13, మే 2026, బుధవారం

సమస్య - 5468

14-5-2026 (గురువారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“లయకారుఁడు సౌఖ్యమొసఁగు లచ్చిమగండే”

(లేదా...)

“లయమున కాదిదైవతము లచ్చిమగం డతఁ డిచ్చు సౌఖ్యముల్”

1 కామెంట్‌:

  1. కందం
    ప్రియసతి లక్ష్మియె హృదయా
    లయమున పోషణకిరువుగ రంజిలనుండన్
    దయగురిసెడు హరి, కాడన
    లయకారుఁడు, సౌఖ్యమొసఁగు లచ్చిమగండే!

    చంపకమాల
    ప్రియసతి లక్ష్మినిన్ హృదయవేదిని నిల్పియు సృష్టి పోషణన్
    దయగల మూర్తియై నిలిచె దైవమనంగ జనార్దనుండహో!
    శ్రియమున సంచరించు హరి చిన్మయరూపుడు సింధుజా హృదా
    లయమున కాదిదైవతము! లచ్చిమగం డతఁ డిచ్చు సౌఖ్యముల్!

    రిప్లయితొలగించండి