10, మే 2026, ఆదివారం

సమస్య - 5465

11-5-2026 (సోమవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“ద్రుపదుని తనయకు మగలు నల్గురె సుమ్మీ”

(లేదా...)

“ద్రుపదరాజ పుత్రికకు నల్గురె భర్తలు నమ్మకంబుగాన్”

(ఛందోగోపన సమస్యలు)

18 కామెంట్‌లు:

  1. ఉపదగ దక్కినది గనగ
    ద్రుపదుని తనయకు మగలు నలుగురే సుమ్మీ
    అపరిమి తమైన చక్కటి
    నిపుణత జూపి నరుడొకడె నెగ్గెను గదరా

    రిప్లయితొలగించండి

  2. చిద్రూపుడు తెలిపెను బల
    భద్రుని తో నివ్విధమ్ము వనజో దరుదే
    నిద్ర విడి నరుడు కాక మ
    న ద్రుపదుని తనయకు మగలు నల్గురె సుమ్మీ.


    అద్రుచు నొసంగు వాడగు మహా మహి తాత్ముడు చెప్పె నిట్లు కుం
    తి ద్రుహులు ధర్మ మూర్తులును ధీరులు శూరులె యైన నేమి విం
    త ద్రుఘణ వ్రాసినట్టి ఫలితమ్మున క్రీడి యొకండె కాక య
    న్న ద్రుపదరాజ పుత్రికకు నల్గురె భర్తలు నమ్మకంబుగాన్.

    రిప్లయితొలగించండి
  3. పద్రుచు నొకఁ డంగడిని న
    న్ను ద్రాగుబోఁ తనుచుఁ దిట్ట నోరెట్లాడెన్
    విద్రుచున్న మీర లిపుడు వి
    న ద్రుపదుని తనయకు మగలు నల్గురె సుమ్మీ!

    ఎద్రిచినవారితో నెపుడు నేను వివాదముఁ బెట్టుకొందు; నా
    కు ద్రవిడ బాసతోఁ మిగులఁ గూరిమి గల్గిన మాట సత్యమౌ
    ను; ద్రుమవిభాసితోపవన నూతన శోభలఁ గాంచి చెప్పుదా
    న- ద్రుపదరాజ పుత్రికకు నల్గురె భర్తలు నమ్మకంబుగన్.

    రిప్లయితొలగించండి
  4. ఎద్రుచు వశించు వినీతుడు
    పద్రుచు ప్రశాసను డడుగగఁ బ్రవచించెను తా
    నద్రుచు నరుడు షండుడు గా
    న ద్రుపదుని తనయకు మగలు నల్గురె సుమ్మీ

    ఎద్రుచు వసించు శిష్యుడు తనేమరకుండును యెల్లవేళలన్
    బద్రుచు ప్రశాసకుండడుగ పట్టునఁ దల్చె విరాట్టు కొల్వునే!
    అద్రుచు వచించెనా వటుకుఁ డర్జునుడయ్యెను బృష్టశృంగి గా
    న ద్రుపదరాజ పుత్రికకు నల్గురె భర్తలు నమ్మకంబుగాన్

    [ విరాటుని కొల్వులో నుండగా బృహన్నల షండుడు గావున ద్రౌపది భర్తలు నల్గురె ననుచు చెప్పాడు ]

    రిప్లయితొలగించండి
  5. రిప్లయిలు
    1. మొదటి మూడు పాదాల ఆద్యక్షరాలు గురువులౌతున్నాయి.

      తొలగించండి
    2. ఛ ': ద్రుతి సెడి పలుక వల దయ
      థు : ద్రువ మది కాదు గదర దురితo బె గదా
      యొ : ద్రవిడ! యెటు ల o టి వయ మ
      న ద్రుపదుని తనయకు మగలు నల్గు రె సుమ్మీ?

