3-5-2026 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పాంచాలిని భీష్ముఁడు గని పక్కున నవ్వెన్”
(లేదా...)
“పావని ద్రోవదిం గనుచు పక్కున నవ్వెను భీష్ముఁ డాసభన్”
(పి.ఎల్. నాగేశ్వర రావు గారికి ధన్యవాదాలతో...)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కందంఅంచితముగ భారతమునుబంచఁగ నేర్చిన విదురులు ప్రవచింపక మీరెంచిన కృత్రిమ మేధన్ఉ"బాంచాలిని భీష్ముఁడు గని పక్కున నవ్వెన్"ఉత్పలమాలజీవన గమ్యమంద ప్రవచింపగ భారతమెంచ కోవిదుల్శ్రావణమెప్పుడున్ దగును చక్కని విజ్ఞతలుల్లసిల్లగన్ద్రోవను దప్పి కృత్రిమపు రోగమునంటిన మేధ దిక్కనన్"బావని ద్రోవదిం గనుచు పక్కున నవ్వెను భీష్ముఁ డా సభన్"
ఎంచగ మూర్ఖుని వోలెను పంచమ వేదమ్ము లోని వాస్తవ మాలో చించక వాగితి వెప్పుడు పాంచాలిని భీష్ముఁడు గని పక్కున నవ్వెన్?నీవొక నిప్పు రవ్వవని నీచులె ఱుంగక దుష్ట బుద్ధితో కావరమెచ్చి యివ్విధి వికారపు చేష్టల చేయనేమి ని న్నా వనమాలి ప్రోచె నని యర్మిలి జూపి సభాంతరమ్ము నన్ బావని ద్రోవదిం గనుచు పక్కున నవ్వెను భీష్ముఁ డాసభన్.
మంచి సతిగ దీవెననిడె పాంచాలిని భీష్ముఁడు గని ; పక్కున నవ్వెన్అంచన నుండిన కుంతియెపంచ పతుల తోడుత నది వసమా యనుచున్
కం॥పాంచాలి వేషమూనినమించగు పేరున్ననటుడు, మీసము తోడన్వేంచేయ నాత్రమున నా"పాంచాలి"ని భీష్ముడుగని ఫక్కుననవ్వెన్!!
అంచితముగ మయసభనేమించిన సంస్థానమనుచు మేలగు విధి నిర్మించిన సభా భవనమునఁబాంచాలిని భీష్ముఁడు గని పక్కున నవ్వెన్ [పాంచాలి = బొమ్మ]సేవిత యైన ద్రోవదిని చెంతకు బిల్చిరి వల్వలూడ్చగాకావరముప్పతిల్లి గద కౌరవు రాయడు సేసె నిట్టులన్బావని ద్రోవదిం గనుచు పక్కున నవ్వెను; భీష్ముఁ డాసభన్జీవము లేని బొమ్మవలె చిత్రముగా వహియించె మౌనమే
ఏవురు పాండునందనులమేయ పరాక్రములయ్యు దీనులైజీవములేని బొమ్మలయి చింతిలుచుండగ దుస్ససేనుఁడేపావని ద్రోవదిం గనుచు పక్కున నవ్వెను, భీష్ముఁ డాసభన్ద్రోవది దైన్యముంగనుచు దుఃఖితుఁడై తలవాల్చె మౌనియై
ఉ॥ ఏవిధి విద్య నేర్వకనె యెవ్వరొ తెల్ప సుయోధనుండటుల్చావును గోరి నవ్వెనొకొ సర్యులు చూడఁగఁ గృష్ణనంచు నాభావన హీనుఁడౌ చెవిటి పాలసుఁ డీవిధి పల్కె నుద్ధతిన్పావని ద్రోవదిం గనుచు పక్కున నవ్వెను భీష్ముఁడా సభన్
కం: "ఎంచ సరియె యీ పణ?" మనుపాంచాలిని భీష్ముఁడు గని పక్కున నవ్వెన్"మంచి చెడుల ధర్మజు తో నెంచు" మనుచు బల్కె ధర్మ మెరిగి కుములుచున్ (ద్రౌపది "న న్నోడి తన్నోడెనా? త న్నోడి నన్నోడెనా? అని సభలో ప్రశ్నిస్తే ఆ ప్రశ్న నీ భర్తనే అడగా లమ్మా " అని భీష్ముడు బాధతో నవ్వాడు.)
ఉ:లే విట రాజ్యధర్మములు,లే దిట పెద్దల పట్ల భక్తియున్,బ్రోవగ నీవె యుంటి వని భోరున గృష్ణుని దల్చ గృష్ణ దా బ్రోవగ బూను లీల గని,క్రుద్ధ సుయోధను,గ్రుడ్డి భూపతిన్,పావని ద్రోవదిం, గనుచు పక్కున నవ్వెను భీష్ముఁ ,డాసభన్”(అన్ని దురాగతాలు జరుగుతుంటే కృష్ణుడు కాపాడ గా ద్రౌపది భక్తిని, కృష్ణ లీలని, దుర్యోధనుని పరాభవాన్ని చూచి భీష్ముడు నవ్వాడు.)
