తే.గీ: నీరు పల్ల మెరుంగును,నిజమె కాని మెదడికిన్ జేరె నీ కల్లు కద!యిదేమి చిత్రమో బావ! దేవుని సృష్టి! కల్లు నీరు పల్లమెఱుంగదు పారు పైకి. (కల్లు తాగితే ఆ నిషా మెదడు కెక్కింది.ఏ నీరు ఐనా పల్లానికి పోతుంది కానీ కల్లు నీళ్లు పైకి పోతాయి. దేవుడి సృష్టి ఎంత చిత్రం బావా? అని తాగు బోతు ఒక సృష్టి సత్యాన్ని చెప్పాడు.)
ఉ:చల్లదనమ్ము లేక యొక శాపము వోలె ధరించ నుష్ణమున్ జల్లని నేల తల్లి, యనిశమ్మును బోరుల వేసి నీరమున్ కొల్లగ గుంజగన్ జలము కొంతయు రక్షణ లేక యుండినన్ పల్లమునుండి యెత్తునకు పారు జలంబులు సర్వకాలమున్” (బోర్లు వేసినప్పుడు నీరు పల్లం నుంచి పైకి వస్తుంది కదా!)
సమస్య : నీరు పల్లమెఱుంగదు పారు పైకి
రిప్లయితొలగించండితే. "నీరు పల్లమెఱుంగదు పారు పైకి"
యనుచు నపర భగీరథు డైన రీతి
ఎత్తిపోతల పథకాల నెలమి గూర్చి
అంద జేసెను నీరు దాహార్తులకును
తేటగీతి
రిప్లయితొలగించండిమెట్టభూములనుచు మదిఁ దిట్టుకొనఁగ
నెత్తిపోతలనెంచియు సత్తెమనఁగ
మేటి ప్రభుత వడిగ గట్టి మేలుఁగూర్చ
నీరు పల్లమెఱుంగదు పారు పైకి
ఉత్పలమాల
తొలగించండిఎల్లలు దాటగన్ యశము, నెన్నడుచూడక సాగునీటినిన్
దల్లడమొందు మెట్టలకు, ధన్యమనంగను నెత్తపోతలన్
గొల్లలుగన్ ప్రభుత్వమటఁ గూర్చఁగ రైతులపాలి బుగ్గగన్
బల్లమునుండి యెత్తునకు పారు జలంబులు సర్వకాలమున్
ఝల్లను మేను జూడగ ప్ర
రిప్లయితొలగించండిశంసల జేయగ నోపు చిత్రమై
యుల్లము దోచు నాసరణి
యోజన మందున పూల వాటికన్
ౙల్లని ౙల్లు లందమరి
ౘక్కగ నత్తఱి నాట్యమాడగన్
పల్లమునుండి యెత్తునకు
పారు జలంబులు సర్వకాలమున్!
మనుజుడు కృత్రిమ తెలివిని మానకున్న
రిప్లయితొలగించండిపంచజనుడు సలుపు చుండు వగకనువుగ
పంచభూతముల విధము బదలుచుండు
నీరు పల్లమెఱుంగదు పారు పైకి
రిప్లయితొలగించండిమేడ పైభాగ మందుండు మీకు జలము
నంపు మార్గము జెప్పెద నాల కింపు
యంత్ర ములభిగి యించిన నంత నికను
నీరు పల్లమెఱుంగదు పారు పైకి.
తల్లికి నాత్మసంభవయె ధైర్యము కోసము నిట్లు చెప్పెనే
యెల్లెడ కైననేమి యిక హేమము పంపగ వచ్చు నీటికై
యల్లట మేలనమ్మ జల యంత్రము లన్ భిగియించి నంతనే
పల్లమునుండి యెత్తునకు పారు జలంబులు సర్వకాలమున్.
