3, మే 2016, మంగళవారం

సమస్య - 2022 (దీపాలంకృత గృహమున...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.. 
దీపాలంకృత గృహమునఁ దిమిరము నిండెన్.

87 కామెంట్‌లు:

  1. గురువు గారికి నమస్కారములు

    ఓ పెను గాలి విజృంభణ
    కా పట్టణమందు తీగలన్నియు తెగగ
    న్నో పెండ్లి వారి విద్యు
    ద్దీపాలంకృత గృహమున దిమిరము నిండెన్

    దీపిక వివాహ వేళన
    యాప ద్బాంధవు డగు నొకడసువులు బాయ
    న్నాపిరి పెండ్లిని కను యా
    దీపాలంకృత గృహమున దిమిరము నిండెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి.
      రెండవ పూరణలో ‘వేళన+ఆపత్’ అన్నపుడు యడాగమం రాదు. మీ పద్యానికి నా సవరణ...
      దీపిక వివాహ వేళకు
      నాపద్బాంధవుడగు నొక డసువులు బాయ
      న్నాపిరి పెండ్లిని గను డా
      దీపాలంకృత...’ అనండి.

      తొలగించండి
  2. పాపా లనుతొల గించగ
    దీపాలంకృత గృహమునఁ,దిమిరము నిండెన్
    కోపించె నేమొ రాతిరి
    శాపము సుడిగాలి వీచె శాంభవి మాయన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘శాపపు సుడిగాలి...’ అనండి.

      తొలగించండి
    2. పాపా లనుతొల గించగ
      దీపాలంకృత గృహమునఁ,దిమిరము నిండెన్
      కోపించె నేమొ రాతిరి
      శాపపు సుడిగాలి వీచె శాంభవి మాయన్

      తొలగించండి
  3. కోపాగ్ని రగులు మనసుల
    పాపాల ప్రభావ మెగసి భాగ్యము దొలుగన్
    తాపాల యూబిలో బడి
    దీపాలంకృత గృహమున దిమిరము నిండెన్!

    రిప్లయితొలగించండి
  4. ద్రౌపది నోడెను ధర్మజు
    డాపెకు ముందుగనె తనను యనుజుల నోడ
    న్నాపయి వనముల కరుగగ
    దీపాలంకృత గృహమునఁ దిమిరము నిండెన్.

    రిప్లయితొలగించండి
  5. పాపండౌ యభిమన్యుని
    పాపమ్ముగఁ గత్తి దూసి ప్రాణముఁ దీయన్
    వాపోయె చూలు నుత్తర!
    దీపాలంకృత గృహమునఁ దిమిరము నిండెన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘పాపండౌ నభిమన్యుని..వాపోయెను చూలుత్తర’ అనండి.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ:

      పాపండౌ నభిమన్యుని
      పాపమ్ముగఁ గత్తి దూసి ప్రాణముఁ దీయన్
      వాపోయెను చూలుత్తర!
      దీపాలంకృత గృహమునఁ దిమిరము నిండెన్!

      తొలగించండి
  6. మిత్రులందఱకు నమస్సులు!

    ఆ పెండ్లి యిల్లు విద్యు
    త్ప్రాపకమున వెలుఁగు! నొకట వర్ష విజృంభ
    మ్మోపక విద్యుత్తు చనఁగ,

    దీపాలంకృత గృహమునఁ దిమిరము నిండెన్!!

    రిప్లయితొలగించండి
  7. చూపులతోడనె కైకయె
    కోపవిలసితాంతరాత్మ కోరగ వరముల్
    వ్యాకులపడ దశరథుడా
    దీపాలంకృత గృహమున దిమిరము నిండెన్.

    రిప్లయితొలగించండి
  8. దీపావళి పర్వంబున
    రూపాలంకృతములయిన లోగిళ్ళందున్
    తూపాను దాపురించగ
    దీపాలంకృత గృహముల దిమిరము నిండెన్!

    రిప్లయితొలగించండి
  9. మాపటి వేళను విద్యు
    ద్దీపాలంకృత గృహమున తిమిరము నిండెన్
    రూపొందించిన విద్యుతు
    లోపించగ,నెల్ల జనులు లొల్లి యొనర్పన్

    రిప్లయితొలగించండి
  10. అంబటి భానుప్రకాశ్.
    గద్వాల.