సమస్య : "పాంచాలిని భీష్ముఁడు గని పక్కున నవ్వెన్"పంచుకునె పార్థులెవరిని అంచిత గాంగేయుడెవరు అల రారాజున్గాంచిన సఖియేంజేసెనుపాంచాలిని భీష్ముఁడు గని పక్కున నవ్వెన్
మించిన చలమ్మున సమర సంచారము సేయ సవ్యసాచికిఁ బ్రీతిం బంచనఁ గులుకుచు వికృతపుఁ బాంచాలిని భీష్ముఁడు గని పక్కున నవ్వెన్ [ పాంచాలి = బొమ్మ, శిఖండి ] వావిరి క్రూర చింతనలఁ బార్థులు కొందఱు తన్ను గొల్వఁగా వేవురు ధార్తరాష్ట్రుఁ డవివేకి సుయోధనుఁ డుగ్ర దుష్ట సంభావన రక్తుఁడా దురభిమాని చలమ్మున నెన్న భీష్ముఁడే పావని ద్రోవదిం గనుచుఁ బక్కున నవ్వెను భీష్ముఁ డా సభన్
అంచితయగు పాంచాలినివంచక దుశ్శాసనుండు వలువల నూడ్వన్వేంచేసి బ్రోవ కృష్ణుఁడుపాంచాలిని, భీష్ముఁడు గని పక్కున నవ్వెన్
కాంచిరి నాటక మందున పాంచాలీ వేష ధారి పలుకగ దొ స గుల్ ముంచె ను వీడని న య్యె డ పాంచాలి ని భీష్ముడు గని పక్కున నవ్వె న్
రావలె నీవు దాసివిక రమ్మనియీడ్చుక రాగ కర్ణుడున్పావని ద్రౌపదిన్ గనియు పక్కుననవ్వెను, భీష్ముడాసభన్ఆవనితా శిరోమణికి యావిధిజర్గు పరాభవంబునున్జీవములేనివానివలె చిత్రముగాగనుచుండె నంతయున్.
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.వంచెను తలనా సభలోపాంచాలిని భీష్ముడు గని; పక్కున నవ్వెన్కాంచిన సుయోధనుడు తలదించిన పాండవుల నచట దీనుల పగిదిన్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికందం
తొలగించండిఅంచితముగ భారతమును
బంచఁగ నేర్చిన విదురులు ప్రవచింపక మీ
రెంచిన కృత్రిమ మేధన్ఉ
"బాంచాలిని భీష్ముఁడు గని పక్కున నవ్వెన్"
ఉత్పలమాల
జీవన గమ్యమంద ప్రవచింపగ భారతమెంచ కోవిదుల్
శ్రావణమెప్పుడున్ దగును చక్కని విజ్ఞతలుల్లసిల్లగన్
ద్రోవను దప్పి కృత్రిమపు రోగమునంటిన మేధ దిక్కనన్
"బావని ద్రోవదిం గనుచు పక్కున నవ్వెను భీష్ముఁ డా సభన్"
రిప్లయితొలగించండిఎంచగ మూర్ఖుని వోలెను
పంచమ వేదమ్ము లోని వాస్తవ మాలో
చించక వాగితి వెప్పుడు
పాంచాలిని భీష్ముఁడు గని పక్కున నవ్వెన్?
నీవొక నిప్పు రవ్వవని నీచులె ఱుంగక దుష్ట బుద్ధితో
కావరమెచ్చి యివ్విధి వికారపు చేష్టల చేయనేమి ని
న్నా వనమాలి ప్రోచె నని యర్మిలి జూపి సభాంతరమ్ము నన్
బావని ద్రోవదిం గనుచు పక్కున నవ్వెను భీష్ముఁ డాసభన్.
మంచి సతిగ దీవెననిడె
రిప్లయితొలగించండిపాంచాలిని భీష్ముఁడు గని ; పక్కున నవ్వెన్
అంచన నుండిన కుంతియె
పంచ పతుల తోడుత నది వసమా యనుచున్
కం॥
రిప్లయితొలగించండిపాంచాలి వేషమూనిన
మించగు పేరున్ననటుడు, మీసము తోడన్
వేంచేయ నాత్రమున నా
"పాంచాలి"ని భీష్ముడుగని ఫక్కుననవ్వెన్!!
