29, నవంబర్ 2026, ఆదివారం

సమస్య - 5666

30-11-2026 (సోమవారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“కారునఁ గల పులినిఁ జూచి కదలుట మేలౌ”

(లేదా...)

“కారున నున్న బెబ్బులి నెగాదిగఁ గన్గొని యాత్రఁ జేయుమా”

(పాలడుగు శ్రీచరణ్ గారి శతావధాన సమస్య)

1 కామెంట్‌:

  1. పద్మవ్యూహములో ద్రోణుడు,కర్ణుని తో...

    కందం
    పోరున దిగి యభిమన్యుడు
    వీరవిహారమ్ము సేయుచుండ, విల్లది చేతిన్
    జారక గెలువదగము! మ
    క్కారునఁ గల పులినిఁ జూచి కదలుట మేలౌ!

    ఉత్పలమాల
    మారుతమట్లు రేగెడు నభిమన్యుని గాంచిన ద్రోణుడిట్లనెన్
    వీరవిహారికిన్ గలుగ విల్లది చేతను, కర్ణ! వంచగా
    నేరికిసాధ్యమౌను? తునిమేయుము వెన్కను జేరి వేగ, మ
    క్కారున నున్న బెబ్బులి నెగాదిగఁ గన్గొని యాత్రఁ జేయుమా!

    మక్కారు = పొగరుబోతుతనము, గర్వము

    రిప్లయితొలగించండి