    కం**

    కోపము చేతను వాయువు,
    ఆపక ,వీచిన తరుణము ఆపద గలిగీ !
    ఆపిరి దీపము నపుడే,
    ద్దీపాలంకృత గృహమున దిమిరము నిండెన్ !!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కొన్ని సంధి దోషాలున్నవి. నా సవరణ...
      కోపముచే పెనుగాడుపు
      లాపక వీచిన తరుణమునం దాపదయై
      యాపిరి దీపము నపుడే...’ అందామా?

      తొలగించండి
  11. తాప హరణము సురేంద్ర వ
    నోపమ విద్యుద్విహీన ముత్సవ విశ్రాం
    తోప వనస్థిత సమ్య
    గ్దీపాలంకృత గృహమునఁ దిమిరము నిండెన్.
    [దీపము = తీగ]

    రిప్లయితొలగించండి
  12. దీ పా వళి దిన మున మా
    పాపలు సంతో షమున ట పా సులు గాల్చ
    న్మా పాక దగ్ధ మగుటన
    దీ పా లంకృత గృహమున దిమిరము నిండెన్

    రిప్లయితొలగించండి
  13. కోపముననో! ఘన మునుల
    శాపమునో! పరుల భాష చపలత్వమునో!,
    తాపమునో! నిపుడు తెలుగు
    దీపాలంకృత గృహమున దిమిరము నిండెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వైవిద్యంగా చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
      ‘శాపముననొ... చపలత్వమ్మో...తాపముననొ యిపుడు...’ అనండి.

      తొలగించండి
    2. గురువు గారికి ధన్యవాదాలు.

      తొలగించండి
    3. జయన్నగారూ! అద్భుతమైన పూరణండీ.

      తొలగించండి
    4. జయన్నగారూ! అద్భుతమైన పూరణండీ.

      తొలగించండి
  14. దీపాల వేళ చన సాం
    దీపాలంకృత గృహమున, దిమిరము నిండెన్
    కూపారమందలి తనయు
    కాపాడి గురువు ఋణమును కావింపజనెన్౹౹

    (కృష్ణుడు సాందీపునికి గురుదక్షిణ ఇచ్చిన సందర్భం)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తంగిరాల రఘురామ్ గారూ,
      శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  15. . రూపాలాంకృతవధువుకు
    పాపంబొనగూడె నేమొ|పందిట నందే
    కోపిష్టి పెళ్లి నాపగ?
    దీపాలాంకృత గృహమున దిమిరము నిండెన్|

    రిప్లయితొలగించండి
  16. భూపాలుడు రఘురాముని
    నాపాటున నడవికంప నయ్యెడ కనరే
    పాపమ్మయోధ్య కుమిలెను
    దీపాలాంకృత గృహమున దిమిరము నిండెన్|

    రిప్లయితొలగించండి
  17. కం**

    కోపము చేపెను గాడుపు,
    లాపక ,వీచిన తరుణమునంపదయై !
    యాపిరి దీపము నపుడే,
    దీపాలంకృత గృహమున దిమిరము నిండెన్.


    సవరించిన పద్యము. ధన్యవాదాలు సర్.

    రిప్లయితొలగించండి
  18. కం**

    కోపము చేపెను గాడుపు,
    లాపక ,వీచిన తరుణమునందాపదయై !
    యాపిరి దీపము నపుడే,
    దీపాలంకృత గృహమున దిమిరము నిండెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాను ప్రకాష్ గార్కి...నమస్సులు... కోపము చేసిన గాడుపు....అంటే బాగుంటుందేమో!

      తొలగించండి
    2. మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి

  19. చేప కనుల సుందరియని
    పాపను బెండ్లాడి యామె పడకను జేరన్
    తాపము బెరగగ నార్పగ
    దీపాలంకృత గృహమున దిమిరము నిండెన్! (1)

    బాపని మంత్రాల నడుమ
    పాపకు వరునకును బెండ్లి బాగుగ జేయన్
    పాప యెటొ లేచి పోవగ
    దీపాలంకృత గృహమున దిమిరము నిండెన్! (2)

    రిప్లయితొలగించండి
  20. NVN చారి గారి పూరణము:

    ఈ పాపం బెయ్యదియో
    మా పాపడు సిడ్ని యందు మరణించె నొకో
    కాపాడ లేదు దైవము
    దీపాలంకృత గృహమునఁ దిమిరము నిండెన్!

