17-5-2026 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రక్తపానమున్ జేయంగ రమ్ము సకియ”
(లేదా...)
“రక్తముఁ బీల్చఁ బ్రేయసిని రమ్మని పిల్చెఁ బ్రియుండు ప్రేమతో”
ముంగిటను పాఱుచున్నది మురికి కాల్వమునిసిపాలిటీ మరచెను మురుగుఁ దీయమశకముల కమృతము గాదె మనుజు స్వజమురక్తపానమున్ జేయంగ రమ్ము సకియ
రక్తముఁ బీల్చుటన్న మది రంజిలు దోమకు ముర్కి కాల్వలన్సక్తముగా వసించి తన జాతిని వర్థిలఁజేయు నిచ్చలున్తిక్తము కాదు మానవుని తీయని రక్తము జాగు సేయకన్రక్తముఁ బీల్చఁ బ్రేయసిని రమ్మని పిల్చెఁ బ్రియుండు ప్రేమతో
పసిడి ఆభరణములను పట్టు చీర లెన్నొ తెప్పించి యిచ్చిన నించు కైన తృప్తి లేదయ్యె నీకు నతిఘ మదేలరక్తపానమున్ జేయంగ రమ్ము సకియ.రక్తిని జూపి నీకయి హిరణ్యపు మండము లెన్నొతెస్తి నా శక్తికి మించి గాదె యవి చాల వటంచు నమర్ష మేలనో యుక్తము కాదటంచు నట యుత్స్మయ మందున కన్ను గీటుచున్ రక్తముఁ బీల్చఁ బ్రేయసిని రమ్మని పిల్చెఁ బ్రియుండు ప్రేమతో.
ముంగిటను పాఱుచున్నది మురికి కాల్వ
రిప్లయితొలగించండిమునిసిపాలిటీ మరచెను మురుగుఁ దీయ
మశకముల కమృతము గాదె మనుజు స్వజము
రక్తపానమున్ జేయంగ రమ్ము సకియ
రక్తముఁ బీల్చుటన్న మది రంజిలు దోమకు ముర్కి కాల్వలన్
రిప్లయితొలగించండిసక్తముగా వసించి తన జాతిని వర్థిలఁజేయు నిచ్చలున్
తిక్తము కాదు మానవుని తీయని రక్తము జాగు సేయకన్
రక్తముఁ బీల్చఁ బ్రేయసిని రమ్మని పిల్చెఁ బ్రియుండు ప్రేమతో
రిప్లయితొలగించండిపసిడి ఆభరణములను పట్టు చీర
లెన్నొ తెప్పించి యిచ్చిన నించు కైన
తృప్తి లేదయ్యె నీకు నతిఘ మదేల
రక్తపానమున్ జేయంగ రమ్ము సకియ.
రక్తిని జూపి నీకయి హిరణ్యపు మండము లెన్నొతెస్తి నా
శక్తికి మించి గాదె యవి చాల వటంచు నమర్ష మేలనో
యుక్తము కాదటంచు నట యుత్స్మయ మందున కన్ను గీటుచున్
రక్తముఁ బీల్చఁ బ్రేయసిని రమ్మని పిల్చెఁ బ్రియుండు ప్రేమతో.