1, నవంబర్ 2012, గురువారం

పద్య రచన - 147


కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

25 కామెంట్‌లు:

  1. చిరుతప్రాయము నందున
    చిరుతలు సింహాలతోడ చిరునవ్వులతో
    భరతము పట్టెడు వానిల
    భరతునిలా ఆడుచున్న బాలుడ భళిరా!

    రిప్లయితొలగించండి
  2. శివకేశవ సంతానము
    భువిపై సింహాలచిరుతమూకల పెరిగెన్!
    భవహర! అయ్యప్ప! నమో!
    జవదాటమునీదు మాట శరణము స్వామీ!

    రిప్లయితొలగించండి
  3. సింహ శాబకమ్ముల తోడ చెడుగు డాడి
    లాగి కరమున మీసముల్ లాఘవమున
    వదనముల దెరచి గణించి రదనములను
    తాల్మి గొనె భరతుడు చిన్నతనము నందె


    మునుపు దుష్యంత రాజుకు పుత్రు డితడు
    తల్లి యగును శకుంతల - దమను డగుచు
    బెరిగె కణ్వాశ్రమమ్మున; పేరు గాంచి
    భరత ఖండము నేలిన బాలుడు డితడె.

    రిప్లయితొలగించండి
  4. నేను యీ చిత్రాన్ని భరతుని కన్వయించుకున్నాను కాని నిజానికిది బాల అయ్యప్ప స్వామి చిత్రమే.

    రిప్లయితొలగించండి
  5. చివరి పద్యం చివరి పాదంలో టైపాటుకు మన్నింప ప్రార్థన...... బాలు డితడె.

    రిప్లయితొలగించండి
  6. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    భరతుడే గానీ బాలయ్యప్పే గానీ బాలుడే గద :

    01)
    _________________________________________

    బలమున్ క్రోధము గల్గి నట్టి పలు దీ - ప్తా, వ్యాళ మధ్యంబునన్
    బలరామానుజు వోలె నిల్చితివి శా - బాసంచు మెచ్చంగ నిన్ !
    భళిరా ! బాలుడ ! నీదు విక్రమము, లే - ప్రాయంబునందే గనన్ !
    కలలో నైనను కాంచ లేని దిది ! సా - క్షాత్కార మయ్యెన్నిటన్ !
    _________________________________________
    దీప్తము = సింహము
    వ్యాళము = పులి
    బలరామానుజుడు = చిన్ని కృష్ణుడు

    రిప్లయితొలగించండి
  7. బాలు డ క్క డ సింగము ప్రక్క నుండి
    యాట లాడుట మొదలిడు నట్ల యుండె
    బోసి గుడ్డలు గలిగిన బుడత డ తడు
    భరతు డా యను సందేహ పడితి నిపుడు .

    రిప్లయితొలగించండి
  8. హరిహరిసుతు డనుచు సమా
    దరమున సేవించుచుండె దండకవనిలో
    హరి శార్దూలాది గహన
    చరతతులా దేవు బాల శాస్తన్ గొలుతున్

    రిప్లయితొలగించండి
  9. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    ‘చిరుతప్రాయము’ అన్నప్పుడు ‘త’ గురువు కాదు. ‘చిరు ప్రాయము నందునఁ దా’ అందాం.
    *
    సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ రెండు పద్యాలూ బాగున్నవి. అభినందనలు.
    కణ్వాశ్రమంలో పెరిగింది శకుంతల. భారత కథ ప్రకారం భరతుడు అక్కడే జన్మించాడు కాని అక్కడ పెరుగలేదు. కాళిదాసు కథ ప్రకారం పుట్టిందీ పెరిగిందీ మరో ఆశ్రమంలో (ఎవరి ఆశ్రమమో గుర్తుకు రావడం లేదు. కణ్వాశ్రమం మాత్రం కాదు.)
    *
    వసంత కిశోర్ గారూ,
    శాబాసని మెచ్చే మత్తేభవిక్రీడితాన్ని రచించి అలరించారు. బాగుంది. అభినందనలు.
    ‘దీప్తవ్యాళ’ అని సమాసం చేయవచ్చు గదా!
    *
    సుబ్బారావు గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    మంచి పద్యం చెప్పారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. ముద్దులు మూటగట్టు చిరు మువ్వవొ! మొద్దు మృగాల కెన్నగా
    యొద్దిక నేర్పు బాల గురువో! పులి పాలను గొన్న స్వామివో!
    పెద్దలు మెచ్చ భారతపు పేరుకు మూలమవైన బిడ్డవో!
    ఎద్దిర బాలకా తగిన యింపగు నామము నీకు చెప్పవే?

    రిప్లయితొలగించండి
  11. మిస్సన్న మహాశయా ! బాగు బాగు !

    బాబు నడిగితే లాభమేమిటి ?
    వాడికెవరూ పేరు పెట్టలేదింకా !
    వ్యవహారం సందిగ్దంగానే యున్నది !
    వాడెవరో ? కన్న వాళ్ళెవరో ? పేరేమిటో ? ఊరేమిటో ?
    ఇక్కడకు తెచ్చింది మాత్రం నిస్సందేహంగా శంకరార్యులే !
    గనుక వారినడిగితే సరి !?