    రిప్లయితొలగించండి
  21. బీటుకూరు శేషుకుమార్ గారి పూరణము:

    ఏ పేరుకు గతి పొంతన
    యేపాటిగ నుండు నిలను నీరజ నయనా!
    దీపము గాలికి బోవగ
    "దీపా"లంకృత గృహమున దిమిరము నిండెన్!!

    రిప్లయితొలగించండి
  22. చేపూరి శ్రీరామారావు (శ్రీరామ్) గారి పూరణము:

    శాప మ్మా నిశి; విద్యు
    త్తాపమ్మున బెండ్లి కొడుకు తనువు నశింపన్
    పాప మ్మందరు నేడ్వగ
    దీపాలంకృత గృహమున దిమిరము నిండెన్!

    రిప్లయితొలగించండి
  23. గురిజాల ప్రసాద్ గారి పూరణము:

    మాపటి విందున విద్యు
    ద్దీపములను బేర్చి వరుస దీర్చగ విద్యు
    త్తాపమున లతలు కరుగగ
    దీపాలంకృత గృహమున దిమిరము నిండెన్!

    రిప్లయితొలగించండి
  24. గాదిరాజు మధుసూదన రాజు (సందిత) గారి పూరణము:

    పాపకు జన్మదినం బని
    దీపాలను నింటిచుట్టు తీర్చిరి! గదిలో
    పాపయె వత్తుల నార్పగ
    దీపాలంకృత గృహమున తిమిరము జొచ్చెన్!

    రిప్లయితొలగించండి
  25. నా 3వ పూరణము తాపము హెచ్చగనెండలొ నేపనికిన్ జనగలేక నింటనె యుుండన్ మాపటి వేళకు``జందురు


    తాపము హెచ్చగ నెండను
    నేపనికిన్ జనగ లేక యింటనె యుుండన్
    మాపటికి తిండి దొరుకకగ
    దీపాలంకృత గృహమున దిమిరము నిండెన్!! (3) మధుర కవి గారి సవరణ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తాపము హెచ్చగ నెండను
      నేపనికిన్ జనగ లేక యింటనె యుుండన్
      మాపటికి తిండి దొరుకక
      దీపాలంకృత గృహమున దిమిరము నిండెన్!!

      తొలగించండి
    2. కాంతికృష్ణ గారూ,
      మీ మూడవ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  26. అంబటి భాను ప్రకాశ్ గారి పూరణము:

    దీపించెను సుర లోకము,
    దాపల సుమ పారిజాత తరువుల చేతన్!
    గోపా లాపహృతిని ద
    ద్దీపాలంకృత గృహమున దిమిరము నిండెన్! !

    మధురకవిగారి సవరణతో,

    రిప్లయితొలగించండి
  27. గుమ్మా నాగమంజరి గారి పూరణము:

    పాపమని తెలిసి చేసిన
    శాపోపహతుడు తలచెను చాపల్యమునన్!
    నా పనుల నీ మనస్సను
    దీపాలంకృత గృహమున తిమిరము జొచ్చెన్ !!

    రిప్లయితొలగించండి
  28. దీపావళి యన ముచ్చట
    పాపలకెంతో, తలవక వానలు రాగా
    దీపములైనను వెలగక
    దీపాలంకృత గృహమున తిమిరము నిండెన్

    రిప్లయితొలగించండి
  29. గుమ్మా నాగమంజరి గారి రెండవ పూరణము:

    దీపపు కాంతులె యింటను
    చూపరులకు విందుచేయ చోద్యము చూడన్
    కోపమున వాదులాడగ
    దీపాలంకృత గృహమున తిమిరము జొచ్చెన్!

    రిప్లయితొలగించండి
  30. ఆ పారిజాత కుసుమముఁ
    శ్రీపతి రుక్మిణి కొసంగ చెదరిన మదితో
    కోపముఁ గొనంగ సత్యయె
    దీపాలంకృత గృహమున దిమిరము నిండెన్!

    రిప్లయితొలగించండి
  31. పాపాత్ముండౌ కంసుని
    పాపండగు శౌరి జంపి బాధలు బాపెన్
    తాపముచేసతు లేడ్వన్
    దీపాలంకృత గృహమున దిమిరము నిండెన్.

