6-5-2026 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మౌనమున వెల్లువెత్తెను మాటలెన్నొ”
(లేదా...)
“మౌనముఁ బూని రిద్దరును మాటలు మాత్రము వెల్లువెత్తెరా”
తేటగీతితల్లి మాట కాదనడను తనయుఁడొకడునాలిమాటకు జిక్కుచు నాదమఱుచచిందులేయఁగ తల్లియే, కందు జంటమౌనమున వెల్లువెత్తెను మాటలెన్నొ!ఉత్పలమాలప్రాణ సమానమౌ జనని పల్కిన మాటను తప్పకెప్పుడున్దానొక వేళలో సుతుఁడు దారకు జిక్కుచు మీరినంతటన్బూనెను దయ్యమో యనగ పోరగ నిందల 'తల్లి' ,భీతినిన్మౌనముఁ బూని రిద్దరును, 'మాటలు మాత్రము వెల్లువెత్తెరా! '
కలుగును శమమనుచు జెప్ప , కపటమైన మౌనమున ; వెల్లువెత్తెను మాటలెన్నొ మదిని తిరుగాడు చుండి , సమయము నంత సైగల నిడుచు గడుపగ శాంతి తొలగె
అయ్యశోక వనము నందు నసుర రాజు రావణుండెంత ప్రేలిన రమణి సీత పెలుచ చూపులు చూచిన వేళ యందు మౌనమున వెల్లువెత్తెను మాటలెన్నొ.మానిని ద్రోవదిన్ గని ప్రమత్తుడు పొందును గోరగా సమా ధానము గాను భామినియె తానట మాటల నాడ కుండనే వానిని కీచకుండనట భామపు చూపులు చూచు పాళమున్ మౌనముఁ బూని రిద్దరును మాటలు మాత్రము వెల్లువెత్తెరా.
విల్లు నెక్కిడ రాముడు విరిగె ధనుసుతాను గాంచెను జానకి తన్మయమునమగువ సుమమాలనిడె రాముని గళసీమమౌనమున వెల్లువెత్తెను మాటలెన్నొజానకిదా స్వయంవరము జన్నపు గాపరి విల్లుఁ ద్రుంచగాతానట గాంచి రాముడిని తన్మయమొందిన మానసంబుతోజానకి వైచె మాలికను సత్వరమాతని కంఠసీమలోమౌనముఁ బూని రిద్దరును మాటలు మాత్రము వెల్లువెత్తెరా
-మూగ బోయిన మదిలోన మొద్దు భర్తపైన ప్రణయపు వేదన పరిఢవిల్లమౌనమున వెల్లువెత్తెను మాటలెన్నొకసబుస కసబుస యనెడు ఘాటు తోడు
(ఇద్దరు ప్రేమికుల నడుమ అవగాహన ఉంటే మనసులే మాట్లాడగలవని అండి)ఉ॥ పూనిన ప్రేమ మాధురిని పూర్ణ సమాదర భావనాస్త వి న్నాణము వర్ధిలంగ నిజ నాకపు సౌఖ్యముఁ బొందు వేళలోమానస వీణ మ్రోగనటు మానకఁ గన్నులు పల్కుచుండఁగన్మౌనముఁ బూని రిద్దరును మాటలు మాత్రము వెల్లువెత్తెరా
కలికి మగనిపై యేల కో కనలి తాను మసలు చుండగ మూ గ దై మనసు నందు మౌ నము న వెల్లు వె త్తెను మాట లె న్నొ పలు వి ధాలు గ వె న్వె o ట తలపు నందు
పెండ్లి కట్నము తెమ్మని పెక్కుమార్లుభర్త దూషించుచుండెను, భార్య లోనమౌనమున వెల్లవెత్తెను మాటలెన్నొభయముచేనవి రాలేదు బయటకెపుడు.
