5, నవంబర్ 2012, సోమవారం

పద్య రచన - 151

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

4, నవంబర్ 2012, ఆదివారం

అభినందన సుమమాలిక

మిత్రులారా!
‘శంకరాభరణము’ అనే బ్లాగును నెలకొలిపి
నిత్య కార్య కలాపములతో విజయవంతముగా నిర్వహించుచున్న
సమర్థ సాహితీ వరివస్యాతత్పరులు
శ్రీ కంది శంకరయ్య  మహోదయులకు 
అభినందన సుమమాలికలు
సీ.
సంస్కృతాంధ్రాది భాషలలోన పాండిత్య
పటిమతో నెవ్వాడు వరలుచుండు
శంకరాభరణ సంజ్ఞాంచి తాంతర్జాల
వేది నెవ్వడు నడిపించుచుండు
సాహితీ ప్రియ ముఖ్య సరస ప్రక్రియలను
ప్రకటించు నెవ్వాడు ప్రతిదినమ్ము
ఔత్సాహికులయిన ఆంధ్ర పద్య కవిత్వ 
ప్రియుల నెవ్వా డాదరించు చుండు
తే.గీ.
నతడు శారదా మాతృ పాదార్చకుండు
సుకవి పండిత సౌహిత్య శోభితుండు
భద్రమతి సద్గుణానీక వైభవుండు
కందికుల శంకరయ్య ప్రజ్ఞాన్వితుండు.   
 కం.
ఆతనికి సుకవి పండిత
వ్రాతస్తుత సుగుణ శీల వైభవునకు నే
చేతోమోద మ్మలరెడు
రీతిన్ దీవెనల గూర్తు శ్రీరస్తనుచున్ 
 
 నేమాని రామజోగి సన్యాసి రావు

సమస్యాపూరణం - 868 (కొందఱికి మేత)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
కొందఱికి మేత, పలు వాత లందఱకును.

ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

పద్య రచన - 150

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

3, నవంబర్ 2012, శనివారం

సమస్యాపూరణం - 867 (కలలే వాస్తవము లగుచు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
కలలే వాస్తవము లగుచుఁ గడు సుఖము లిడున్.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

పద్య రచన - 149

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

2, నవంబర్ 2012, శుక్రవారం

సమస్యాపూరణం - 866 (సీతాపతి యనఁగ)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
సీతాపతి యనఁగఁ జంద్రశేఖరుఁడు గదా!

పద్య రచన - 148

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

1, నవంబర్ 2012, గురువారం

సమస్యాపూరణం - 865 (నక్కలపాలు సేయఁదగునా)


కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
నక్కలపాలు సేయఁదగునా యిటు లక్కట యీనఁగాచియున్!
ఈ సమస్యను పంపిన కామరాజు సుధాకర్ గారికి ధన్యవాదాలు.

పద్య రచన - 147


కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.