9, జనవరి 2026, శుక్రవారం

సమస్య - 5346

10-1-2026 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గిరివిధ్వంసకుని జనులు గీర్తింత్రు సదా”
(లేదా...)
“గిరివిధ్వంసకుఁడైన శ్రీపతిని సంకీర్తింత్రు లోకుల్ సదా”

13 కామెంట్‌లు:

  1. మ.
    ఉరు దుగ్ధార్ణవ శేష తల్పముపయిన్ హొంబట్టు వస్త్రంబుతో
    గరిమన్ సొమ్ముల తల్లితో నెలమి నాకర్షింగా కూడి స
    త్తరళాంభోరుహ నేత్రముల్ కలుగు దైత్యస్తోమ ఘోరాహ రా
    డ్గిరి విధ్వంసకుడైన శ్రీపతిని సంకీర్తింత్రు లోకుల్ సదా !

    రిప్లయితొలగించండి
  2. కందం
    హరివగు దశావతారము
    లరులను నిర్జింప వెలసె నార్తులఁ బ్రోవన్
    దురితులతో శిష్టులు వే
    గిరి, విధ్వంసకుని జనులు గీర్తింత్రు సదా!

    మత్తేభవిక్రీడితము
    హరి తానెత్తి దశావతారములతో నంతంబొనర్చెన్ నిశా
    చరులన్ సజ్జన ప్రార్థనల్ వినియు, నిష్టారాజ్యమై రేగుచున్
    దురితుల్ హింసల శిష్టులన్ నలుపగన్ దుర్మార్గ కృత్యాల వే
    గిరి, విధ్వంసకుఁడైన శ్రీపతిని సంకీర్తింత్రు లోకుల్ సదా!

    రిప్లయితొలగించండి

  3. *(గిరి అనే వానికి స్నేహితుడు చెప్పె మాటలు)*

    ధరణిన్ ధర్మము నిలుపగ
    పురుషాదుండ్రను క్రమింప బుట్టుచు తా వెం
    బరులనె ధ్వంస మొనర్చె
    గిరి, విధ్వంసకుని జనులు గీర్తింత్రు సదా.


    ధరణిన్ ధర్మము నిల్ప నెంచి హరియే ధర్మమ్ము నే ద్రుంచెడిన్
    పురుషాదుండ్ర క్రమింప నెంచికదరా భూమమ్ములో బుట్టె వెం
    బరు లాధర్మ విఘాతకుండ్రనిక ప్రధ్వంసమ్మునే చేయ హే
    గిరి, విధ్వంసకుఁడైన శ్రీపతిని సంకీర్తింత్రు లోకుల్ సదా.

    రిప్లయితొలగించండి
  4. అరయగ నేదైన పరవ
    శరధిని చేరుకొనుచుండు సరణిని కనగన్
    నెరవుగ నిరోధననిడెడు
    గిరివిధ్వంసకుని జనులు గీర్తింత్రు సదా”

    రిప్లయితొలగించండి
  5. సిరికింజెప్పక నరిగెన్
    గరినే రక్షింపబూని కరుణామయుడై
    పొరిగొన రాక్షసులే క్రుం
    గిరి విధ్వంసకుని జనులు గీర్తింత్రు సదా

    సిరికింజెప్పక పోయి సింధువును రక్షించెన్గదా విష్ణువే
    నరులన్ బల్లటపెట్టు రాక్షసులనే నాశంబొనర్చెన్ గదా
    పరమాత్ముండగు పాంచజన్యధరుడే పాలార్చ పెక్కండ్రు ద్రుం
    గిరి విధ్వంసకుఁడైన శ్రీపతిని సంకీర్తింత్రు లోకుల్ సదా

    రిప్లయితొలగించండి
  6. సమస్య : గిరివిధ్వంసకుని జనులు గీర్తింత్రు సదా

    పురజనులనేచనద్రుల
    దురహంకారముఁ స్వరువున ద్రుంచినవాడౌ
    గిరిభిద్ధరి పురుహూతుని
    గిరివిధ్వంసకుని జనులు గీర్తింత్రు సదా

    అద్రులు: పర్వతములు
    స్వరువు : వజ్రాయుధం
    గిరిభిద్ధరి ,పురుహూతుడు : ఇంద్రుడు

    దురహంకారముతో జనసామాన్యమును బాధిస్తున్న పర్వతాల రెక్కలు వజ్రాయుధంతో నరికివేసిన ఇంద్రుని వృత్తాంతము.

    రిప్లయితొలగించండి
  7. పరపతికై పలువిధముల
    వరములు గుప్పించి జనుల బాగెంచకనే
    విరుగబడిన వాడిని ఋషి
    గిరివిధ్వంసకుని జనులు గీర్తింత్రు సదా

    Note : ఋషికొండను పాడు చేసారన్న విపక్షము వారి దృష్టి కోణం ఆవిష్కరించే సరదా ప్రయత్నం. నా వ్యక్తిగత అభిప్రాయము కాదు. Not a political statement.

    రిప్లయితొలగించండి
  8. కరుణాలయుడగు హరి శ్రీ
    కరుడై నిత్యంబు బ్రోచుగద జగమంతన్!
    విరివిని యా పాప తిమిర
    గిరి విధ్వంసకుని జనులు కీర్తింత్రు సదా!

    రిప్లయితొలగించండి
  9. అరివీర భయంకరుఁడగు
    నరుని శరాఘాతములకు నాశమునొందన్
    కురు సైనిక కుధరము నా
    గిరి విధ్వంసకుని జనులు గీర్తింత్రు సదా

    రిప్లయితొలగించండి
  10. కం॥ ధర దైత్యులు గిరి గీయుచుఁ
    గరుణ విడిచి మునుల హింస గనఁగ నధములై
    హరి భువికి దిగి తునిమెనని
    గిరివిధ్వంసకుని జనులు గీర్తింత్రు సదా

    మ॥ ధరణిన్ దైత్యులు గిరిగీసి యతిగా దౌర్జన్య హింసాధృతిన్
    బరఁగన్ మౌనులఁ గష్టపెట్టి విధిగాఁ బాపంబులన్ జేయుచున్
    హరియే రాముఁడు కృష్ణుఁడై దనుజ సంహారమ్ము గావించఁగన్
    గిరివిధ్వంసకుఁడైన శ్రీపతిని సంకీర్తింత్రు లోకుల్ సదా

    గిరి అవధిగ గీయు గీత, నియమము
    (రాక్షసులు యగ్నయాగాదులు జరుపకూడదని గిరిగీసి మునులను కష్టపెట్టగా వారిని చంపి ఆగిరిని హరి ధ్వంసం చేసాడనే అర్థంతో వ్రాసానం

    రిప్లయితొలగించండి