వలదు నాకీ ముసలిదాని బాధ్యతనుచు చెప్పి వృద్ధాశ్రమములోన చేర్చినట్టి ఖలురె పుత్రులు గానిల కలిగి నట్టి తల్లి మృతికిఁ దనయలేడ్చుటెల్ల వింత.
ముల్లెలు గట్టియిచ్చినది పూజ్యమటంచును నీవు పేర్మితో పిల్లల మైన మాకొరకు పెద్దగ చేసిన దేమిటంచు నా తల్లిని తిట్టి కొట్టి సతతమ్మవ మానము చేయు మూర్ఖులా తల్లి గతించినంతట సుతల్ విలపించుట వింతయే సుమీ.
తేటగీతి
రిప్లయితొలగించండిఅక్కగతియింప బిడ్డల నాదరించి
చెల్లి బావను మనువాడి చేరదీసి
ఘటికులుగ తీర్చి పెంచఁగ! నెటుల మాఱు
తల్లి మృతికిఁ దనయలేడ్చుటెల్ల వింత?
ఉత్పలమాల
చెల్లిగ నక్కపిల్లలను చేకొని బావకు పంచి రాగమున్
దల్లిగ పిల్లలన్ గనక త్యాగము సూపి నివాళి యక్కకం
చుల్లమునందునన్ నిలిపి యున్నతి గాంచఁగ పెంచినంత నా
తల్లి గతించినంతట సుతల్ విలపించుట వింతయే సుమీ?
తే॥ భువిని పుట్టిన ప్రాణుల మొగము పైన
రిప్లయితొలగించండివ్రాసి యుండ బ్రహ్మ మృతినిఁ బడయు దినము
తప్ప గలద నుదిటి వ్రాత తరచి చూడ
తల్లి మృతికిఁ దనయులేడ్చుటెల్ల వింత
ఉ॥ చెల్లద యాయువెల్లరికి చెప్పఁగ నేలనొ ప్రాణులన్నియున్
మెల్లగ దాఁటి పోవుఁ గద మేదిని జీవిత మంతమై చనన్
దెల్లము బ్రహ్మ సృష్టియును దేహము నశ్వర మంచుఁ దీర్చినన్
దల్లి గతించినంతట సుతల్ విలపించుట వింతయే సుమీ
మొదటి పాదములో ఆయువెల్లరికి అండి
తొలగించండిపండుగ దివసమున కడు వలపు తోడ
రిప్లయితొలగించండికొమరులడిగిన వెంటనె కుక్క నొకటి
గూర్చి యుండ , పెద్దగ వ్యాధి గొనిన దాని
తల్లి మృతికిఁ దనయలేడ్చుటెల్ల వింత
తల్లి మరణింప గ సవతి తల్లి తమను
రిప్లయితొలగించండిరాచి ఱ o పాన పెట్టిన రాక్షసి గను
బాధ లందున ముంచిన పడతి సవతి
తల్లి మృతి కి తనయ లే డ్చు టెల్ల వింత
రిప్లయితొలగించండివలదు నాకీ ముసలిదాని బాధ్యతనుచు
చెప్పి వృద్ధాశ్రమములోన చేర్చినట్టి
ఖలురె పుత్రులు గానిల కలిగి నట్టి
తల్లి మృతికిఁ దనయలేడ్చుటెల్ల వింత.
ముల్లెలు గట్టియిచ్చినది పూజ్యమటంచును నీవు పేర్మితో
పిల్లల మైన మాకొరకు పెద్దగ చేసిన దేమిటంచు నా
తల్లిని తిట్టి కొట్టి సతతమ్మవ మానము చేయు మూర్ఖులా
తల్లి గతించినంతట సుతల్ విలపించుట వింతయే సుమీ.
తల్లిని మించి యన్యమగు దైవము లేదని నమ్మి తద్దయున్
రిప్లయితొలగించండితల్లడవెట్టు నామయము తాళగజాలని దుర్గతిన్ గనన్
తల్లికి దేహముక్తియె నితాంత సుఖంబుల నిచ్చునంచు నా
తల్లి గతించినంతట సుతల్ విలపించుట వింతయే సుమీ
పిల్లలు తమతల్లి కొరకు బెగ్గడిల్లి
రిప్లయితొలగించండితల్లి మృతికిఁ పరితపింతురుల్లమందు
పిల్లలు జనించి కన్నులు విప్పకుండ
తల్లి మృతికిఁ దనయలేడ్చుటెల్ల వింత
పిల్లలు తల్లికై పరితపించుట సాజము లోకమందునన్
దల్లి శరీరపాతముకుఁ దల్లడపాటిల శక్యమేగదా
పిల్లలు పుట్టి కన్నులను విప్పక పూర్వమె చావు దగ్గరై
తల్లి గతించినంతట సుతల్ విలపించుట వింతయే సుమీ
ఉల్లముఁదల్లడిల్లఁగనునూయలలూపవిదేశమేగి తా
రిప్లయితొలగించండిపిల్లలపిల్లలన్గనుచు పెన్నిధి యయ్యెను మాతృమూర్తిఁవా
రొల్లక రోగబాధలను రొక్కము బెట్టగ చింతజేయుచున్
తల్లి గతించినంతట సుతల్ విలపించుట వింతయే సుమీ
కొరుప్రోలు రాధాకృష్ణ రావు
తల్లి వయసుయు డెబ్బది దాటె నేడు
రిప్లయితొలగించండివారితల్లికి నిండుగ వందయుండి
శయన మందునే వెతలేక జరిగె,తల్లి
తల్లి మృతికిఁ దనయలేడ్చుటెల్ల వింత
తల్లి మృత్యుముఖమ్మున తల్లడిల్లి
రిప్లయితొలగించండిబ్రతుకు దుర్భర వేదనన్ రగులుచుండ
తనువు చాలించ మేలని తలచిగూడ
తల్లి మృతికిఁ దనయలేడ్చుటెల్ల వింత
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికలలు నిజము లగుట యెందుఁ గల్లలు సుమి
తొలగించండియన్న యార్యోక్తు లెఱుఁగమె యవని లోన
నాగ కీ రీతి నొక కల యందుఁ గన్న
తల్లి మృతికిఁ దనయ లేడ్చు టెల్ల వింత
తల్లడిలంగ నెల్లరును దారుణముం గన మిక్కుటమ్ముగా
నుల్లము లందు సుంత ముద ముబ్బక యుండుట సోదరాదులుం
బెల్లుగ నా కుటుంబమున వీడక యెన్నఁడు నుండు నట్టి పో
ర్తల్లి గతించి నంతట సుతల్ విలపించుట వింతయే సుమీ
[పోరు తల్లి= ముఖ్యపుఁ బోరు / జగడ మను తల్లి]
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
బాధ్యత వలదు నాస్తి కావలయు మాక
టంచు తల్లిని వృద్ధుల యాశ్రమమున
జేర్చి సాకుల నెన్నియో చెప్పు వారు
తల్లి మృతికిఁ దనయలేడ్చు టెల్ల వింత.