    2.పాపలగుపాండు తనయుల
    కోపావేశంబును పూని గురుసుతు డుర్విన్
    తాపూని జంప నచ్చో
    దీపాలంకృత గృహమున దిమిరము నిండెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      రెండవపూరణ రెండవపాదంలో గణదోషం. ‘కోపావేశంబు పూని/ కోపావేశమును పూని’ అనండి.

      తొలగించండి
  32. కోపముతో కైకేయియె
    భూపాలుని వరము లడిగి భువిపై గూల్చన్
    వాపోయె నయోధ్యాపురి
    దీపాలంకృత గృహమున తిమిరము నిండెన్!!!


    గోపిక జన్మదినమ్మున
    చూపరులకు విందు జేయ జోతులు తోడన్
    పాపము విద్యుత్ బోవగ
    దీపాలంకృత గృహమున తిమిరము నిండెన్!!!


    రిప్లయితొలగించండి
  33. పాపా పిల్లలతోడను
    కాపురమిల వెలిగె కాని కలహంబులతో
    పాపము చెదిరెను తోషము
    దీపాలంకృత గృహమునఁ దిమిరము నిండెన్.

    రిప్లయితొలగించండి



  34. దీపావళి పబ్బమున పి
    న్న పెద్దలందరతి చులకన పటాసుల పే
    ల్చన్ పెను యపాయము జరుగ
    దీపాలంకృత గృహమున దిమిరము నిండెన్
    �.💡💡

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మజ్జారి చెన్నకేశవులు గారూ,
      శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
      మీ పద్యంలో గణ, ప్రాస దోషాలున్నవి. కంద పద్యంలో పాదాల మొదటి అక్షరాలు అన్నీ గురువులు కాని, లఘువులు కాని ఉండాలి. మీరు రెండవపాదాన్ని లఘువుతో ప్రారంభించారు. మూడవపాదంలో ప్రాస తప్పింది. అభ్యాసం వల్ల మీరు చక్కని పద్యాలు వ్రాయగలరు. కొనసాగించండి.

      తొలగించండి
  35. కం. రే పంటి యక్క నిలచెన్
    దీపాలంకృత గృహమున, దిమిరము నిండెన్
    కోపాలంకృత గృహమున
    నేపారు శుభాశుభంబు లీతెఱఁగనగన్.

    రిప్లయితొలగించండి
  36. పాపా! నీవువిడుచుటన్
    దీపాలంకృతగృహమున దిమిరము నిండెన్
    కాపాడుము సంసారము
    శాపములను పెట్టకుండ సహనముతోడన్

    రిప్లయితొలగించండి
  37. కం**

    కోపము చేపెను గాడుపు,
    లాపక ,వీచిన తరుణమునంపదయై !
    యాపిరి దీపము నపుడే,
    దీపాలంకృత గృహమున దిమిరము నిండెన్.


    సవరించిన పద్యము. ధన్యవాదాలు సర్.

    రిప్లయితొలగించండి
  38. కవిమిత్రులకు మనవి...
    ఎందుకో నా ఇంటర్‍నెట్ వేగం చాలా తగ్గిపోయింది. ఒక్కొక్క వ్యాఖ్యను పోస్ట్ చేయడానికి కనీసం ఐదు నిమిషాలు పడుతున్నది. ఈరోజు నేను కొన్ని ముఖ్యమన పనుల్లో వ్యస్తుణ్ణై అలసి ఉన్నాను. అందువల్ల అందరి పూరణలను ఇప్పుడు సమీక్షించలేను. రేపు ఉదయం నా స్పందనలను తెలియజేస్తాను. ఆలస్యానికి మన్నించండి.

    రిప్లయితొలగించండి
  39. ఈ పుర గీముల సూటిగ
    నా పగలింటి దొర పొలయు నాటి గవాక్షుల్
    తోపింపక, బవలు కృత
    గ్దీపాలంకృత గృహమునఁ దిమిరము నిండెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మాజేటి సుమలత గారూ,
      బహుకాల దర్శనం... సంతోషం!
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘పుర గీముల’ అనడం దుష్టసమాసం. ‘పుర గృహముల’ అనండి.

      తొలగించండి
  40. పాపయ్య శెట్టి యటకను
    దాపించిన కోటి కోటి ధనముల కట్టల్
    రూపాయలు చెల్లవనగ
    దీపాలంకృత గృహమునఁ దిమిరము నిండెన్

    రిప్లయితొలగించండి