2-1-2026 (శుక్రవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“మారుతి చక్రాయుధమున మారునిఁ జంపెన్”(లేదా...)“మారుతి చక్రఘాతమున మారునిఁ జంపెను రాజ్యకాంక్షతో”(బ్రహ్మశ్రీ వద్దిపర్తి వారి దుబాయి శతావధాన సమస్య)
కందంకారాకిళ్లీ నములుచునోరంటన్ జొంగ కార నుడివె ఘనుడిటుల్భారత భాగవతాలన్మారుతి చక్రాయుధమున మారునిఁ జంపెన్ఉత్పలమాలనీరజలోచనున్ దలచి నిష్ఠగ పాశురమాలపించెడున్తీరగు మాసమంచుఁ గొని తెచ్చితివే ప్రవచింప హీనునిన్లేరెవరన్నటుల్ మురిసి, లెక్కలుదండగ! వాడి కూతలన్, "మారుతి చక్రఘాతమున మారునిఁ జంపెను రాజ్యకాంక్షతో!"
ఉ.ధీర కపీశుడెవ్వ, డరి తేకువ కేశవుడేల త్రెంచె, వి ప్పారి హరేక్షణంబెవని యాయువు తీసె, భవాని దైత్యుతో పోరుచు నేమి చేసె, చెడి పోరు సుయోధనుడేల యొప్పెడిన్మారుతి, చక్రఘాతమున, మారుని, జంపెను, రాజ్యకాంక్షతో !
భారత భాగవతంబుల సారమెరుగు వానిబిల్చి జవదాటుమనన్వేరుగ చెప్పచు నిట్లనె"మారుతి చక్రాయుధమున మారునిఁ జంపెన్”
నీరధెవడుదాటె దురా చారుడు శిశుపాలు జక్రి చంపెనెటుల్ మ ల్లారి యజునేమి చేసెనొ మారుతి, చక్రాయుధమున, మారునిఁ జంపెన్.కోరిరటంచు ప్రేక్షకుల కోరిక దీర్చదలంచు వాడె యై వారికి జ్ఞానశూన్యుడుగు పామరు డొక్కడు దొంగ స్వామియేసూరుడ నంచు చెప్పుకుని చోద్యము గావచి యించె నిట్టులన్ మారుతి చక్రఘాతమున మారునిఁ జంపెను రాజ్యకాంక్షతో.
కందం
రిప్లయితొలగించండికారాకిళ్లీ నములుచు
నోరంటన్ జొంగ కార నుడివె ఘనుడిటుల్
భారత భాగవతాలన్
మారుతి చక్రాయుధమున మారునిఁ జంపెన్
ఉత్పలమాల
నీరజలోచనున్ దలచి నిష్ఠగ పాశురమాలపించెడున్
తీరగు మాసమంచుఁ గొని తెచ్చితివే ప్రవచింప హీనునిన్
లేరెవరన్నటుల్ మురిసి, లెక్కలుదండగ! వాడి కూతలన్,
"మారుతి చక్రఘాతమున మారునిఁ జంపెను రాజ్యకాంక్షతో!"
ఉ.
రిప్లయితొలగించండిధీర కపీశుడెవ్వ, డరి తేకువ కేశవుడేల త్రెంచె, వి
ప్పారి హరేక్షణంబెవని యాయువు తీసె, భవాని దైత్యుతో
పోరుచు నేమి చేసె, చెడి పోరు సుయోధనుడేల యొప్పెడిన్
మారుతి, చక్రఘాతమున, మారుని, జంపెను, రాజ్యకాంక్షతో !
భారత భాగవతంబుల
రిప్లయితొలగించండిసారమెరుగు వానిబిల్చి జవదాటుమనన్
వేరుగ చెప్పచు నిట్లనె
"మారుతి చక్రాయుధమున మారునిఁ జంపెన్”
రిప్లయితొలగించండినీరధెవడుదాటె దురా
చారుడు శిశుపాలు జక్రి చంపెనెటుల్ మ
ల్లారి యజునేమి చేసెనొ
మారుతి, చక్రాయుధమున, మారునిఁ జంపెన్.
కోరిరటంచు ప్రేక్షకుల కోరిక దీర్చదలంచు వాడె యై
వారికి జ్ఞానశూన్యుడుగు పామరు డొక్కడు దొంగ స్వామియే
సూరుడ నంచు చెప్పుకుని చోద్యము గావచి యించె నిట్టులన్
మారుతి చక్రఘాతమున మారునిఁ జంపెను రాజ్యకాంక్షతో.