5, నవంబర్ 2012, సోమవారం

పద్య రచన - 151

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

15 కామెంట్‌లు:

  1. ఇంటి కేగెడు తొందర ఇంగితమును
    కప్పి వేసె బస్సదుపును తప్పి నపుడు
    మింటి కేగుదు రయ్యయో ! వింటి రోయి !
    అడుగు లెప్పుడు వేయుమా ఆచి తూచి.

    రిప్లయితొలగించండి
  2. అవసరమును బట్టి యాగరు చూడరు
    భద్రతలను వేరు బస్సు లేక
    పాట్లు పడుచు జనులు ప్రాణమ్ము లరచేత
    బట్టి చేయుదు రిల పయనములను

    రిప్లయితొలగించండి
  3. బస్సు మీదన నిలబడి పయన మగుట
    యరయ యా ప ద తెలియదె యట్లు జేయ ?
    నెప్పు డైనను నా ప ద ల్ జెప్పి రావు
    సా వ ధా న మె యె ల్లె డ స రి య యగును .

    రిప్లయితొలగించండి
  4. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  5. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగుంద. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. పండిత నేమాని వారూ,
    మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. బస్సు పైన నిలచి పయనించు జనులేల
    తల్లి దండ్రి ప్రేమ దార నొదిలి
    సాహసమ్ము జేయ సరిలేరు మాకంచు
    ప్రాణ భయము లేక భవిత మరచి

    రిప్లయితొలగించండి
  8. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    అల్లరి కుర్ర-కారు :

    01)
    _______________________________

    కోడె వయసున యల్లరి - కుర్రకారు
    కోతి చేష్టల జేయగా - కోరు కొంద్రు!
    కోరి పైకెక్కి బస్సుపై - కూలబడుట
    కొరివితో తమ తలలను - గోకు కొనుటె!
    _______________________________

    రిప్లయితొలగించండి
  9. కోతిమూక :

    02)
    _______________________________

    కొంటె పిల్లలు కొందరు - కూటమిగను
    కోరి చేయుచు నల్లరి - గొప్ప కొరకు
    కోతు లగుదురు బస్సుపై - గోల జేయ !
    కోతి మనతాత ముత్తాత - తాత గాదె !
    _______________________________

    రిప్లయితొలగించండి
  10. వనచర బృందము :

    03)
    _______________________________

    వారి పూర్వుల పూర్వులే - వనచరులట
    వారసత్వపు లక్షణాల్ - వచ్చెనేమొ
    వారి జూడుడు బస్సెక్కి - వాటముగను
    వాదు లాడుచు వరుసగా - చేదు కొనుచు
    వాలిపోదు రొండొరులను - బాదు కొనుచు
    వాగు చుందురు మధువేదొ - తాగినటుల !
    వాహనంబును నడిపెడు - వాని మహిమ !
    వారు యింటికి జేరగా - వలను పడునొ ?
    వల్లకాటికి జేరునో - తెల్ల మవదు ?!
    _______________________________

    రిప్లయితొలగించండి
  11. మర్కట సంతానం :

    04)
    _______________________________

    మనుజు లందరి పూర్వులూ - మర్కటములె
    మంచి నడతను నేర్చుటన్ - మనుజు లయ్యె !
    మంచి మాటల విననట్టి - మంకువారు
    మనుజు లందున కొందరే - మర్కటములు !
    మత్తు తలకెక్కి బస్సెక్కి - మసలుచున్న
    మనుజులా వీరు ? కాదోయి - మర్కటములె !
    మంచిగా వీర లింటికి - మరల నౌనొ ?
    మరణ శయ్యను జేరునో - యెరుగలేము !
    మంచి సారథి ప్రతిభయే - యెంచగలదు !
    _______________________________

    రిప్లయితొలగించండి
  12. రాజేశ్వరి అక్కయ్యా,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ నాలుగు పద్యాలూ ప్రశస్తంగా ఉన్నాయి. అభినందనలు.
    మొదటి పద్యంలో ‘కోడెవయసున నల్లరి’ అనండి. అక్కడ యడాగమం రాదు.

    రిప్లయితొలగించండి
  13. జంగిడి రాజేందర్మంగళవారం, నవంబర్ 06, 2012 7:32:00 AM


    వాహనాలు లేక వాహనాల కొఱకు
    వేచి చూడ కనులు విసిగిపోవ
    అదిగొ వాహన మన నదియు నప్పుడె నిండె
    మిగత కొందఱేమొ మీద నిండ.

    రిప్లయితొలగించండి