28-10-2026 (బుధవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కర్తవ్యము వీడువారు గళ్యాణకరుల్”
(లేదా...)
“కర్తవ్యమ్మును వీడువార లిలలోఁ గళ్యాణకారుల్ గదా”
(గెంటేల జగదీశ చంద్రకుమార్ గారికి ధన్యవాదాలతో...)
భర్త యెడతెగక త్రాగెడు వర్తనమును గాంచి భార్య వలదన కుండన్ నార్తి పడక బొగడెడు దన కర్తవ్యము వీడువారు గళ్యాణకరుల్
హర్తల్ నేతలుగా ప్రభుత్వమొదవన్నత్యంత స్వార్థమ్ముతోవర్తిల్లన్ బ్రజ బాధలన్ విడుచుచున్ వంచించుచున్ నిత్యమున్ పూర్తిన్ చేయక వృద్ధి కారకములన్ భోగమ్ములన్ బొందుచున్ కర్తవ్యమ్మును వీడువార లిలలోఁ గళ్యాణకారుల్ గదా
దూర్తుండై యేలెడి భూ భర్తను సేవించు నట్టి భండిలుడట నా కర్తృత్వము రోయుచు తన కర్తవ్యము వీడువారు గళ్యాణకరుల్.దూర్తుండాతడు లోక కంటకునిగా దుర్మార్గముల్ జేయు భూ భర్తన్ నిత్యము గొల్చుటయ్యదియె యా బంట్రోతుకున్ గాంచగా కర్తృత్వంబగు పాళమందతని దుష్కార్యమ్ము లన్ గాంచి యా కర్తవ్యమ్మును వీడువార లిలలోఁ గళ్యాణకారుల్ గదా.
భర్త యెడతెగక త్రాగెడు
రిప్లయితొలగించండివర్తనమును గాంచి భార్య వలదన కుండన్
నార్తి పడక బొగడెడు దన
కర్తవ్యము వీడువారు గళ్యాణకరుల్
హర్తల్ నేతలుగా ప్రభుత్వమొదవన్నత్యంత స్వార్థమ్ముతో
రిప్లయితొలగించండివర్తిల్లన్ బ్రజ బాధలన్ విడుచుచున్ వంచించుచున్ నిత్యమున్
పూర్తిన్ చేయక వృద్ధి కారకములన్ భోగమ్ములన్ బొందుచున్
కర్తవ్యమ్మును వీడువార లిలలోఁ గళ్యాణకారుల్ గదా
రిప్లయితొలగించండిదూర్తుండై యేలెడి భూ
భర్తను సేవించు నట్టి భండిలుడట నా
కర్తృత్వము రోయుచు తన
కర్తవ్యము వీడువారు గళ్యాణకరుల్.
దూర్తుండాతడు లోక కంటకునిగా దుర్మార్గముల్ జేయు భూ
భర్తన్ నిత్యము గొల్చుటయ్యదియె యా బంట్రోతుకున్ గాంచగా
కర్తృత్వంబగు పాళమందతని దుష్కార్యమ్ము లన్ గాంచి యా
కర్తవ్యమ్మును వీడువార లిలలోఁ గళ్యాణకారుల్ గదా.