11, జనవరి 2026, ఆదివారం

సమస్య - 5348

12-1-2026 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“బాధింపదు చలి విభుఁడు ప్రవాసంబుండన్”
(లేదా...)
“చలి బాధింపదు వల్లభుండు పరదేశంబేగి రాకుండినన్”

5 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. కందం
      సాధింపనెంచి పతి, నా
      రాధించెడు సతి పనుపగ ప్రజ్ఞతఁగలుగన్
      రోధనలుండక యెందున
      బాధింపదు చలి విభుఁడు ప్రవాసంబుండన్


      మత్తేభవిక్రీడితము
      తలపుల్ బాధ్యతలందునన్ బరఁగ తానుగ పత్నియె భర్తనంపుచున్
      కొలువందున్ దగ నంకితంబునగుచున్ గూడంగ విత్తమ్మునున్
      రోధనలేవియు లేక మానసమునన్ ప్రోత్సాహ మందింపఁగన్
      జలి బాధింపదు వల్లభుండు పరదేశంబేగి రాకుండినన్

      తొలగించండి
  2. సాధిగ నుండ దగదుగద ,
    వీధిచివర భోగి మంట వేసిన వేళన్
    దీధితి మంతుని వేడిమి ,
    బాధింపదు చలి విభుఁడు ప్రవాసంబుండన్

    రిప్లయితొలగించండి
  3. సాధనమును గోరుచు నా
    మాధవుడను నిల్పి తనదు మదిలో సతమా
    రాధించెడి మహిళల కిల
    బాధింపదు చలి విభుఁడు ప్రవాసంబుండన్.


    ఖలు లాశించెడి బుద్భుదమ్ములగు సౌఖ్యాలేల భూస్పృక్కు కున్
    విలువైనట్టి నివృత్తిచాలనుచు సర్వేశుండె సర్వంబు గా
    నిల పూజించు గుణాత్మురాలయిన నాయిల్లాలికిన్ గాంచగా
    చలి బాధింపదు వల్లభుండు పరదేశంబేగి రాకుండినన్.

    రిప్లయితొలగించండి
  4. మేధస్సుకు సరితూగే
    ప్రాధాన్యత నొందనెంచి పతితానరుగన్
    సాధనతో సాధ్యంబగు
    బాధింపదు చలి విభుఁడు ప్రవాసంబుండన్

    పలు జీవాణువులున్నవన్నమిషతో వండించు నాతండు బ
    చ్చలి కూరాకులనే నిరంతరముగా చాంచల్యరాహిత్యమున్
    జెలి సౌముఖ్యము చూపకున్నఁ విధిగా సేవింపగాజేయు బ
    చ్చలి బాధింపదు వల్లభుండు పరదేశంబేగి రాకుండినన్

    రిప్లయితొలగించండి