ఉ:బాధ యొకింత లేని యొక భాగ్యయుతుండగు న్యాయవాది తా బాధల మాన్ ప బేదలకు వైద్యము సేయగ హోమియోపతిన్ సాధన జేసె, దేహవిధి జక్కగ నథ్యయనమ్ము జేయుచున్ వ్యాధి నెఱింగి తగ్గుటకు నౌషధమిచ్చును న్యాయవాదియే” (ఇది కూడా వాస్తవ విషయమే. ఒక న్యాయవాది ప్రతి ఆది వారము ఉచితం గా హోమియో వైద్యం చేసే వాడు.ఆ న్యాయవాదే సరైన వైద్యం చేస్తాడు అని.)
1)ఆ.వె: అనిబిసెంటు నొక్క డడుగ సాయము న్యాయ విద్య కొరకు " నొకడు వైద్యుడైన వ్యాధి నయమొనర్చు ,న్యాయవాది వయిన తగవు నేర్పెద వని తప్పు కొనియె. (ఇది మా బంధువుల లో జరిగిన కథయే.మా బంధువుల లో ఒకాయన పేదరికం లో ఉండి న్యాయవాద విద్య నేర్చుకోటానికి అనీబిసెంట్ ని ఆర్థిక సహాయం అర్థించాడు.ఆమె గొప్ప దానగుణం కలిగిన ఉత్తమురాలు కానీ ఆమెకి న్యాయవాదు లంటే చాలా అసహ్యం.లాయర్ వృత్తి మోసకారి వృత్తి అని పైసా కూడా సాయం చెయ్యను పొమ్మంది. ఆయన అదే పని గా ప్రాథేయ పడితే ఏడాదికి ఐదు వందలు సాయం చెయ్యటానికి ఒప్పుకొన్నది. )
ఉన్నతుడగు వెజ్జు యుండ పురజనుల
రిప్లయితొలగించండివ్యాధి నయమొనర్చు ; న్యాయవాది
వారి నడుమ బుట్టు వాదములను దీర్చు ,
వలయు వారి యునికి పట్టణమున
ఉ.
రిప్లయితొలగించండిబాధ భరించి సాగుము వివాదము మాన్పగ నూరి వీడి రా
గా ధనముల్ గ్రహించితిమి కాలము దారిని వేసె దేవతా
రాధిత పాద పద్ముడగు లాలిత కౌస్తుభ ధారి కొల్చి నీ
వ్యాధి నెరింగి తగ్గుటకు నౌషధమిచ్చును న్యాయవాదియే !
ఆటవెలది
రిప్లయితొలగించండివ్యాజ్యములను జిక్కి న్యాయమందఁగనెంచ
ధనమదంపు రోగతత్వమలమి
త్వరిత గతిని తెగని వరుస నిరువురకు
వ్యాధి నయమొనర్చు న్యాయవాది!
ఉత్పలమాల
బాధితులిర్వురున్ మదినిఁ బంతము తోడను సామరస్యమున్
శోధనఁ జేయకే చెలఁగి సొమ్ములు గల్గిన రోగమూలమై
సాధకబాధకాల్ మఱచి సాగిన న్యాయసభన్ విలంబమై
వ్యాధి నెఱింగి తగ్గుటకు నౌషధమిచ్చును న్యాయవాదియే!
రిప్లయితొలగించండిఆస్తి పోవు నంచు నభిశంక తోడను
వ్యాధి తెచ్చు కొనియె పన్న కాదె
యవజితి మన దంచు నభయ మొసగి, మనో
వ్యాధి నయమొనర్చు న్యాయవాది.
బాధల కోర్చి కూర్చిన యుపార్జన మొత్తము మాదటంచు వా
గ్వాదము జేసియంశకులు వ్యాజ్యము వేసిరటంచు బెంగతో
వ్యాధిని కోరి తెచ్చుకొనె పార్పరు డక్కట వానిదౌ మనో
వ్యాధి నెఱింగి తగ్గుటకు నౌషధమిచ్చును న్యాయవాదియే.
