29, ఆగస్టు 2026, శనివారం

సమస్య - 5574

30-8-2026 (ఆదివారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

[ఛందోగోపనము]

“వాఙ్మయమున ధర్మమ్ము లేదు మానుఁడు చదువన్”

(లేదా...)

“వాఙ్మయమందున్నది ధర్మదూరమగు సంపాఠ్యమ్ము గాదెన్నఁడున్”

(పట్వర్ధన్ గారి శతావధానంలో నేనిచ్చిన సమస్య)

21 కామెంట్‌లు:

  1. నయమౌ రచనల యందలి
    నియమము దెలుపుటను పెద్ద నేరమనెదరా !
    భయపడుచురచించెడి వా
    ఙ్మయమున ధర్మమ్ము లేదు మానుఁడు చదువన్”

    రిప్లయితొలగించండి

  2. నయమున్ గూర్చుచు నిల దు
    ర్నయముల ద్రుంచ ఖలు సంహరణ మదియె పు
    న్నియమంచను హింసా వా
    ఙ్మయమున ధర్మమ్ము లేదు మానుఁడు చదువన్.



    నయమున్ గాంచగ లేము భక్తియును శూన్యంబందు నగ్నమ్ము గా
    ప్రియలన్ గల్గిన చిత్ర రాజములటన్ విత్తమ్ము సాధింప స్త్రీ
    నాయగారమ్ములె హెచ్చుగా గలుగు సిన్మా వార్త పొత్తంపు వా
    ఙ్మయమందున్నది ధర్మదూరమగు సంపాఠ్యమ్ము గాదెన్నఁడున్.

    రిప్లయితొలగించండి
  3. నయమౌ వాఙ్మయముఁ జదువ
    జయమే మనదను దలపులు సంప్రాప్తంబౌ
    భయ శోక విదూరపు వా
    ఙ్మయమున ధర్మమ్ము లేదు మానుఁడు చదువన్

    నయమౌ సుందరమౌ ప్రబోధ రచనల్ నైరాశ్యమున్ ద్రుంచగా
    జయమే నీదరి జేరునన్న తలపుల్ చైతన్య మందింప వా
    ఙ్మయమందున్నది ధర్మదూరమగు సంపాఠ్యమ్ము గాదెన్నఁడున్
    భయ శోకంబులు లేని లోకవిధులే ప్రాధాన్యమై నిల్చులే

    రిప్లయితొలగించండి
  4. భయమున్ సాంతము ప్రోచిపుచ్చి మది విశ్వాసంబు కల్గించుచున్
    జయమున్ నీకును నన్ని కార్యములలో చక్కంగ చేకూర్చుచున్
    మెయినన్ మిక్కిలి శ్రేష్ఠమై సతతమున్ మేల్కొల్పులన్ పాడు వా
    ఙ్మయమందున్నది ధర్మ దూరమగు సంపాఠ్యము గాదెన్నడున్

    రిప్లయితొలగించండి
  5. నియమములకు నీళ్లు వదలి
    భయమును బట్టిo చు నట్టి పలువిధ రచన ల్
    రయమున వదలు ము నా వా
    జ్మయమున ధర్మమ్ము లేదు మానుము జదువ న్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నీళ్లు' వ్యావహారికం. "నీరము నిడి.. భయమును బుట్టించు..." అనండి.

      తొలగించండి
  6. మ॥ నయమౌ రీతిగ మానవాళికిల విన్నాణమ్ముతో నొప్ప వా
    ఙ్మయమందున్నది శ్రేయమిచ్చి యుపయుక్తంబై ప్రకాశించగా
    భయమున్ గూర్చుచు నుగ్రవాదమును సంభావించి ప్రేఁచంగ వా
    ఙ్మయమందున్నది ధర్మదూరమగు సంపాఠ్యమ్ము గాదెన్నడున్

    నయము లాభము

    రిప్లయితొలగించండి
  7. భయమును గొల్పెడు కథనము
    నియమరహితమౌ పదముల నిర్మాణమ్మున్
    ప్రియమును గూర్చనిదగు వా
    ఙ్మయమున ధర్మమ్ము లేదు మానుఁడు చదువన్

    రిప్లయితొలగించండి
  8. ప్రియముంగూర్చును మానవాళికది ప్రేరేపించు సౌహార్దమే
    నియమంబుల్ వివరించు ధర్మపథమున్ నిక్కంబుగా జూపు ని
    ర్భయమున్ పాదుకొనంగజేయు మది విశ్వాసమ్ము గల్గించు వా
    ఙ్మయమందున్నది ధర్మదూరమగు సంపాఠ్యమ్ము గాదెన్నఁడున్

    రిప్లయితొలగించండి
  9. కం:భయ మింత లేక నాస్తికు
    డయిన మనుజు డిట్లు బలికె నార్యలదౌ ని
    ర్దయయే వేద మ్మా వా
    ఙ్మయమున ధర్మమ్ము లేదు మానుఁడు చదువన్”

    రిప్లయితొలగించండి
  10. మ:"జయ! అంబేద్కర! " యంచు నొక్క డనె "నీచమ్మైన దుర్బుద్ధి తో
    నియమమ్ములు గడు బెట్టె నా మనువు స్త్రీనిన్ ద్రొక్కి వేయంగ, ని
    ర్దయ తో శూద్రుల ద్రొక్క గా స్మృతిని దా వ్రాసెన్ సఖా! వాని వా
    ఙ్మయమందున్నది ధర్మదూరమగు సంపాఠ్యమ్ము గాదెన్నఁడున్”
    (అంబేద్కరిస్టులు మనుస్మృతిను చాలా ద్వేషిస్తారు.అంబేద్కర్ దాన్ని తగల బెట్టాడు అనే విషయం తెలిసినదే.)




    రిప్లయితొలగించండి
  11. ప్రియముగఁ బఠింపఁ దగు వా
    ఙ్మయములు వర్ధిల్లి పెక్కు మహిలోఁ గలవే
    నయవంచక నాస్తిక వా
    ఙ్మయమున ధర్మమ్ము లేదు మానుఁడు చదువన్


    క్షయ మొందింప జనోత్కరమ్ములను గక్షాపూర్ణ మంత్రాళి ని
    ర్దయఁ జొప్పింతురు ద్వేష భావములు మిథ్యా వాక్య యుక్తమ్ము సం
    దియ మావంతయు నిందు లేదు వినుమా తీవ్రోగ్ర వాదోక్త వా
    ఙ్మయమం దున్నది ధర్మ దూర మగు సంపాఠ్యమ్ము గాదెన్నఁడున్

    రిప్లయితొలగించండి

  12. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    నియమమ్ముల లెక్కించక
    రయమున చదివించ గలుగు ప్రావీణ్యతతో
    భయపెట్టెడు హింసా వా
    జ్ఞ్మయమున ధర్మమ్ము లేదు మానుడు
    చదువన్.

    రిప్లయితొలగించండి

  13. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    నియమమ్ముల లెక్కించక
    రయమున చదివించ గలుగు రచనలతోడన్
    భయపెట్టెడు హింసా వా
    జ్ఞ్మయమున ధర్మమ్ము లేదు మానుడు
    చదువన్.

    రిప్లయితొలగించండి