      తొలగించండి
  6. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  7. (1)కం:అద్రుచు వినకు నీ స్నుష కని
    న ద్రుతిన్ బొందంగ క్రీడి నా చే నో మా
    త!ద్రుతున్ లెక్కింప విడచి
    నద్రుపదుని తనయకు మగలు నల్గురె సుమ్మీ!
    (అర్జునుడు యుద్ధం లో ద్రుతుడైతే అనగా మరణిస్తే నీ కోడలికి నలుగురు భర్తలే అని కర్ణుడు కుంతి తో తో అన్నాడు.స్నుష= కోడలు. )

    (2)చం; అద్రుట యదేల నీ స్నుషకె హాని యగున్ విజయుండె యాజిలో
    నద్రుతుడు కాగ, నే నగుదు నమ్రత నైదవ పుత్రు గాదె మా
    త !ద్రవము గంట బెట్టకుము దారుణ దుఃఖము గల్గ గోడ లై
    నద్రుపదరాజ పుత్రికకు నల్గురె భర్తలు నమ్మకంబుగాన్”
    (అర్జునుడు పోయినా నేను ఐదవ కొడుకు నౌతా కనుక నీకు బాధ లేదు తల్లీ! నీ కోడలికే బాధ. ఐదుగురు భర్తల బదులు నలుగురే అవుతారు కనుక. )

    రిప్లయితొలగించండి
  8. చం॥ ఎ ద్రుపద రాజుఁ గూర్చియిది యెవ్వరు తెల్పిరి యన్న చెప్పుమ
    న్న ద్రుపద రాజు పుత్రికకు
    నమ్మఁగ నేవురు భర్తలే, యనం
    గ ద్రుపద రాజు నల్గురని గమ్మున మూర్ఛిలు నిట్లు దోషమ
    న్న ద్రుపద రాజు పుత్రికకు నల్గురె భర్తలు నమ్మకంబుగాన్


    ఎ ప్రశ్నార్థక ఏకాక్షర పదము నిఘంటువులో ఉన్నదండి.
    దోషము+అన్న దోషమన్న ఇట్లు అన్న దోషము అని అండి
    అతి కష్టము పైన ఇలా పూరించానండి. ఇంతకు మించి ఏమీ తోచలేదండి

    రిప్లయితొలగించండి
  9. సమస్య: ద్రుపద రాజపుత్రికకు నల్గురె భర్తలు నమ్మకమ్ముగన్ (అక్షర / యతి గోపన సమస్య)
    చ: ఎద్రిచిన నీకుమారుల వధింపకు మంచు వచింతు వమ్మరో
    యద్రుచును నన్నువేడుకొని, యర్జును వేగమె చంపివైతు నే
    చిద్రుప యొనర్చిగాండివము, చిక్కిన నల్గురఁ జంప కుందు కా
    న ద్రుపద రాజపుత్రికకు నల్గురె భర్తలు నమ్మకమ్ముగన్

    రిప్లయితొలగించండి
  10. అద్రువఁ బని లే దయా వరు
    స ద్రోవదికి నన్న సవ్య సాచి విలున నె
    న్నఁ ద్రినయన సముఁడు తక్క
    న్న ద్రుపదుని తనయకు మగలు నల్గురె సుమ్మీ


    సుదతి కొసంగె నా వరము చోద్యము మీఱఁగ ఫాలనేత్రుఁడే
    హృదయము నిండ హర్షమున నేవురు భర్తల మున్నొ సంగెనే
    సదమల చిత్తునిన్ సమర సత్వ వరేణ్యుఁ గిరీటి వీడి యె
    న్న ద్రుపదరాజ పుత్రికకు నల్గురె భర్తలు నమ్మకంబుగాన్

    రిప్లయితొలగించండి
  11. కందము
    అద్రుచు పైకము తక్కువ
    విద్రుచ దొరికె ప్రవచనము వేదిక పలుకన్
    వద్రుచు చెప్పంగ, నతఁడ
    న "ద్రుపదుని తనయకు మగలు నల్గురె సుమ్మీ!"

    చంపకమాల
    అద్రుచు ధనమ్మొసంగ ననుయాయుల వీడుచు నీవు నొక్కడే
    విద్రుచ ఘనుండు జిక్కునయ వేదికపై ప్రవచింప గొప్పఁగన్?
    వద్రుచు వితండ వాదమున భారత గాథను వాగు వాడు గా
    న ద్రుపదరాజ పుత్రికకు నల్గురె భర్తలు నమ్మకంబుగాన్!

    రిప్లయితొలగించండి