తే.గీ:భరత శర్మ గారి భవ్యమౌ నవధాన మందు ప్రాశ్నికునిగ నుందు రేపు త్వరగ నరుగు నట్టి,పప్పుల్,ఘృతమ్ము న మితము గాని తిండి మేలుఁ గూర్చు” (భరతశర్మ గారి అవధానానికి ఎనిమిది న్నర కే రావాలని దత్తాత్రేయ శర్మ గారు చెప్పారు కనుక పెందలాడే నిద్ర లేవాలి కాబట్టి ఈ రాత్రి తేలికైన ఆహారం తీసుకుంటే మంచిది. )
చం:మితమును వీడి వాగుటయు, మించుచు సభ్యత పెద్ద వారి పై మితమును వీడు మేలమును, మిక్కిలి గొప్పలు చెప్పుకొంటయున్, మితమది లేని నిద్రయును, మిక్కిలి నిస్పృహ తోడ గ్రుంగుటల్ మితము నతిక్రమించి తిన మేలగు నెప్పుడు మానవాళికిన్?
ఆటవెలది
రిప్లయితొలగించండితిండి తీర్థములును తీరైన నిద్రలున్
శ్రమను గలుగు బ్రతుకు శమనమొందు
నతి మరణమనంగ నాహారమందు న
మితము గాని తిండి మేలుఁ గూర్చు
చంపకమాల
తొలగించండిసతతము గాచగా వలయు సార్వజనీక ప్రయోజనమ్ములన్
హితమునొనర్పగా వలయు నేలికలెప్పుడు వేతనమ్ముతో
బ్రతికిన సద్యశమ్మమరు స్వార్థపరత్వము నాశయమ్ముగన్
మితము నతిక్రమించి తిన మేలగు నెప్పుడు మానవాళికిన్?
క్షుత్తు కలిగె ననుచు గొంచెముగానె , య
రిప్లయితొలగించండిమితము గాని తిండి మేలుఁ గూర్చు
ననుచు దనకు దాను హద్దు నేర్చుకొనగ
చిన్న రోగ మైన జేర దెపుడు
అతియగు వర్జనీయమని యందురభిజ్ఞులు నిక్కువమ్ము సం
రిప్లయితొలగించండితతమమితమ్ముగా దినిన తప్పవు తిప్పలు దేహధారికిన్
పతనముగాదె స్వాస్థ్యఁపు వ్యవస్థ నియంత్రణలేక నెవ్విధిన్
మితము నతిక్రమించి తిన మేలగు నెప్పుడు మానవాళికిన్?
రిప్లయితొలగించండిఇష్ట మైన వంట లిల్లాలు చేసిన
హద్దు మీరు తినగ వద్దు సుమ్మి
జిహ్వ రిచికి కాక జీర్ణ శక్తి కెపుడ
మితము గాని తిండి మేలుఁ గూర్చు.
సతి గృహమందు జేసెనని షడ్రుచు లంచును హద్దు మీరుచున్
గతికిన కీడు దప్పదు సుఖమ్ము హరించును రోగ కారకం
బతిగను సాత్వి కమ్మయిన యభ్యవ హారమె మేలు గాంచగన్
మితము నతిక్రమించి తిన మేలగు నెప్పుడు? మానవాళికిన్.
దొరకు వాటి నన్ని దరిగొని సేవించి
రిప్లయితొలగించండియొడలు పెంచి వ్యాధి బడయ గాను
హితము నెరిగి కొనుచు నిప్పుడు జెప్పు, న
మితము గాని తిండి మేలు గూర్చు!
