలిగించారు. అభినందనలు, ధన్యవాదాలు.
   కామేశ్వర రావు గారి సూచన అనుసరణీయమని నా అభిప్రాయం.

   తొలగించండి
  4. మధురకవిమిత్రమా కైత బహుపసందు.

   తొలగించండి
  5. ఎక్కడను వ్రాసికొనకుండ నేరుగ టైపు చేయుటచే వెనుదిరిగి చూచుకొనుటకును నవకాశము లేకపోవుటచే నిట్టి దొసగు దొరలినది. నేను మొదటనే వ్రాసికొనిన దానికన్న సుకవిమిత్రులు కామేశ్వరరావు గారు సూచించిన సవరణము బాగుగ పొసగినది. వారికి నా ధన్యవాదములు.

   నా కవితా ఖండిక సుకవి మిత్రులు మిస్సన్నగారి అభిమానమునకు పాత్రమైనందుల కెంతయు నానందముగ నున్నది. వారికి నా ధన్యవాదములు.

   శంకరాభరణము ద్వారా సాహితీ సేవ నిరంతరాయముగ చేయుచు నిటువంటి ఖండికల వ్రాయించునట్టి ప్రేరణాత్మకములైన చిత్రముల నిడి కవులను ప్రోత్సహించుచున్న సుకవి మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి కృతజ్ఞతా పూర్వక ధన్యవాదములు!

   తొలగించండి
 16. పిచ్చుకగూడునుజూడగ
  నచ్చముగాగుహనుబోలియలరెనుమిగుల
  న్బిచ్చుకయాగూడునుదా
  నిచ్చనురకరకములుగనునేర్పరుచుకొనున్

  రిప్లయితొలగించండి
 17. శాస్త్ర సంశోధనాది విజ్ఞాన వృద్ధి
  కారణము చేత వింతల గలుగు చుండె
  చూడు మీ చిన్న పులుగును చిత్రమొదవ
  నల్లుచున్నది గూడేడ నల్ల నేర్చె

  రిప్లయితొలగించండి
 18. కవులు పదముల నల్లిన కరణి పక్షి
  యొకటి, రచనఁ జేసెడు కళ నొప్పుగాను
  గాంచ నొక్కింత రసికత కావలయును.
  లేని యెడ నెట్టి సారమ్ము లేదు లేదు.

  రిప్లయితొలగించండి
 19. కవి మిత్రులు మథుసూదన్ గారికి హృదయపూర్వకాభినందన చందనాలు.మథుర కవిగా, కర్ణపేయమైన కవిత నందించిన మీకు ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 20. కవి కోకిలల పాలిట కల్పవృక్షమైన కంది శంకరార్యులకు శతాధిక వందనములు.

  రిప్లయితొలగించండి
 21. కవి మిత్రులు మథుసూదన్ గారికి హృదయపూర్వకాభినందన చందనాలు.మథుర కవిగా, కర్ణపేయమైన కవిత నందించిన మీకు ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 22. ఎవరి కొరకీ నిరీక్షణ?
  ఎవరే నీ వారలిచట? ఎందుల కమ్మా?
  జవురుకొని యల్లి పుల్లలు
  కవుల కొరకు పోజులిడగ కడుపెటు నిండున్?

  రిప్లయితొలగించండి