14-7-2026 (మంగళవారం)ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“రణమున రసగంధ మెసఁగె రమ్యతరముగా”(లేదా...)“రణమునఁ బద్యగంధరసరాగములొప్పెను రమ్యపద్ధతిన్”
ప్రణవముతో మోచు సభన పణితమగు పలుకుల కతన ప్రమదించంగా ధణి పండితులకొసగిన శరణమున రసగంధ మెసఁగె రమ్యతరముగా
గణయతులును బ్రాసలతో క్షణమైనను జాగులేక కవి పలుకగ వీక్షణమొప్పె సమస్యా పూ రణమున రసగంధ మెసఁగె రమ్యతరముగా
క్షణమొక పద్యమై మిగుల కౌతుకమొప్పు వధానమందునన్గణగణ మ్రోగెఁ గోవిదుని కంఠము చక్కని రాగమందునన్ మణిమయ దీప్తమై తనరు మాన్యవదాన్యుని ప్రజ్ఞ పద్య పూరణమునఁ బద్యగంధరసరాగములొప్పెను రమ్యపద్ధతిన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
ప్రణతులటంచును తెలుపుచు చణమది కలిగిన వధాని సభలో తాన్ బూ రణ పద్యములు చదివి ధా రణమున రసగంధ మెసఁగె రమ్యతరముగా.రణమన నొప్పు క్రీడ యది ప్రాజ్ఞలు ప్రాశ్నికు లైన వారికిన్ చణమది వాసిగాగల విశారదు డైన వధాని నమ్రతన్ ప్రణతులు తెల్పి యంతమున పద్యములన్ జవ మందు జెప్ప ధా రణమునఁ బద్యగంధరసరాగములొప్పెను రమ్యపద్ధతిన్.
మణిమయ వేదికందు నసమానుడు మాన్యుడు నద్భుతంబుగన్గణయతి ప్రాస లన్ని క్షణకాలము నందునె కూర్చి చక్కగన్తొణికిస లాడు పద్యముల తోరణమల్లెను ప్రజ్ఞజూపి తోరణమున బద్య గంధరసరాగము లొప్పెను రమ్య పద్ధతిన్
గణ యతి ప్రాసలు గలిగియు గణు తించె డు రీతి పద్య కల్పన దోడ న్ ప్రణు తింప గ విభు దులు పూ రణము న రస గంధ మెసగె రమ్య తర ము గా
అనయము రాయల సభలోవినిపించును పద్దియములు వీనులలరగన్ఘనముగ సాగిన సాహితిరణమున రసగంధ మెసఁగె రమ్యతరముగా
అనయము కావ్యగోష్ఠులను హాయిగ సల్పు సభాంగణమ్మునన్ఘనముగ పండితోత్తములు గానముఁ జేతురు వారి కావ్యముల్విని ముదమొంద నెల్లరును వీనుల విందుగ నాటిపద్య పూరణమునఁ బద్యగంధరసరాగములొప్పెను రమ్యపద్ధతిన్
ప్రణవముతో మోచు సభన
రిప్లయితొలగించండిపణితమగు పలుకుల కతన ప్రమదించంగా
ధణి పండితులకొసగిన శ
రణమున రసగంధ మెసఁగె రమ్యతరముగా
గణయతులును బ్రాసలతో
రిప్లయితొలగించండిక్షణమైనను జాగులేక కవి పలుకగ వీ
క్షణమొప్పె సమస్యా పూ
రణమున రసగంధ మెసఁగె రమ్యతరముగా
క్షణమొక పద్యమై మిగుల కౌతుకమొప్పు వధానమందునన్
తొలగించండిగణగణ మ్రోగెఁ గోవిదుని కంఠము చక్కని రాగమందునన్
మణిమయ దీప్తమై తనరు మాన్యవదాన్యుని ప్రజ్ఞ పద్య పూ
రణమునఁ బద్యగంధరసరాగములొప్పెను రమ్యపద్ధతిన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిప్రణతులటంచును తెలుపుచు
రిప్లయితొలగించండిచణమది కలిగిన వధాని సభలో తాన్ బూ
రణ పద్యములు చదివి ధా
రణమున రసగంధ మెసఁగె రమ్యతరముగా.
రణమన నొప్పు క్రీడ యది ప్రాజ్ఞలు ప్రాశ్నికు లైన వారికిన్
చణమది వాసిగాగల విశారదు డైన వధాని నమ్రతన్
ప్రణతులు తెల్పి యంతమున పద్యములన్ జవ మందు జెప్ప ధా
రణమునఁ బద్యగంధరసరాగములొప్పెను రమ్యపద్ధతిన్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమణిమయ వేదికందు నసమానుడు మాన్యుడు నద్భుతంబుగన్
రిప్లయితొలగించండిగణయతి ప్రాస లన్ని క్షణకాలము నందునె కూర్చి చక్కగన్
తొణికిస లాడు పద్యముల తోరణమల్లెను ప్రజ్ఞజూపి తో
రణమున బద్య గంధరసరాగము లొప్పెను రమ్య పద్ధతిన్
గణ యతి ప్రాసలు గలిగియు
రిప్లయితొలగించండిగణు తించె డు రీతి పద్య కల్పన దోడ న్
ప్రణు తింప గ విభు దులు పూ
రణము న రస గంధ మెసగె రమ్య తర ము గా
అనయము రాయల సభలో
రిప్లయితొలగించండివినిపించును పద్దియములు వీనులలరగన్
ఘనముగ సాగిన సాహితి
రణమున రసగంధ మెసఁగె రమ్యతరముగా
అనయము కావ్యగోష్ఠులను హాయిగ సల్పు సభాంగణమ్మునన్
రిప్లయితొలగించండిఘనముగ పండితోత్తములు గానముఁ జేతురు వారి కావ్యముల్
విని ముదమొంద నెల్లరును వీనుల విందుగ నాటిపద్య పూ
రణమునఁ బద్యగంధరసరాగములొప్పెను రమ్యపద్ధతిన్