పతనమగును గాదె స్వాస్థ్యము మనుజులు
రిప్లయితొలగించండిమితము మీరి తినిన, హితము గోరి
చేయు విన్నపమిదె క్షేమముఁగూర్చున
మితము గాని తిండి మేలుఁ గూర్చు
తే.గీ:భరత శర్మ గారి భవ్యమౌ నవధాన
రిప్లయితొలగించండిమందు ప్రాశ్నికునిగ నుందు రేపు
త్వరగ నరుగు నట్టి,పప్పుల్,ఘృతమ్ము న
మితము గాని తిండి మేలుఁ గూర్చు”
(భరతశర్మ గారి అవధానానికి ఎనిమిది న్నర కే రావాలని దత్తాత్రేయ శర్మ గారు చెప్పారు కనుక పెందలాడే నిద్ర లేవాలి కాబట్టి ఈ రాత్రి తేలికైన ఆహారం తీసుకుంటే మంచిది. )
చం:మితమును వీడి వాగుటయు, మించుచు సభ్యత పెద్ద వారి పై
రిప్లయితొలగించండిమితమును వీడు మేలమును, మిక్కిలి గొప్పలు చెప్పుకొంటయున్,
మితమది లేని నిద్రయును, మిక్కిలి నిస్పృహ తోడ గ్రుంగుటల్
మితము నతిక్రమించి తిన మేలగు నెప్పుడు మానవాళికిన్?
ఆ॥ జనులు నోగిరమున సమతుల్యముఁ గనుచు
రిప్లయితొలగించండిసతతము హితము నిడి సౌఖ్యమొసఁగు
పగిది తనరునటుల వరలుచుఁ దినఁగ న
మితము గాని తిండి మేలుఁ గూర్చు
చం॥ అతులిత శాస్త్ర విద్యలను యాతన నెంచక శ్రద్ధ వీడకన్
జతురత నొంద విజ్ఞుఁడుగఁ జాలని తల్చక సాధనా ధృతిన్
బ్రతిదినమట్లు జీర్ణమగు పద్ధతిఁ గాంచుచు జ్ఞాన భోక్తలై
మితము నతిక్రమించి తిన మేలగు నెప్పుడు మానవాళికిన్
వలసి నంత తినుట బాగు బాగని యెంచి
రిప్లయితొలగించండిమసల వలయు జనులు మహిని యెపుడు
తప్పు రోగ బాధ తక్కువ తోడ న
మితము గాని తిండి మేలు గూర్చు
వెతలకు చేరువై తనువు
రిప్లయితొలగించండిభీకర రుగ్మతల న్వరించునే
మితము నతిక్రమించి తిన;
మేలగు నెప్పుడు మానవాళికిన్
మితముగ భోజనమ్ము గొన
మిక్కిలి యూరట నిచ్చు దేహమున్
హితమది యెల్లవేళలను
నేర్పడ నాయువు పెంచు సౌఖ్యమున్!
సతత మజీర్ణ గ్యాసులచె సంకట
రిప్లయితొలగించండిముద్భవమొందు దప్పకన్
మితము నతిక్రమంచి తిన , మేలగు
నెప్పుడు మానవాళికిన్
ప్రతి దినమందు వేళకును భవ్య
పదార్థ లెన్నియుండినన్
మితముగ నారగించినను మిక్కిలి
చక్కగ నుండు స్వాస్థ్యమున్
మితముగా వచింప మేలొనఁగూర్చును
రిప్లయితొలగించండిమితపు వ్యయ మొసంగు మేలు సతికి
జీర్ణమై త్వరితము చేవ నొసంగి య
మితము గాని తిండి మేలుఁ గూర్చు
జిత నిజ దుర్దమేంద్రియుఁడు చెన్ను వహించు నిరంతరమ్మునున్
మిత మన నేర వెన్నటికి మించి జనించుచు నుండుఁ గోర్కెలే
సతతము కామితమ్ములు భృశమ్ములు జిహ్వకుఁ గాంచ మెన్నఁడున్
మితము నతిక్రమించి తిన మే లగు నెప్పుడు మానవాళికిన్
మితము మాటలందు మితభాషి కలవాటు
రిప్లయితొలగించండిమితము మీఱు తిండి హితము కాదు
సతము భోజనమ్ము సంతృప్తి నీయ న
మితము గాని తిండి మేలుఁ గూర్చు
మితమునతిక్రమించి తిన మిక్కిలి మేలు కలుంగు చిత్రమే!
సతతము పండుపంటలను చప్పున నాశమొనర్చి రైతునే
పతనము చేయుకుందువులఁ బంటపొలంబుల లోని పాములే
మితము నతిక్రమించి తిన మేలగు నెప్పుడు మానవాళికిన్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
ఇష్టమైన వనుచు నెక్కువ తినకుము
హద్దుమీరి తినగ హాని జరుగు
పుష్టి కలుగజేయు పోషకాహార మ
మితము గాని తిండి మేలు గూర్చు.