17, జనవరి 2026, శనివారం

సమస్య - 5354

18-1-2026 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కారము పాయసమునందుఁ గడు హెచ్చయ్యెన్”
(లేదా...)
“కారం బెక్కువ యయ్యెఁ బాయసమునం గంజాతపత్రేక్షణా”
(భరతశర్మ గారి శతావధానంలో ముద్దు రాజయ్య గారి సమస్య)

3 కామెంట్‌లు:

  1. కోరి తినగ తీపి యడరె
    కారణమేమనుచు యెంచి కతన నెరిగితిన్
    ఈరూపిడు వారల మమ
    కారము పాయసమునందుఁ గడు హెచ్చయ్యెన్”

    రిప్లయితొలగించండి
  2. సురముని నారదుఁడు సత్యభామ తో..

    కందం
    వారిజ నయనా! కృష్ణుడు
    పారిజమున్ రుక్మిణి కిడె వారించి మిమున్
    దారగ నిడ ననయము, మమ
    కారము, పాయసమునందుఁ గడు హెచ్చయ్యెన్

    శార్దూలవిక్రీడితము
    చేరెన్ బారిజమొంది రుక్మిణి దరిన్ శ్రీకృష్ణుఁడుత్సాహియై
    వారించెన్ మిముఁ బక్షపాతమెదియో పారాడ ప్రేమాంబుధిన్
    దారా రత్నమనంగఁ 'బంచ' ,ననుబంధంబెల్ల మాధుర్య సం
    స్కారం బెక్కువ యయ్యెఁ, బాయసమునం గంజాతపత్రేక్షణా!

    రిప్లయితొలగించండి

  3. ఔరసుని జన్మ దినమని
    కోరిన వంటకముల నిట కోకొల్లలుగా
    కూరిమి జేయగ, నీ మమ
    కారము పాయసమునందుఁ గడు హెచ్చయ్యెన్.


    ఔరా యేమని చెప్పమందువిట నీవాత్మీయతన్ జూపుచున్
    భూరిన్ వంటలు సేసి బంధువులకున్ బోనమ్ము నందింపగా
    వారల్ మోదము నందనేమి కనగా భావమ్మనే తీపి సం
    స్కారం బెక్కువ యయ్యెఁ బాయసమునం గంజాతపత్రేక్షణా.

    రిప్లయితొలగించండి