13, జులై 2026, సోమవారం

సమస్య - 5527

14-7-2026 (మంగళవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రణమున రసగంధ మెసఁగె రమ్యతరముగా”
(లేదా...)
“రణమునఁ బద్యగంధరసరాగములొప్పెను రమ్యపద్ధతిన్”

10 కామెంట్‌లు:

  1. ప్రణవముతో మోచు సభన
    పణితమగు పలుకుల కతన ప్రమదించంగా
    ధణి పండితులకొసగిన శ
    రణమున రసగంధ మెసఁగె రమ్యతరముగా

    రిప్లయితొలగించండి
  2. గణయతులును బ్రాసలతో
    క్షణమైనను జాగులేక కవి పలుకగ వీ
    క్షణమొప్పె సమస్యా పూ
    రణమున రసగంధ మెసఁగె రమ్యతరముగా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్షణమొక పద్యమై మిగుల కౌతుకమొప్పు వధానమందునన్
      గణగణ మ్రోగెఁ గోవిదుని కంఠము చక్కని రాగమందునన్
      మణిమయ దీప్తమై తనరు మాన్యవదాన్యుని ప్రజ్ఞ పద్య పూ
      రణమునఁ బద్యగంధరసరాగములొప్పెను రమ్యపద్ధతిన్

      తొలగించండి
  3. ప్రణతులటంచును తెలుపుచు
    చణమది కలిగిన వధాని సభలో తాన్ బూ
    రణ పద్యములు చదివి ధా
    రణమున రసగంధ మెసఁగె రమ్యతరముగా.


    రణమన నొప్పు క్రీడ యది ప్రాజ్ఞలు ప్రాశ్నికు లైన వారికిన్
    చణమది వాసిగాగల విశారదు డైన వధాని నమ్రతన్
    ప్రణతులు తెల్పి యంతమున పద్యములన్ జవ మందు జెప్ప ధా
    రణమునఁ బద్యగంధరసరాగములొప్పెను రమ్యపద్ధతిన్.


    రిప్లయితొలగించండి
  4. మణిమయ వేదికందు నసమానుడు మాన్యుడు నద్భుతంబుగన్
    గణయతి ప్రాస లన్ని క్షణకాలము నందునె కూర్చి చక్కగన్
    తొణికిస లాడు పద్యముల తోరణమల్లెను ప్రజ్ఞజూపి తో
    రణమున బద్య గంధరసరాగము లొప్పెను రమ్య పద్ధతిన్

    రిప్లయితొలగించండి
  5. గణ యతి ప్రాసలు గలిగియు
    గణు తించె డు రీతి పద్య కల్పన దోడ న్
    ప్రణు తింప గ విభు దులు పూ
    రణము న రస గంధ మెసగె రమ్య తర ము గా

    రిప్లయితొలగించండి
  6. అనయము రాయల సభలో
    వినిపించును పద్దియములు వీనులలరగన్
    ఘనముగ సాగిన సాహితి
    రణమున రసగంధ మెసఁగె రమ్యతరముగా

    రిప్లయితొలగించండి
  7. అనయము కావ్యగోష్ఠులను హాయిగ సల్పు సభాంగణమ్మునన్
    ఘనముగ పండితోత్తములు గానముఁ జేతురు వారి కావ్యముల్
    విని ముదమొంద నెల్లరును వీనుల విందుగ నాటిపద్య పూ
    రణమునఁ బద్యగంధరసరాగములొప్పెను రమ్యపద్ధతిన్

    రిప్లయితొలగించండి