అంచితముగ మయసభనే
రిప్లయితొలగించండిమించిన సంస్థానమనుచు మేలగు విధి ని
ర్మించిన సభా భవనమునఁ
బాంచాలిని భీష్ముఁడు గని పక్కున నవ్వెన్
[పాంచాలి = బొమ్మ]
సేవిత యైన ద్రోవదిని చెంతకు బిల్చిరి వల్వలూడ్చగా
కావరముప్పతిల్లి గద కౌరవు రాయడు సేసె నిట్టులన్
బావని ద్రోవదిం గనుచు పక్కున నవ్వెను; భీష్ముఁ డాసభన్
జీవము లేని బొమ్మవలె చిత్రముగా వహియించె మౌనమే
ఏవురు పాండునందనులమేయ పరాక్రములయ్యు దీనులై
రిప్లయితొలగించండిజీవములేని బొమ్మలయి చింతిలుచుండగ దుస్ససేనుఁడే
పావని ద్రోవదిం గనుచు పక్కున నవ్వెను, భీష్ముఁ డాసభన్
ద్రోవది దైన్యముంగనుచు దుఃఖితుఁడై తలవాల్చె మౌనియై
ఉ॥ ఏవిధి విద్య నేర్వకనె యెవ్వరొ తెల్ప సుయోధనుండటుల్
రిప్లయితొలగించండిచావును గోరి నవ్వెనొకొ సర్యులు చూడఁగఁ గృష్ణనంచు నా
భావన హీనుఁడౌ చెవిటి పాలసుఁ డీవిధి పల్కె నుద్ధతిన్
పావని ద్రోవదిం గనుచు పక్కున నవ్వెను భీష్ముఁడా సభన్
కం: "ఎంచ సరియె యీ పణ?" మను
రిప్లయితొలగించండిపాంచాలిని భీష్ముఁడు గని పక్కున నవ్వెన్
"మంచి చెడుల ధర్మజు తో
నెంచు" మనుచు బల్కె ధర్మ మెరిగి కుములుచున్
(ద్రౌపది "న న్నోడి తన్నోడెనా? త న్నోడి నన్నోడెనా? అని సభలో ప్రశ్నిస్తే ఆ ప్రశ్న నీ భర్తనే అడగా లమ్మా " అని భీష్ముడు బాధతో నవ్వాడు.)
ఉ:లే విట రాజ్యధర్మములు,లే దిట పెద్దల పట్ల భక్తియున్,
రిప్లయితొలగించండిబ్రోవగ నీవె యుంటి వని భోరున గృష్ణుని దల్చ గృష్ణ దా
బ్రోవగ బూను లీల గని,క్రుద్ధ సుయోధను,గ్రుడ్డి భూపతిన్,
పావని ద్రోవదిం, గనుచు పక్కున నవ్వెను భీష్ముఁ ,డాసభన్”
(అన్ని దురాగతాలు జరుగుతుంటే కృష్ణుడు కాపాడ గా ద్రౌపది భక్తిని, కృష్ణ లీలని, దుర్యోధనుని పరాభవాన్ని చూచి భీష్ముడు నవ్వాడు.)
సమస్య : "పాంచాలిని భీష్ముఁడు గని పక్కున నవ్వెన్"
రిప్లయితొలగించండిపంచుకునె పార్థులెవరిని
అంచిత గాంగేయుడెవరు అల రారాజు
న్గాంచిన సఖియేంజేసెను
పాంచాలిని భీష్ముఁడు గని పక్కున నవ్వెన్
మించిన చలమ్మున సమర
రిప్లయితొలగించండిసంచారము సేయ సవ్యసాచికిఁ బ్రీతిం
బంచనఁ గులుకుచు వికృతపుఁ
బాంచాలిని భీష్ముఁడు గని పక్కున నవ్వెన్
[ పాంచాలి = బొమ్మ, శిఖండి ]
వావిరి క్రూర చింతనలఁ బార్థులు కొందఱు తన్ను గొల్వఁగా
వేవురు ధార్తరాష్ట్రుఁ డవివేకి సుయోధనుఁ డుగ్ర దుష్ట సం
భావన రక్తుఁడా దురభిమాని చలమ్మున నెన్న భీష్ముఁడే
పావని ద్రోవదిం గనుచుఁ బక్కున నవ్వెను భీష్ముఁ డా సభన్
అంచితయగు పాంచాలిని
రిప్లయితొలగించండివంచక దుశ్శాసనుండు వలువల నూడ్వన్
వేంచేసి బ్రోవ కృష్ణుఁడు
పాంచాలిని, భీష్ముఁడు గని పక్కున నవ్వెన్
కాంచిరి నాటక మందున
రిప్లయితొలగించండిపాంచాలీ వేష ధారి పలుకగ దొ స గుల్
ముంచె ను వీడని న య్యె డ
పాంచాలి ని భీష్ముడు గని పక్కున నవ్వె న్
రావలె నీవు దాసివిక రమ్మని
రిప్లయితొలగించండియీడ్చుక రాగ కర్ణుడున్
పావని ద్రౌపదిన్ గనియు పక్కున
నవ్వెను, భీష్ముడాసభన్
ఆవనితా శిరోమణికి యావిధి
జర్గు పరాభవంబునున్
జీవములేనివానివలె చిత్రముగా
గనుచుండె నంతయున్.
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
వంచెను తలనా సభలో
పాంచాలిని భీష్ముడు గని; పక్కున నవ్వెన్
కాంచిన సుయోధనుడు తల
దించిన పాండవుల నచట దీనుల పగిదిన్.