20, మే 2026, బుధవారం

సమస్య - 5473

21-5-2026 (గురువారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“భావ మభావమయిన యెడఁ బద్యము వెల్గున్”

(లేదా...)

“భావ మభావమైనపుడె పద్యము హృద్యమటంద్రు పండితుల్”

8 కామెంట్‌లు:

  1. భావము జీవము రచనకు
    భావము స్పష్టపడని యెడఁ బద్యంబగునా
    భావము నిండై ద్వైదీ
    భావ మభావమయిన యెడఁ బద్యము వెల్గున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భావము లేనిపద్యమును వ్రాసిన మెత్తురె పండితోత్తముల్
      భావము జీవమంద్రు గద పద్యములో విశదీకరించినన్
      భావము పూర్ణమైనపుడె పద్యము దీపిలుచుండు నన్యథా
      భావ మభావమైనపుడె పద్యము హృద్యమటంద్రు పండితుల్

      తొలగించండి
  2. ఏ విధముగ తలపోసిన
    భావ మభావమయిన యెడఁ బద్యము వెల్గున్
    దేవానాంప్రియుఁని మదిని ,
    ఏ విదుడైనను నుతించ నింగమె ముఖ్యమ్

    రిప్లయితొలగించండి
  3. కందం
    ఠీవిగ సమస్యఁ గైకొని
    చేవఁ జమత్కారమొలుక సింగారముగన్
    గావించు పూరణన్ దు
    ర్భావ మభావమయినయెడఁ బద్యము వెలుగున్!

    ఉత్పలమాల
    ఏవముగన్ సమస్యలిడ నింపగు దృశ్యము సృష్టిఁజేయుచున్
    జేవఁ జమత్కరించి స్మరణీయమనంగ సభాసదుల్, దగన్
    జీవము నింపి పూరణము సిందులువేయ ముగించువేళ దు
    ర్భావ మభావమైనపుడె పద్యము హృద్యమటంద్రు పండితుల్!

    రిప్లయితొలగించండి

  4. భావ మభావంబగు తరి
    చేవ గల కవీంద్రు జెంత జేరుచు ప్రియ యే
    భావము జూపిన నిక ని
    ర్భావ మభావమయిన యెడఁ బద్యము వెల్గున్.



    చేవను గల్గి నట్టి కవి చెంతను జేరుచు చేతు లందునన్
    వీవెన వీచె డందమగు భీరువు ప్రేమగ మాటలాడుచున్
    భావ తరంగ మాలికకు ప్రాణము పోసిన చాలు నింక ని
    ర్భావ మభావమైనపుడె పద్యము హృద్యమటంద్రు పండితుల్.

    రిప్లయితొలగించండి
  5. భావము తో రాణింప గ
    ధీవరు లెల్ల రును మెఛ్చి దివ్యంబ న రే
    పావన మై వె లుగు చు చెడు
    భావ మ భావ మయిన యెడ బ ద్యము వెల్గు న్

    రిప్లయితొలగించండి
  6. -
    ఓ విదుర! నీరసించును
    భావ మభావమయిన యెడఁ బద్యము; వెల్గున్
    జీవముతో నెల్లపుడు ప్ర
    భావము తో పద్దెమున్ గుభాళింపంగన్


    రిప్లయితొలగించండి