    రిప్లయితొలగించండి
  12. 02)
    _________________________________________

    ముద్దులు మూటగట్టు చిరు - బుగ్గల తోడుగ చిన్ని నవ్వుతోన్
    హద్దులు లేని యందమున - హాయిగ నిల్చొని యున్న బాలకున్ !

    ఎద్దిర నీదు పేరు ? మరి - యెవ్వరి వాడవు ? యేది యూరనన్ ?

    ఎద్దులు సింహము ల్పులులు - యేనుగు లైనను మ్రాన్పడన్, భళా
    ముద్దుగ రువ్వు ! నవ్వు ! విర - బూసిన వెన్నెల సోన పోలికన్ !!!!!
    _________________________________________

    రిప్లయితొలగించండి
  13. శంకరార్యా ! ధన్యవాదములు !
    "దీప్తవ్యాళ"మని సంధి చెయ్యొచ్చా ! ఐతే O.K

    రిప్లయితొలగించండి
  14. భరతుడే గానీ బాలయ్యప్పే గానీ బాలుడే గద :

    01అ)
    _________________________________________

    బలమున్ క్రోధము గల్గి నట్టి పలు దీ - ప్తవ్యాళ మధ్యంబునన్
    బలరామానుజు వోలె నిల్చితివి శా - బాసంచు మెచ్చంగ నిన్ !
    భళిరా ! బాలుడ ! నీదు విక్రమము, లే - ప్రాయంబునందే గనన్ !
    కలలో నైనను కాంచ లేని దిది ! సా - క్షాత్కార మయ్యెన్నిటన్ !
    _________________________________________
    దీప్తము = సింహము
    వ్యాళము = పులి
    బలరామానుజుడు = చిన్ని కృష్ణుడు

    రిప్లయితొలగించండి
  15. మిస్సన్న మహాశయుల బాటలో :

    దిక్కు లేనివారికి దేవుడే దిక్కు :

    03)

    _________________________________________

    ఎవ్వడ వోయి ? నీ విటకు - యే పని ? కెట్టుల వచ్చినాడవో ?
    ఎవ్వరు తల్లిదండ్రులగు ? - నేర్పడ జెప్పుము పేరదేమిటో ?
    ఎవ్విధి దూరమైతివట ? - యెందుకు జేరితి వీ మృగంబులన్ ?
    ఎవ్వనిచే జనించు ? జగ - మెవ్వడు బ్రోచునొ ? వాడె , గాచు నిన్ !
    _________________________________________

    రిప్లయితొలగించండి
  16. దేవుడికొక రూపముండదు ! ఎవరు కాపాడితే వాడే దేవుడు :

    04)

    _________________________________________

    కూర్మిని జూపు తండ్రి, నతి - గోముల తల్లిని కోలుపోతివో ?
    నిర్మల మానసంబునను - నిల్చితి విచ్చట నిర్భయంబుగా !
    అర్మిలి జూపెనా , మిగుల - నాపులి, సింహము నీకు చేరువై ?
    మర్మపు మానుషాధములె - మ్రాన్పడు రీతిని దుర్భరాటవిన్ !
    _________________________________________
    కూర్మి = అర్మిలి = ప్రేమ

    రిప్లయితొలగించండి
  17. దయ గలిగిన వాడే గదా దేవుడు :

    05)
    _________________________________________

    నర్మిలి కోసమై యిలను - నాశన మొందగ జేయు కాలమున్
    దుర్మతులైన మానవుల - తుచ్ఛపు చేష్టల నెంచి జూపుచున్
    ధర్మము శాంత్యహింస లను - దప్పెడు మానవ కోటి కుందగన్
    కూర్మిని పెంచుచున్న విట - గోముగ బాలుని క్రూర జంతువుల్ !
    నర్మము జేయగా నరుల - నర్మర లై దయ లేని వారలన్ !
    _________________________________________
    నర్మిలి = కోరిక(అత్యాశ, ధనాశ)
    కూర్మి = ప్రేమ
    నర్మము = పరిహాసము
    నర్మర = ముట్లుడిగిన స్త్రీ(దయలేని వారు పనికిరారనిభావం)

    రిప్లయితొలగించండి
  18. మానవులకు జంతువుల సందేశం (వేరే గ్రహానికి పొమ్మని) :

    06)
    _________________________________________

    మమ్ముల జూచి నేర్చు కొను - మయ్యరొ ! జాలిని సుంత యేనియున్ !
    అమ్ముల తోడ గూల్చెదవె - యాశను, ప్రాణులె యంతరించగన్ !
    యిమ్ముగ మేమె సాకెదము - యీ భువి ప్రాణులు వృద్ధిపొందగన్ !
    పొమ్ముర ! నీకు లేదు యిక - భూమిని యుండగ యర్‌హ తించుకేన్ !
    _________________________________________
    అమ్ములు = బాణములు ( ఆయుధములని భావం)

    రిప్లయితొలగించండి