6, జనవరి 2026, మంగళవారం

సమస్య - 5343

7-1-2026 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఖరమును సేవించి కనుఁడు గైవల్యంబున్”
(లేదా...)
“ఖరపాదద్వయకంజసేవనమునన్ గైవల్యమందం దగున్”
(బ్రహ్మశ్రీ వద్దిపర్తి వారి దుబాయి శతావధాన సమస్య)

19 కామెంట్‌లు:

  1. జయజయ శంకర హరహర శంకర:

    కరుణాసింధువు రాగవర్జితుడు
    నిష్కామాంత రంగంబునన్
    దురితంబుల్ హరియించువాడు భవ మున్  దుఃఖంబులన్ దీర్చగన్
    వరకంచిన్ మణిమంటపంబునను
    విభ్రాజిల్లు శ్రీ చంద్ర శే
    ఖర పాదద్వయకంజ సేవనమునన్ గైవల్యమందం దగున్!

    రిప్లయితొలగించండి
  2. వరమాశించిన భక్తులు
    పరమేశుని గొల్తురుగద వరదుండనుచున్
    నరజన్మమెత్తి విధుశే
    ఖరమును సేవించి కనుఁడు గైవల్యంబున్

    వరమాశించిన వారు కొల్తురుగదా భస్మాంగునిన్ నిత్యమున్
    బరమేశుండు దయాళువంద్రు కనుకన్ భక్తాళి పూజింతురే
    నరుడైనన్ నరభోజనుండయిన నానారీతులన్ జంద్రశే
    ఖరపాదద్వయకంజసేవనమునన్ గైవల్యమందం దగున్

    రిప్లయితొలగించండి
  3. హరహరయని శ్రీశైల శి
    ఖరమును సేవించి కనుఁడు గైవల్యంబున్
    పరిభాషించుట వినవే
    జరఠులు నుడివిన విధముగ జరుపుట మేలౌ

    రిప్లయితొలగించండి

  4. హరుడే స్థిరమై నిలిచిన
    పురమది శ్రీ శైలము జని ముదమున నట మం
    దిర గోపురమ్మున గల శి
    ఖరమును సేవించి కనుఁడు గైవల్యంబున్.


    స్థిరముల్ కావవి భోగభాగ్యములు, నీ జీవమ్ములన్ గాంచగా
    ధరణిన్ నిల్వగ బోవు నిత్యమయి సత్యంబియ్యదే గాదుటే
    పరినిర్వృత్తియె శాశ్వతమ్మనెడి విశ్వాసమ్ముతో చంద్రశే
    ఖరపాదద్వయకంజసేవనమునన్ గైవల్యమందం దగున్.

    రిప్లయితొలగించండి
  5. నిరుపమ కరుణా సాంద్రుడు
    వర వీచీ విభవమిచ్చు పశ్వత్పాలున్
    శిరమున నిడు శ్రీశైల శి
    ఖరమును సేవించి కనుడు కైవల్యంబున్!

    రిప్లయితొలగించండి
  6. కం:హరియించు బాపముల శం
    కరుడే బోళా యతండు కమనీయమ్మై
    వరలెడు నా శ్రీశైల
    ఖరమును సేవించి కనుఁడు గైవల్యంబున్

    రిప్లయితొలగించండి
  7. మ:పర మౌ సత్య మెరుంగ గ్లిష్ట మగు నద్వైతమ్ము జే బూని శం
    కరు తత్త్వమ్ము గ్రహింప నెంచి తివి గా! కాంక్షింప నద్దానికిన్
    హర దాక్షిణ్యమె తోడగున్, వినుము శిష్యా భక్తి మై చంద్రశే
    ఖరపాదద్వయకంజసేవనమునన్ గైవల్యమందం దగున్”

    (శంకరు తత్త్వము అంటే శంకరాచార్యుల అద్వైతము. దాన్ని పట్టుకున్నావు కదా! అది అర్థం కావాలన్నా భగవత్కృప ఉండాలి శిష్యా! కనుక దానికి చంద్రశేఖరుని పాదాలు పట్టుకో అని గురువు శిష్యుని తో అన్నట్టు.సాధకుడు కేవలం తన ప్రజ్ఞతో జ్ఞానం పొంద లేడు.భగవత్కృప కావాలి అనేది అనేక మంది గురువులు చెప్పిన విషయం.)

    రిప్లయితొలగించండి
  8. కం॥ నెరనమ్మి యచ్యుతుఁడనుచు
    పరిగ్రహించడె కొలచిన భక్తినిఁ గనుచున్
    హరి యంతటకలఁడని కని
    ఖరమును సేవించి కనుఁడు గైవల్యంబున్

    మ॥ హరి యెందెందునఁ గాంచ దర్శనము సౌహార్దమ్ముతో నందునన్
    విరియన్ భక్తి యొసంగుటే నిజమనన్ విశ్వాత్ము సద్వర్తనన్
    స్థిర చిత్తమ్మున మ్రొక్కి తాననుచుఁ గీర్తించంగఁ దుష్టుండగున్
    ఖరపాదద్వయకంజసేవనమునన్ గైవల్యమందం దగున్

    రిప్లయితొలగించండి
  9. మ:సరసత్వమ్మున చిన్న జీయ రిటులన్ సాగించె సంభాషణన్
    ఖరమున్ మ్రొక్కగ లేదె కృష్ణ పితయే కష్టమ్ములన్ దాట గా
    వర మేదో యిడ ముఖ్యమంత్రి యగుటన్ బ్రార్థించుచున్ చంద్రశే
    ఖరపాదద్వయకంజసేవనమునన్ గైవల్యమందం దగున్”
    (జీయర్ స్వామి వారు సరసం గా మాట్లాడుతూ ఇలా అన్నట్టు.)

