30-11-2026 (సోమవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కారునఁ గల పులినిఁ జూచి కదలుట మేలౌ”
(లేదా...)
“కారున నున్న బెబ్బులి నెగాదిగఁ గన్గొని యాత్రఁ జేయుమా”
(పాలడుగు శ్రీచరణ్ గారి శతావధాన సమస్య)
పద్మవ్యూహములో ద్రోణుడు,కర్ణుని తో...కందంపోరున దిగి యభిమన్యుడు వీరవిహారమ్ము సేయుచుండ, విల్లది చేతిన్జారక గెలువదగము! మక్కారునఁ గల పులినిఁ జూచి కదలుట మేలౌ!ఉత్పలమాల మారుతమట్లు రేగెడు నభిమన్యుని గాంచిన ద్రోణుడిట్లనెన్వీరవిహారికిన్ గలుగ విల్లది చేతను, కర్ణ! వంచగానేరికిసాధ్యమౌను? తునిమేయుము వెన్కను జేరి వేగ, మక్కారున నున్న బెబ్బులి నెగాదిగఁ గన్గొని యాత్రఁ జేయుమా!మక్కారు = పొగరుబోతుతనము, గర్వము
పద్మవ్యూహములో ద్రోణుడు,కర్ణుని తో...
రిప్లయితొలగించండికందం
పోరున దిగి యభిమన్యుడు
వీరవిహారమ్ము సేయుచుండ, విల్లది చేతిన్
జారక గెలువదగము! మ
క్కారునఁ గల పులినిఁ జూచి కదలుట మేలౌ!
ఉత్పలమాల
మారుతమట్లు రేగెడు నభిమన్యుని గాంచిన ద్రోణుడిట్లనెన్
వీరవిహారికిన్ గలుగ విల్లది చేతను, కర్ణ! వంచగా
నేరికిసాధ్యమౌను? తునిమేయుము వెన్కను జేరి వేగ, మ
క్కారున నున్న బెబ్బులి నెగాదిగఁ గన్గొని యాత్రఁ జేయుమా!
మక్కారు = పొగరుబోతుతనము, గర్వము