1-9-2026 (మంగళవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“బలదర్పాది వికార సంహతులతో బ్రహ్మంబు ప్రాప్తించెడిన్”
(లేదా...)
“ప్రాప్తించును బ్రహ్మపదము బలదర్పములన్”
(పట్వర్ధన్ గారి శతావధానంలో అక్కెర కరుణాసాగర్ గారి సమస్య)
మత్తేభవిక్రీడితము కలుగన్ శాపము ద్వారపాలకులకున్ గారుణ్య మేపారఁగన్ గలహమ్మొందుచు వైరభక్తి మిగులన్ గల్గంగ వైళమ్మునన్ గలువన్ వచ్చును నన్నటంచు హరి వక్కాణింపఁగన్ వారికిన్బలదర్పాది వికార సంహతులతో బ్రహ్మంబు ప్రాప్తించెడిన్కందంఆప్తుండై జయవిజయులుతృప్తిన్ గొన శాపభీతి తేలిక పడఁగన్గుప్తమ్ముగ హరి పలికెన్ ప్రాప్తించును బ్రహ్మపదము బలదర్పములన్
మత్తేభవిక్రీడితము
రిప్లయితొలగించండికలుగన్ శాపము ద్వారపాలకులకున్ గారుణ్య మేపారఁగన్
గలహమ్మొందుచు వైరభక్తి మిగులన్ గల్గంగ వైళమ్మునన్
గలువన్ వచ్చును నన్నటంచు హరి వక్కాణింపఁగన్ వారికిన్
బలదర్పాది వికార సంహతులతో బ్రహ్మంబు ప్రాప్తించెడిన్
కందం
ఆప్తుండై జయవిజయులు
తృప్తిన్ గొన శాపభీతి తేలిక పడఁగన్
గుప్తమ్ముగ హరి పలికెన్
ప్రాప్తించును బ్రహ్మపదము బలదర్పములన్