మారిపోయె రోజులనెడి మాట పల్కు
రిప్లయితొలగించండినేతల తలపోతల లోని నిబ్బరమున
క్రొత్త యంత్రాల శక్తితో నెత్తిపోయ
నీరు పల్లమెఱుంగదు పారు పైకి
చెల్లెను పాతరోజులని చెప్పిన నేతల శక్తి యుక్తులే
వెల్లువలై ప్రణాళికలు వేగమె సిద్ధము సేసినంతటన్
గల్లలు కాని మాటలివి కర్కశ యంత్రము లెత్తిపోయగా
పల్లమునుండి యెత్తునకు పారు జలంబులు సర్వకాలమున్
తే.గీ: నీరు పల్ల మెరుంగును,నిజమె కాని
రిప్లయితొలగించండిమెదడికిన్ జేరె నీ కల్లు కద!యిదేమి
చిత్రమో బావ! దేవుని సృష్టి! కల్లు
నీరు పల్లమెఱుంగదు పారు పైకి.
(కల్లు తాగితే ఆ నిషా మెదడు కెక్కింది.ఏ నీరు ఐనా పల్లానికి పోతుంది కానీ కల్లు నీళ్లు పైకి పోతాయి. దేవుడి సృష్టి ఎంత చిత్రం బావా? అని తాగు బోతు ఒక సృష్టి సత్యాన్ని చెప్పాడు.)
తే॥ శాస్త్ర శోధనా ఫలితము సర్వహితముఁ
రిప్లయితొలగించండిబడయఁ గర్షకుల ముదము పరఁగ నీటి
లభ్యతఁ గని యంత్రములు జలములఁ దోఁడ
నీరు పల్లమెఱుంగదు పారు పైకి
ఉ॥ కల్లయ శాస్త్ర విజ్ఞతయుఁ గర్షకు లెల్లరు మోదమందఁగన్
జల్లగ నీటి లభ్యతను సాధ్యము చేసెడి క్రొత్త సూత్రముల్
దెల్లముఁ జేయ నమర్చఁగ దీటుగ యంత్రములట్లు సాధ్యమై
పల్లము నుండి యెత్తునకు పారు జలంబులు, సర్వకాలమున్
శాస్త్ర విజ్ఞాన ప్రగతితో సాధ్యపడని
రిప్లయితొలగించండికార్యమేదియు కనరాదు గాన నేడు
తివిరి యిసుమున తైలంబు దీయనగును
నీరు పల్లమెఱుంగదు పారు పైకి
ఉ:చల్లదనమ్ము లేక యొక శాపము వోలె ధరించ నుష్ణమున్
రిప్లయితొలగించండిజల్లని నేల తల్లి, యనిశమ్మును బోరుల వేసి నీరమున్
కొల్లగ గుంజగన్ జలము కొంతయు రక్షణ లేక యుండినన్
పల్లమునుండి యెత్తునకు పారు జలంబులు సర్వకాలమున్”
(బోర్లు వేసినప్పుడు నీరు పల్లం నుంచి పైకి వస్తుంది కదా!)
దైవ కృప సన్నగిల్ల స్వభావ మణఁగు
రిప్లయితొలగించండినమ్ముకున్న తనదు శక్తి నాశన మగు
నోడ లరయంగ బండ్లగు నుర్విఁ బాఱ
నీరు పల్ల మెఱుంగదు నేరు మిట్ట
[పాఱు సాధువు. ర,ఱ ల ప్రాస యతి నిషేధము కనుక సమస్య ననుగుణముగా మార్చిచేసిన పూరణము]
చల్లగ నున్న మానసము సాగును సుస్థిర మైన రీతి భా
సిల్లును భావజాలములఁ జెన్నుగఁ గంప మెఱుంగ కెవ్విధిం
బెల్లుగ వాయు వైనఁ గడు వేఁడి గ్రహింప ననూహ్య రీతినిం
బల్లము నుండి యెత్తునకుఁ బాఱు జలంబులు సర్వ కాలమున్
మార్పు వచ్చెను శాస్త్రాన మంచి కొఱకు
రిప్లయితొలగించండిక్రొత్త పథకాలు సృష్టింప కోరి నట్లు
నీరు పల్ల మెరుంగదు పారు పైకి
యనుచు మురిసిరి జనులెల్ల హర్ష మొదవ