కాస్త అతిశయోక్తి జోడించానేమో🙏 (మేస్త్రీలంతా కూటమిగట్టి అన్ని రేట్లూ పెంచినవేళ, ఇల్లు కట్టుకొంటున్న ఓ మధ్యతరగతి ఆసామి నిరాశా నిస్పృహలతో స్నేహితునితో మేస్త్రీలను కిడ్నాప్ చేస్తే బాగుంటుందని వాపోవుచున్నాడు)
ఆ॥వె కూలి ఖర్చు పెంచి కూలివేళగుదించి జట్టుగట్టిరయ్య గట్టిగాను! ఇట్టి సమయమందు నిల్లుగట్టగను మే స్త్రీల నపహరింప మేలుగలుగు
స్త్రీల గౌరవించ శ్రేష్టమందురు గాని ,
రిప్లయితొలగించండివారిలోన కొలది వశలనెంచి
పడుపు వృత్తి తోడ పణమునార్జించెడు
స్త్రీల నపహరింప మేలు గలుగు
ఆటవెలది
రిప్లయితొలగించండివెన్ననైన గాని పెళ్లి వధవునైన
నపహరించు వారికగ్రపూజ
చేయ ధర్మజుండు హేయమైనను గాని
స్త్రీల నపహరింప మేలు గలుగు!
శార్దూలవిక్రీడితము
పాలన్ వెన్నలె కాక మీరి తరుణీ వస్త్రాలతో పాటుగా
లీలామానసవిగ్రహుండు వధువున్ శ్రీకృష్ణుఁడే దొంగిలన్
శ్రీలన్ గూరిచి యగ్రపూజ సలుపన్ జెల్లంగ నీ పాలనన్
స్త్రీలన్ మ్రుచ్చిలువాని కెయ్యెడల నెంతేన్ మేలు గల్గున్ గదా!
చీడ పురుగు వంటి చేష్టలు గలిగియు
రిప్లయితొలగించండిసంఘ మునకు కీడు సల్పు నట్టి
స్త్రీల నప హరింప మేలు గలుగు నంద్రు
విజ్ణు లెల్ల భువిని విదిత ముగను
రిప్లయితొలగించండి*(శిశుపాలుడు కృష్ణుని గూర్చి వ్యంగ్యము గా పలికిన పలుకులు)*
స్నాన మాడు వేళ శర్వరుల వలువలు
పర గృహముల జేరి పాలు నవని
పెండ్లి యాడ బోవు స్పృక్కయైనట్టి యా
స్త్రీ ల నపహరింప మేలు గలుగు?
ఆలన్ గాచెను గొల్లడౌచు పర సంస్త్యాయమ్ములన్ దూరుచున్
పాలన్ వెన్నెల, పల్లవాధరల సంవ్యాసమ్ములన్ స్పృక్క యౌ
స్త్రీ లన్ మ్రుచ్చిలువాని కెయ్యెడల నెంతేన్ మేలు గల్గున్ గదా
లీలా మానస మూర్తి యంచు తమరేరీతిన్ బ్రశంసింతురో
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిస్త్రీల నపహరింప మేలు గలుగు నంచు
రిప్లయితొలగించండిభంగపడిన వారు పలువురుంద్రు
సీతనపహరించి శ్రీరాము నెదిరించి
రావణుండు చచ్చె రణమునందు
చాలించెన్ గలి తా నిరీక్షణమునే సాగించెలే మోసమే
బాలారత్న వరూధినీ సురతమే ప్రాప్తించెలే హాయిగా
నాలోచించిన వాని కెల్ల విదితంబౌ గొప్ప యాథార్థ్యమే
స్త్రీలన్ మ్రుచ్చిలువాని కెయ్యెడల నెంతేన్ మేలు గల్గున్ గదా
[ మ్రుచ్చిలు = వంచించు ]
కాస్త అతిశయోక్తి జోడించానేమో🙏
రిప్లయితొలగించండి(మేస్త్రీలంతా కూటమిగట్టి అన్ని రేట్లూ పెంచినవేళ, ఇల్లు కట్టుకొంటున్న ఓ మధ్యతరగతి ఆసామి నిరాశా నిస్పృహలతో స్నేహితునితో మేస్త్రీలను కిడ్నాప్ చేస్తే బాగుంటుందని వాపోవుచున్నాడు)
ఆ॥వె
కూలి ఖర్చు పెంచి కూలివేళగుదించి
జట్టుగట్టిరయ్య గట్టిగాను!
ఇట్టి సమయమందు నిల్లుగట్టగను మే
స్త్రీల నపహరింప మేలుగలుగు