3, మే 2026, ఆదివారం

సమస్య - 5458

4-5-2026 (సోమవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“దొరకును సిరులున్ యశమ్ము దుర్వ్యసనములన్”

(లేదా...)

“దొరకును కీర్తి సంపదలు దుర్వ్యసమ్ముల వీడకున్నచో”

6 కామెంట్‌లు:

  1. చరితము చక్కగ నుండిన
    దొరకును సిరులున్ యశమ్ము ;దుర్వ్యసనములన్
    పొరపాటున నైనను దన
    దరి రానీయక సతతము దారాడినచో

    రిప్లయితొలగించండి
  2. కరముగ శ్రమియించినచో
    దొరకును సిరులున్ యశంబు,
    దుర్వ్యసనములన్
    దరిరానివ్వకు మెప్పుడు
    మురిపముతో బ్రతుకగలవు
    బుధులు నుతింపన్.

    రిప్లయితొలగించండి
  3. విరివిగ నేతల నరయగ
    మరిమరి కానంగ వచ్చు మానని పేర్మిన్
    గరకుగ పల్కుట సరియౌ
    దొరకును సిరులున్ యశమ్ము దుర్వ్యసనములన్


    విరివిగ చూడనొప్పుగద వీడక నుందురు నేతలెందరో
    మరిమరి వారికున్నవగు మాయని దుర్వ్యసనంబు లెన్నియో
    కరకుగ పల్కగానగును గాంచినచో మరి వారి వైఖరిన్
    దొరకును కీర్తి సంపదలు దుర్వ్యసనమ్ముల వీడకున్నచో

    రిప్లయితొలగించండి
  4. పరుషపు మాటలెప్పుడును పల్కక నిత్యము తాల్మితోడుతన్
    పరులకు సేవజేయుచు విపన్నుల చక్కగ జూచుచుండినన్
    దొరకును కీర్తి సంపదలు దుర్వ్యసనమ్ములు వీడ కున్నచో
    పరువు ప్రతిష్టలన్నియు నిపాతము చెందును వేగిరమ్ముగన్

    రిప్లయితొలగించండి



  5. కందం
    పరులెవ్వరు మెచ్చని పని
    సిరులందెడు యావ తోడ చేరెదరుకదా!
    తరుగుటకు ముందు భ్రమలన్
    దొరకును సిరులున్ యశమ్ము దుర్వ్యసనములన్

    చంపకమాల
    వరగుణ సంయుతుండనెడు పాండవ ముఖ్యుడు ధర్మజుండె తా
    నొరుగుచు నాడి జూదమున నోడెను సంపద నైనవారినిన్
    దొరికిన ధార్తరాష్ట్రుడట తూలుచు నోడె! నశాశ్వతమ్ముగన్
    దొరకును కీర్తి సంపదలు దుర్వ్యసనమ్ముల వీడకున్నచో!

    రిప్లయితొలగించండి

  6. మరచితివట బాధ్యతలను
    విరివిగ వ్యసనముల మరిగి విను మంటిని నీ
    గురు బోధనలను విడిచిన
    దొరకును సిరులున్ యశమ్ము, దుర్వ్యసనములన్.


    అరయగ సద్గుణమ్ములవి యాచర ణీయము లన్న మాటలే
    వరమగు మానవాళి కది వాస్తవ మంటిని వాటివల్ల నే
    దొరకును కీర్తి సంపదలు, దుర్వ్యసమ్ముల వీడకున్నచో
    జరఠము తప్పదన్న నుడి సత్యము ధాత్రిని విశ్వ సింపుమా

    రిప్లయితొలగించండి