27, అక్టోబర్ 2026, మంగళవారం

సమస్య - 5633

28-10-2026 (బుధవారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“కర్తవ్యము వీడువారు గళ్యాణకరుల్”

(లేదా...)

“కర్తవ్యమ్మును వీడువార లిలలోఁ గళ్యాణకారుల్ గదా”

(గెంటేల జగదీశ చంద్రకుమార్ గారికి ధన్యవాదాలతో...)

5 కామెంట్‌లు:

  1. భర్త యెడతెగక త్రాగెడు
    వర్తనమును గాంచి భార్య వలదన కుండన్
    నార్తి పడక బొగడెడు దన
    కర్తవ్యము వీడువారు గళ్యాణకరుల్

    రిప్లయితొలగించండి
  2. హర్తల్ నేతలుగా ప్రభుత్వమొదవన్నత్యంత స్వార్థమ్ముతో
    వర్తిల్లన్ బ్రజ బాధలన్ విడుచుచున్ వంచించుచున్ నిత్యమున్
    పూర్తిన్ చేయక వృద్ధి కారకములన్ భోగమ్ములన్ బొందుచున్
    కర్తవ్యమ్మును వీడువార లిలలోఁ గళ్యాణకారుల్ గదా

    రిప్లయితొలగించండి

  3. దూర్తుండై యేలెడి భూ
    భర్తను సేవించు నట్టి భండిలుడట నా
    కర్తృత్వము రోయుచు తన
    కర్తవ్యము వీడువారు గళ్యాణకరుల్.


    దూర్తుండాతడు లోక కంటకునిగా దుర్మార్గముల్ జేయు భూ
    భర్తన్ నిత్యము గొల్చుటయ్యదియె యా బంట్రోతుకున్ గాంచగా
    కర్తృత్వంబగు పాళమందతని దుష్కార్యమ్ము లన్ గాంచి యా
    కర్తవ్యమ్మును వీడువార లిలలోఁ గళ్యాణకారుల్ గదా.

    రిప్లయితొలగించండి
  4. హనుమంతుడు/అంగదుడు రావణునితో...

    కందం
    మూర్తీభవించి ధర్మము
    స్ఫూర్తినొసఁగు దాశరథినిఁ బోరున నిల్పన్
    ధూర్తుల కొప్పదు, కాదది
    కర్తవ్యము! వీడువారు గళ్యాణకరుల్!

    శార్దూలవిక్రీడితము
    స్ఫూర్తిన్ బంచుచు మేటి ధర్మమదియే మూర్తీభవించంగ ని
    ర్వర్తించున్ రఘురామచంద్రుఁడెపుడున్ రాజీవనేత్రుండనన్
    ధూర్త శ్రేణికి వారితో రణమనన్ ద్రుళ్ళింత! రాణించదన్
    గర్తవ్యమ్మును వీడువార లిలలోఁ గళ్యాణకారుల్ గదా!

    రిప్లయితొలగించండి
  5. ధూర్తులగు నేతలు గదా
    వార్తాపత్రికలు పెట్టి వాస్తవ కథలన్
    బూర్తిగ మఱుగుపఱచి తమ
    కర్తవ్యము వీడువారు గళ్యాణకరుల్

    ధూర్తత్వమ్మిల నాయకత్వమవగా దుర్నీతికేబద్ధులై
    వార్తాపత్రికఁ బూన్చి వ్రాసెదరహో వాస్తవ్య దూరంబుగా
    మార్తాండాయని సొంతవారు బొగడన్ మత్తెక్కి వర్తించుచున్
    గర్తవ్యమ్మును వీడువార లిలలోఁ గళ్యాణకారుల్ గదా

    రిప్లయితొలగించండి