    రిప్లయితొలగించండి
  10. స్థిరమగు చిత్తముతో శం
    కరు చరణమ్ములను భక్తి గదురగ గొలువన్
    కరుణించి గాచు శశిశే
    ఖరమును సేవించి కనుఁడు గైవల్యంబున్

    రిప్లయితొలగించండి
  11. రిప్లయిలు
    1. అరుణా చలమున వెలసియు
      తిరమగు భక్తిగ గొలువగ దీ వెన లొసగే
      పరమేశుని దైన గిరి శి
      ఖరమును సేవించి కనుడు కైవల్య o బున్

      తొలగించండి
  12. కరముల్మోడిచి దేవదేవుని హరున్ కారుణ్యధామున్పరా
    త్పరునిన్ బ్రోవఁగవేడు భక్తతతికిన్ ప్రాప్తించు సౌభాగ్యముల్
    తరుణోపాయముఁజూపు నైహికములన్ దట్టించ, శ్రీచంద్రశే
    ఖరపాదద్వయకంజసేవనమునన్ గైవల్యమందం దగున్

    రిప్లయితొలగించండి

  13. కం. వరమానస తీరమునను
    అరుణోదయ సూర్యకాంతి నలరుహిమాద్రిన్
    హరుడిరవగు కైలాస శి
    ఖరమును సేవించి కనుఁడు గైవల్యంబున్

    రిప్లయితొలగించండి
  14. కరిచర్మాంబరధరునకు
    కరమెత్తిమ్రొక్కిమదినికావుమటంచున్
    గిరిజేశునివేడి గిరిశి
    *“ఖరమును సేవించి కనుఁడు గైవల్యంబున్”*


    కరుణాశీలివటంచు మ్రొక్కుచు మమున్ కావంగ రమ్మంచుసు
    స్థిరచిత్తంబున ప్రార్థనల్ సలుపుచున్ శీఘ్రమ్ముగాచూపగా
    నరుదెంచన్ మదినెంచు ఫాలనయనున్ నాత్ర్యక్షుడౌ చంద్రశే
    *"ఖరపాదద్వయకంజసేవనమునన్ గైవల్యమందం దగున్”*



    రిప్లయితొలగించండి
  15. హరి వచన మాలకింపుడు
    గిరి రిపు సేవన మదేల కృతమతు లారా
    ధర గోవర్ధన పుణ్య శి
    ఖరమును సేవించి కనుఁడు కైవల్యంబున్


    ధరణీ భృద్ధర పద్మనాభ కరుణోదన్వద్భృశాపన్న స
    చ్ఛరణార్థివ్రజ దీన సంచయ సమంచద్భక్త కోటీ నిరం
    తర రక్షా పర సర్వ జీవ నిచయాంతర్యామి గీర్వాణ శే
    ఖరపాదద్వయ కంజ సేవనమునం గైవల్య మందం దగున్

    రిప్లయితొలగించండి
  16. నరుడా! మానవ జన్మమందు గడు
    పుణ్యంబార్జనంజేయుమా!
    దురహంకారము మాని సజ్జనుడవై
    దుష్కార్యముల్ వీడియున్
    పరమానందముతో నిరంతరమునున్
    భక్తిన్గొల్చియున్ చంద్ర శే
    ఖరపాదద్వయ కంజ సేవనమునన్
    కైవల్య మందదగున్.

    రిప్లయితొలగించండి
  17. కందం
    హరుని దరిసించు మునుపే
    మురిపెమ్మనగ నవధాన్యముల రోటన్ ద్రి
    ప్పి రహినిఁ గని శ్రీశైల శి
    ఖరమును, సేవించి కనుఁడు గైవల్యంబున్

    మత్తేభవిక్రీడితము
    దరిసింపంగను మల్లికార్జునుని నిద్రాహారముల్ మానియున్
    గిరి రోటన్ నవధాన్యముల్ పఱచి సాక్షీభూతమంచెంచుచున్
    మరుజన్మన్భయ మేదిలేక శిఖరమ్మానంగ శ్రీచంద్రశే
    ఖరపాదద్వయకంజసేవనమునన్ గైవల్యమందం దగున్

    రిప్లయితొలగించండి

  18. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    నిరతము వినిపించు నచట
    సిరి శైలమునందు హరుని చేయగ స్మరణన్
    శరణమ్మని యాలయపు శి
    ఖరమును సేవించి కనుడు గైవల్యంబున్

    రిప్లయితొలగించండి