రోగి బాధ నెఱిగి లోకాన వైద్యుడే
రిప్లయితొలగించండివ్యాధి నయమొనర్చు; న్యాయవాది
కక్షిదారు హక్కు రక్షింప నిలబడి
వాదులాడుననుట వాస్తవమ్ము
బాధిత రోగులెల్లరకు ప్రాపుగ నిల్చును వైద్యుడేకదా
బాధకు మూలకారణము బాగుగ శోధన చేసి పిమ్మటన్
వ్యాధి నెఱింగి తగ్గుటకు నౌషధమిచ్చును; న్యాయవాదియే
బాధిత కక్షిదారులకు వాదన సల్పెడి సాధనమ్మగున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండివాయిదాలపైన వాయిదాలనడిగి
వాగురమున బట్టివైచి జనులఁ
వదలగొట్టి డబ్బు వ్యాజ్యమనెడుమనో
వ్యాధి నయమొనర్చు న్యాయవాది
వాగురము : వల , snare
ఆటవెలది:
రిప్లయితొలగించండివ్యాధిబారినపడు వానికి వైద్యుఁడు
వ్యాధి నయమొనర్చు, న్యాయవాది
న్యాయమూర్తి యెదుట వ్యాజ్యములందున
వాదనలను జరిపి వఱలుచుండు
ఉత్పలమాల:
వ్యాధులు సోకి బాధపడువారల రుగ్మత మాన్ప వైద్యుఁడా
వ్యాధి నెఱింగి తగ్గుటకు నౌషధమిచ్చును, న్యాయవాదియే
వాదనజేయు తీరుగను వ్యాజ్యమునందున కక్షిదారుకున్
వేదనదీర్చి న్యాయమును వేగముగా సమకూరునట్టులన్
ఆ॥ వ్యాజ్యములు మనుజుల బ్రదుకు ఛిద్రము చేయు
రిప్లయితొలగించండిబాధలొసఁగి మిగుల సాధితుఁడగు
నేర్పు విజ్ఞత యటు నిండుగ గనఁగ నీ
వ్యాధి నయమొనర్చు న్యాయవాది
ఉ॥ బాధలఁ గూర్చు వ్యాజ్యములు బాహ్యపు జబ్బులుఁ గావయా కనన్
వీధిని వైచుఁ గొల్లగొన వేగమ సంపద సౌఖ్యమంతయున్
సాధి కృశించు నిక్కముగఁ జక్కని జ్ఞానము ధైర్యమున్న నీ
వ్యాధి నెఱింగి తగ్గుటకు నౌషధమిచ్చును న్యాయవాదియే
సాధి one who is in the grip of sorrow సాధితుడు సాధింపబడిన వాడు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఉ:బాధ యొకింత లేని యొక భాగ్యయుతుండగు న్యాయవాది తా
రిప్లయితొలగించండిబాధల మాన్ ప బేదలకు వైద్యము సేయగ హోమియోపతిన్
సాధన జేసె, దేహవిధి జక్కగ నథ్యయనమ్ము జేయుచున్
వ్యాధి నెఱింగి తగ్గుటకు నౌషధమిచ్చును న్యాయవాదియే”
(ఇది కూడా వాస్తవ విషయమే. ఒక న్యాయవాది ప్రతి ఆది వారము ఉచితం గా హోమియో వైద్యం చేసే వాడు.ఆ న్యాయవాదే సరైన వైద్యం చేస్తాడు అని.)
1)ఆ.వె: అనిబిసెంటు నొక్క డడుగ సాయము న్యాయ
రిప్లయితొలగించండివిద్య కొరకు " నొకడు వైద్యుడైన
వ్యాధి నయమొనర్చు ,న్యాయవాది వయిన
తగవు నేర్పెద వని తప్పు కొనియె.
(ఇది మా బంధువుల లో జరిగిన కథయే.మా బంధువుల లో ఒకాయన పేదరికం లో ఉండి న్యాయవాద విద్య నేర్చుకోటానికి అనీబిసెంట్ ని ఆర్థిక సహాయం అర్థించాడు.ఆమె గొప్ప దానగుణం కలిగిన ఉత్తమురాలు కానీ ఆమెకి న్యాయవాదు లంటే చాలా అసహ్యం.లాయర్ వృత్తి మోసకారి వృత్తి అని పైసా కూడా సాయం చెయ్యను పొమ్మంది. ఆయన అదే పని గా ప్రాథేయ పడితే ఏడాదికి ఐదు వందలు సాయం చెయ్యటానికి ఒప్పుకొన్నది. )
పట్టు వదల కుండ వాదించి వాదించి
రిప్లయితొలగించండిసత్యము గెలిపించి యత్యధికము
ద్రవ్య మపహరింపఁ బ్రత్యర్థులకుఁ బట్ట
వ్యాధి, నయ మొనర్చు న్యాయవాది
సాధన తోడ జ్ఞానము భృశమ్ముగ నుండఁ బ్రసిద్ధ వైద్యుఁడే
బాధ లొసంగు రోగమును బన్నుగ మాన్ప ధరాతలమ్మునన్
నైధన తుల్య సంకటము జ్ఞాతి నికాయ మొసంగు నా మనో
వ్యాధి నెఱింగి తగ్గుటకు నౌషధ మిచ్చును న్యాయవాదియే
ధర్మ పక్ష మందు ధైర్యమ్ము గానిల్చి
రిప్లయితొలగించండిజయము పొంద నె o చు నయముగాను
శిష్టు లైన వారి కష్టమ్ము లని యె డి
వ్యాధి నయ మొనర్చు న్యాయ వాది
ఆ॥వె
రిప్లయితొలగించండివాయిదాల మందు వరుసనిడుచునుండి
కక్షిదారులొడమి గతుకుచుండి,
వ్యాజ్యలంపటమ్ము వ్యసనమై జనువారి
"వ్యాధి" నయమొనర్చు న్యాయవాది!!
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
వాడి తగిన మందు వైద్యుడు రోగుల
వ్యాధి నయమొనర్చు; న్యాయవాది
గెలువ కేసు తాను నిలిచి న్యాయము వైపు
వాదనందు తగిన పటిమ చూపు.
వెజ్జుమందొసంగివేగముగాతాను
రిప్లయితొలగించండివ్యాధినయమొనర్చు;న్యాయవాది
వాదనా పటిమను వాసిగా చూపించి
నిలుపు న్యాయము నిల నిక్క మిదియు.
డా బల్లూరి ఉమాదేవి
శోధనచేసిశాస్త్రములుచూచుచునాడిని వైద్యుడొప్పుగా
*వ్యాధి నెఱింగి తగ్గుటకు నౌషధమిచ్చును, న్యాయవాదియే”*
మేధకుసానబెట్టుచును మేటిగ సల్పుచు వాదనమ్ములన్
బాధితులైనవారికిలవాసిగ న్యాయముచేయునెప్పుడున్