28-5-2026 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఇచ్చెడి దేమిటో తెలియనీయనిదైన వధాన మెందుకో”
(ఉప్పలధడియం ఏకదిన శతావధానంలో నా సమస్య)
ఉత్పలమాలమెచ్చగ పృచ్ఛకుల్ మరియు మేదిని ప్రేక్షకులెల్లముగ్ధులైకచ్చితమైన భావమును కమ్మగనప్పటి కప్పుడున్ దగన్నచ్చిన రీతి పాటవము నల్గురు భేషనఁ దేటతెల్లమౌనిచ్చెడి దేమిటో తెలియనీయనిదైన వధాన మెందుకో!
ఇచ్చు సమస్య తానెరిఁగి యింపుగ పూరణ జేసి పద్యమున్మెచ్చగ పండితాళి యటుమీదట ధారణజేసి చెప్పినన్నచ్చి ప్రశంస జేసెదరు నల్వురు, యట్టులగాక ప్రాశ్నికుండిచ్చెడి దేమిటో తెలియనీయనిదైన వధాన మెందుకో
వచ్చును కాదె పిల్చిరని పండితు లాడెడి క్రీడ యంచు తా వచ్చిన పండితోత్తముల ప్రశ్నల కెల్లను పద్య మాలలన్ గ్రుచ్చు వధాని వర్యునకు కూరిమి తో నట పారి తోషకం బిచ్చెడి దేమిటో తెలియనీయనిదైన వధాన మెందుకో?
ఉత్పలమాల
రిప్లయితొలగించండిమెచ్చగ పృచ్ఛకుల్ మరియు మేదిని ప్రేక్షకులెల్లముగ్ధులై
కచ్చితమైన భావమును కమ్మగనప్పటి కప్పుడున్ దగన్
నచ్చిన రీతి పాటవము నల్గురు భేషనఁ దేటతెల్లమౌ
నిచ్చెడి దేమిటో తెలియనీయనిదైన వధాన మెందుకో!
ఇచ్చు సమస్య తానెరిఁగి యింపుగ పూరణ జేసి పద్యమున్
రిప్లయితొలగించండిమెచ్చగ పండితాళి యటుమీదట ధారణజేసి చెప్పినన్
నచ్చి ప్రశంస జేసెదరు నల్వురు, యట్టులగాక ప్రాశ్నికుం
డిచ్చెడి దేమిటో తెలియనీయనిదైన వధాన మెందుకో
రిప్లయితొలగించండివచ్చును కాదె పిల్చిరని పండితు లాడెడి క్రీడ యంచు తా
వచ్చిన పండితోత్తముల ప్రశ్నల కెల్లను పద్య మాలలన్
గ్రుచ్చు వధాని వర్యునకు కూరిమి తో నట పారి తోషకం
బిచ్చెడి దేమిటో తెలియనీయనిదైన వధాన మెందుకో?