తేటగీతి
రిప్లయితొలగించండితల్లి మాట కాదనడను తనయుఁడొకడు
నాలిమాటకు జిక్కుచు నాదమఱుచ
చిందులేయఁగ తల్లియే, కందు జంట
మౌనమున వెల్లువెత్తెను మాటలెన్నొ!
ఉత్పలమాల
ప్రాణ సమానమౌ జనని పల్కిన మాటను తప్పకెప్పుడున్
దానొక వేళలో సుతుఁడు దారకు జిక్కుచు మీరినంతటన్
బూనెను దయ్యమో యనగ పోరగ నిందల 'తల్లి' ,భీతినిన్
మౌనముఁ బూని రిద్దరును, 'మాటలు మాత్రము వెల్లువెత్తెరా! '
కలుగును శమమనుచు జెప్ప , కపటమైన
రిప్లయితొలగించండిమౌనమున ; వెల్లువెత్తెను మాటలెన్నొ
మదిని తిరుగాడు చుండి , సమయము నంత
సైగల నిడుచు గడుపగ శాంతి తొలగె
రిప్లయితొలగించండిఅయ్యశోక వనము నందు నసుర రాజు
రావణుండెంత ప్రేలిన రమణి సీత
పెలుచ చూపులు చూచిన వేళ యందు
మౌనమున వెల్లువెత్తెను మాటలెన్నొ.
మానిని ద్రోవదిన్ గని ప్రమత్తుడు పొందును గోరగా సమా
ధానము గాను భామినియె తానట మాటల నాడ కుండనే
వానిని కీచకుండనట భామపు చూపులు చూచు పాళమున్
మౌనముఁ బూని రిద్దరును మాటలు మాత్రము వెల్లువెత్తెరా.
విల్లు నెక్కిడ రాముడు విరిగె ధనుసు
రిప్లయితొలగించండితాను గాంచెను జానకి తన్మయమున
మగువ సుమమాలనిడె రాముని గళసీమ
మౌనమున వెల్లువెత్తెను మాటలెన్నొ
జానకిదా స్వయంవరము జన్నపు గాపరి విల్లుఁ ద్రుంచగా
తానట గాంచి రాముడిని తన్మయమొందిన మానసంబుతో
జానకి వైచె మాలికను సత్వరమాతని కంఠసీమలో
మౌనముఁ బూని రిద్దరును మాటలు మాత్రము వెల్లువెత్తెరా
-
రిప్లయితొలగించండిమూగ బోయిన మదిలోన మొద్దు భర్త
పైన ప్రణయపు వేదన పరిఢవిల్ల
మౌనమున వెల్లువెత్తెను మాటలెన్నొ
కసబుస కసబుస యనెడు ఘాటు తోడు
(ఇద్దరు ప్రేమికుల నడుమ అవగాహన ఉంటే మనసులే మాట్లాడగలవని అండి)
రిప్లయితొలగించండిఉ॥ పూనిన ప్రేమ మాధురిని పూర్ణ సమాదర భావనాస్త వి
న్నాణము వర్ధిలంగ నిజ నాకపు సౌఖ్యముఁ బొందు వేళలో
మానస వీణ మ్రోగనటు మానకఁ గన్నులు పల్కుచుండఁగన్
మౌనముఁ బూని రిద్దరును మాటలు మాత్రము వెల్లువెత్తెరా
కలికి మగనిపై యేల కో కనలి తాను
రిప్లయితొలగించండిమసలు చుండగ మూ గ దై మనసు నందు
మౌ నము న వెల్లు వె త్తెను మాట లె న్నొ
పలు వి ధాలు గ వె న్వె o ట తలపు నందు
పెండ్లి కట్నము తెమ్మని పెక్కుమార్లు
రిప్లయితొలగించండిభర్త దూషించుచుండెను, భార్య లోన
మౌనమున వెల్లవెత్తెను మాటలెన్నొ
భయముచేనవి రాలేదు బయటకెపుడు.