14, మే 2026, గురువారం

సమస్య - 5469

15-5-2026 (శుక్రవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“శృంగముతోఁ గ్రుమ్మెనంట సింహము గజమున్”

(లేదా...)

“శృంగముతోడఁ గ్రుమ్మెనఁట సింహము మత్తగజేంద్రమున్ వనిన్”

17 కామెంట్‌లు:

  1. కందం
    అంగాంగంబు వణుకదే
    బెంగపడఁ గలన్ కిశోర వీరమ్ముగనన్!
    జెంగట పంజానెత్తుచు
    శృంగముతోఁ గ్రుమ్మెనంట సింహము గజమున్


    ఉత్పలమాల
    అంగములందునన్ వణకు యావరణంబగు స్వప్నమై కనన్
    సింగము నేనుగే సహజ సిద్ధమటంచను జాతివైరమై
    చెంగట నిల్చి వీరమును జిందుచు ముందటి పాదమెత్తుచున్
    శృంగముతోడఁ గ్రుమ్మెనఁట సింహము మత్తగజేంద్రమున్ వనిన్

    (శృంగము = దొరతనము)

    రిప్లయితొలగించండి
  2. పింగళు వైరిని భృంగియె
    శృంగముతోఁ గ్రుమ్మెనంట ; సింహము గజమున్
    ఛంగున పైకి దుముకగనె
    భంగపడుచు పారిపోయె భయము తోడన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది.
      'భయముతోడన్' అంటే గణభంగం. "భయవిహ్వలమై" అనండి.

      తొలగించండి
  3. రంగుల చిత్రము నందు తు
    రంగము నకు పక్షములు నెఱపరికి పదునౌ
    శృంగములను జూపుచు నా
    శృంగముతోఁ గ్రుమ్మెనంట సింహము గజమున్.



    బంగరు వర్ణ పక్షముల బ్రధ్నము కల్గిన చిత్ర మందునన్
    శృంగము లున్న సింహమును స్నేహితు రాలిగ చూపి వారికిన్
    గొంగ లతా లికమ్ము, ప్రతి కూలుని చంప దలంచి చివ్వలో
    శృంగముతోడఁ గ్రుమ్మెనఁట సింహము మత్తగజేంద్రమున్ వనిన్.

    రిప్లయితొలగించండి
  4. రంగులలో ముద్రించిన
    శృంగారపు కావ్య మనుచు చెప్పగఁ గంటిన్
    వెంగలి విరచించినదది
    శృంగముతోఁ గ్రుమ్మెనంట సింహము గజమున్

    రంగుల ముద్రణంబనుచు రమ్యముగా వచియించె నాతడే
    చెంగున చేరవచ్చి మరి చెప్పెను పుస్తక వైభవమ్మునే
    వెంగలి సంలిఖించెనట వింతగు కావ్యము వీక్ష సేయగా
    శృంగముతోడఁ గ్రుమ్మెనఁట సింహము మత్తగజేంద్రమున్ వనిన్

    రిప్లయితొలగించండి
  5. -

    అంగట శిఖి యొకటి మునుల
    శృంగముతోఁ గ్రుమ్మెనంట; సింహము గజమున్
    రంగమున దింపె నెవరా
    వంగజపు కరటియొ కనుగొనంగ వడివడిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాగుంది. చివరిపాదంలో యతి తప్పింది. "వంగజపు కరటియె కనగ వడివడిని దగన్" అందామా?

      తొలగించండి
  6. కం:సింగము పైబడ దుప్పియె
    శృంగముతోఁ గ్రుమ్మె నంట, సింహము గజమున్”
    భంగింప బూని తానే
    లొంగుట విప్లవ కవితల లో గనిపించున్.
    (కమ్యూనిస్ట్ కవితలలో ఇలాంటివి కనిపిస్తాయి. "ఏం పిల్లో ఎల్ద మొస్తవా? అనే పాట లో పామును జంపిన చీమలు లున్నయట మొదలైన వైరుథ్యాలు ఉంటాయి. )

    రిప్లయితొలగించండి
  7. ఉ॥ భంగును గ్రోలి మత్తుఁ గని పాలసుఁ డొక్కడు విస్మరించి సా
    రంగమునే మనమ్మునను గ్రమ్మఁగ మూర్ఖత తల్చి గొప్పగా
    సింగమటంచు నీవిధిగఁ జెప్పెను సర్వులు నవ్వి పోవఁగన్
    శృంగము తోడఁ గ్రుమ్మెనట సింహము మత్తగజేంద్రమున్ వనిన్

    భంగు పాలు వగైరా వేసి తయారు చేయు మత్తు పదార్థము, విస్మరించు మఱచిపోవు

    రిప్లయితొలగించండి
  8. ఉ:సింగము పైబడన్ సరకు జేయక బర్రెయు ధైర్య మొందుచున్
    శృంగముతోడఁ గ్రుమ్మెనఁట, సింహము మత్తగజేంద్రమున్ వనిన్
    లొంగగ జేసి చంపి తిన లోలత జూప నిభమ్ము శక్తికిన్
    భంగము కాని రీతి దల వంచక బోరును బ్రాణ మెక్కువై

    రిప్లయితొలగించండి
  9. శృంగము గలిగిన కేసరి
    ముంగిట కన్ఫడు మృగముల మునుకొని చంపెన్
    చెంగట జూచియు నొకపరి
    శృంగము తో గృమ్మె నంట సింహము గజమున్

    రిప్లయితొలగించండి
  10. క్రుంగ జవ సత్వములు గూ
    లంగ బడలి తత్క్షణము ధరా తల మందున్
    వంగని నఖములతో బల
    శృంగముతోఁ గ్రుమ్మె నంట సింహము గజమున్

    [శృంగము = దొరతనము]


    భంగము కల్గుచోఁ దనదు భద్రత కించుక యెన్నఁ డేనియుం
    గ్రుంగక యల్ప జీవియును రోషము నూని చెలంగు నుగ్రతం
    జెంగున డాసి సత్వమున శ్రేష్ఠము ఖడ్గ మృగమ్ము రెంటినిన్
    శృంగము తోడఁ గ్రుమ్మె నఁట సింహము మత్తగజేంద్రమున్ వనిన్

    [సింహము (న్) మత్త గజేంద్రమున్]

    రిప్లయితొలగించండి

  11. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    అంగడిని వృషభ మొకనిని
    శృంగముతోఁ గ్రుమ్మెనంట;సింహము గజమున్
    చెంగున పైపైకి దుముక
    భంగము కలిగినదని కరి భయపడి పాఱెన్.

    రిప్లయితొలగించండి