2, ఏప్రిల్ 2025, బుధవారం

సమస్య - 5081

3-4-2025 (గురువారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“శునకమ్ములు పువ్వులగుచు శోభించె నటన్”

(లేదా...)

“శునకమ్ముల్ గుసుమంబులౌచు మిగులన్ శోభించె నచ్చోఁ గనన్”

20 కామెంట్‌లు:

  1. కందం
    మునుపటి గాథ కిరాతా
    ర్జునీయమున నర్జునుండు సోముని తోడన్
    బెనఁగుచు సంధింపఁగ నీ
    శునకమ్ములు పువ్వులగుచు శోభించె నటన్!

    మత్తేభవిక్రీడితము
    మునుపీశానుడు నర్జునుండు కిటికై పోరన్కిరాతార్జునీ
    య నభూతో! నభవిష్యతీ! యనెడు కావ్యంబందు వర్ణింపగన్
    దనదంచున్ నరుఁడేయగన్ విసురుగన్ తండోపతండంబు నీ
    శునకమ్ముల్ గుసుమంబులౌచు మిగులన్ శోభించె నచ్చోఁ గనన్

    రిప్లయితొలగించండి
  2. కం॥చనుచును మాంత్రికుని ప్రతిభ
    మనుజులు మెచ్చెడు పగదిని మాయలు విరియన్
    మనసిడి పఠించ మంత్రము
    శునకమ్ములు పువ్వులగుచు శోభించె నటన్

    మ॥ తనరన్ మేటిగ మంత్ర తంత్రముల నాద్యంతమ్ము నుత్కంఠతో
    మనుజుల్ గాంచెడి రీతి స్ఫూర్తిఁ గని సమ్మానించఁగన్ వీక్షకుల్
    చనుచున్ దండముఁ ద్రిప్పి వింతపదముచ్ఛరించఁగన్ వెంటనే
    శునకమ్ముల్ గుసుమంబులౌచు మిగులన్ శోభించె నచ్చోఁ గనన్

    రిప్లయితొలగించండి
  3. మినుసిగ వేలుపుతో న
    ర్జునునకు జరిగిన దురమున సోమమ్మున ఫ
    ల్గుణుడమ్ములు విసరఁగ నీ
    శునకమ్ములు పువ్వులగుచు శోభించె నటన్

    రిప్లయితొలగించండి

  4. అనికై కవ్వింప శరా
    సనమున్ జేబూని నరుడు శరములు రాల్చన్
    ఘనుడగు భర్గుడు గౌరీ
    శునకమ్ములు పువ్వులగుచు శోభించె నటన్.


    తనభక్తుండగు శ్వేతవాహనునటన్ దా శోధనన్ జేయగా
    కనభిల్లుని రూపమందు జనుచున్ గవ్వింపగా నా క్రీడియే
    కినుకన్ బూనుచు కాలుదువ్వి వరుసన్ కింశారువుల్ వేయ నీ
    శునకమ్ముల్ గుసుమంబులౌచు మిగులన్ శోభించె నచ్చోఁ గనన్.

    రిప్లయితొలగించండి
  5. ఘనముగ పార్థుడచట తప
    మొనరించుచు తలపడెనొక బోయనితోడన్
    తన పోరాటమున మహే
    శునకమ్ములు పువ్వులగుచు శోభించె నటన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    2. వనమందున్ దపమాచరించు నపుడే ప్రాఘాత సంరంభియై
      తన సామర్ధ్యముఁ జూపగోరి సరిగా తానెంచి బాణంబులన్
      ఘనుడా పార్థుడు యుద్ధమందువిడువన్ గమ్మత్తుగా నామహే
      శునకమ్ముల్ గుసుమంబులౌచు మిగులన్ శోభించె నచ్చోఁ గనన్

      తొలగించండి
    3. మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  6. అనుకొనక గోళ్ళ మొనయిడ
    పెనిమిటి వచ్చుట గని కడు పేర్మిగ నతనిన్
    జని కౌగలించగ మహే
    శునకమ్ములు పువ్వులగుచు శోభించె నటన్

    మహేశునకు + అమ్ము
    అమ్ము = వీఁపుమీఁద నఖక్షతము

    రిప్లయితొలగించండి
  7. తన రూపమ్మును మార్చి ధూర్జటి కిరాతాకారమున్ బూని య
    ర్జునునిన్ శోధన సేయ కాననమునన్ లోకేశుడేతెంచగన్
    వనిలో సాగిన యుద్ధమందు నరుడే బాణంబులేయంగ నీ
    శున కమ్ముల్ గుసుమంబులౌచు మిగులన్ శోభించె నచ్చోఁ గనన్

    రిప్లయితొలగించండి
  8. ఘనుడౌ పార్థుడు వొంద పాశుపతమున్ గంగాధరున్ వేడగన్
    ముని వృత్తిన్ తపమాచరింప శివుడే బోయండుగన్ రాగ తాన్
    వన కుందారముకై రణంబె సలుపన్ బాణమ్ములే వేయ నీ
    శునకమ్ముల్ గుసుమంబులౌచు మిగులన్ శోభించె నచ్చోఁ గనన్!!

    రిప్లయితొలగించండి
  9. కం:తన ప్రత్యర్థి శివుండని
    తన కెరుకయె లేక నరుడు ధనువెక్కిడి చ
    క్కని శౌర్యము జూపగ నీ
    శున కమ్ములు పువ్వులగుచు శోభించె నటన్”

    రిప్లయితొలగించండి
  10. మ:తనకున్ కుక్కల పైన ప్రేమ,సుమముల్ దాగోరు నిత్యమ్ము నం
    గన, యా భర్తయు భార్యకున్ సుమములున్,గారాన బిస్కెట్లు దె
    చ్చును కుక్కల్ తిన గోరి వారి గృహమున్ జూడంగ ముఖ్యమ్ము లా
    శునకమ్ముల్ గుసుమంబులౌచు మిగులన్ శోభించె నచ్చోఁ గనన్”
    (ఆమెకి ప్రతిరోజు పువ్వులు,ఆమె పెంపుడు కుక్కలకి బిస్కెట్లు కావాలి.ఆ ఇంట్లో అన్నిటి కంటే కుక్కలు,పువ్వులే ముఖ్యం.)

    రిప్లయితొలగించండి
  11. పన చిరి మారుని సుర తతి
    మునుకొని శరములను వేసి ముక్కంటి మదిన్
    ఘనము గ మార్చంగా నీ
    శునకమ్ము లు బువ్వు లగుచు శోభంచె నట న్

    రిప్లయితొలగించండి
  12. జనసందోహం బలరుచు
    వినుతింప వృకారి మణుల వేడుక యందుం
    గన దంబరములఁ బెంపుడు
    శునకమ్ములు పువ్వు లగుచు శోభించె నటన్


    కనుకట్టో యది వంచనాత్మకమొ శంకా పూర్ణముల్ డెందముల్
    కను లల్లాడవు సుంత సంగరమునన్ గాండీవి దోర్దండ సం
    జనితామోఘము లెల్ల వ్యాధ వర వేషస్వామికిం బార్వతే
    శున కమ్ముల్ కుసుమంబు లౌచు మిగులన్ శోభించె నచ్చోఁ గనన్

    రిప్లయితొలగించండి

  13. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    ఘను డింద్రజాలికుడు మన
    కనులెదుటనె సుమములఁ శునకములుగ
    మార్చెన్
    తన ప్రతిభను చూప మరల
    శునకమ్ములు పువ్వులగుచు శోభించె నటన్

    రిప్లయితొలగించండి