మిస్సన్న గారూ, ప్రస్తుత రాష్ట్ర ఆందోళనకరమైన పరిస్థితికి అద్దం పడుతున్నది మీ పూరణ. చాలా బాగుంది. అభినందనలు. * శ్రీపతి శాస్త్రి గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. * వసంత కిశోర్ గారూ, చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు. నాల్గవ పాదంలో యతి తప్పింది. ‘తలతురే’ అన్నదాన్ని ‘తలతురో’ అని సవరిస్తే సరి! * నాగరాజు రవీందర్ గారూ, మీ పూరణ చాలా బాగుంది. దళారులను నక్కలతో పోల్చటం బాగుంది. అభినందనలు. * సంపత్ కుమార్ శాస్త్రి గారూ, సమస్యను ఖండించి వైవిధ్యంగా చెపిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు. హీన శబ్దం ఈన కాదు. ఈన శబ్దానికి చీపురుపుల్ల అని అర్థం. * పండిత నేమాని వారూ, ఉత్తమమైన పూరణ చెప్పారు. అభినందనలు.
అక్కట యాంధ్ర భూమి గన నశ్రువులౌ గద యేమి సెప్పుదున్
రిప్లయితొలగించండిమిక్కుట మాయె కష్టములు మీరె నపశ్రుతు లెల్ల తావులన్
పెక్కగు త్యాగముల్ సలిపి పెద్దలు జన్మము నీయ రాష్ట్రమున్
నక్కలపాలు సేయఁదగునా యిటు లక్కట యీనఁగాచియున్!
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండిమక్కువ గల్గి నాటితివి మామిడి మొక్కలు జంబు వృక్షముల్
చక్కగ వృద్ధి చెందినవి చయ్యన సంపద కూర్చె చూడగన్
అక్కర తీరినంతటనె యమ్మగ భావ్యమె యా కసాయికిన్
నక్కలపాలు సేయఁదగునా యిటు లక్కట యీనఁగాచియున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
రాఖీ సినిమాలో వరకట్న దాహానికి బలై పోయిన యువతి తల్లిదండ్రుల నుద్దేశించి :
01)
_________________________________________
మక్కువ తీర బెంచుకొని - మన్ననతో పలు కట్నకానుకల్
లెక్కకు మిక్కిలౌ విధము - లేమకు తోడుత పంప , యేలకో
రక్కసి మూకలేయనగ - రాక్షస వృత్తిని భర్త, యత్తయున్
ఉక్కడగించగా దలతు - రే ! మరి కట్నము చాలదంచటన్ !
చక్కని చుక్కనొక్కతెకు - జన్మము నిచ్చిన తల్లి దండ్రులే
నక్కలపాలు సేయఁదగునా యిటు లక్కట యీనఁగాచియున్ !
_________________________________________
రెక్కలు ముక్కలయ్యె గద రేయిబగళ్ళును కూరగాయలన్
రిప్లయితొలగించండిజక్కగ బెంచ రైతునకు ; సంతకు జేరిచి యమ్మ జూపగన్
దక్కెను నష్టమే తనకు దాను దళారుల చేతిలో బడన్
నక్కల పాలు సేయదగునా యిటు లక్కట యీన గాచియున్ !
కష్టపడి, ప్రేమనుపంచుతూ పెంచిన అక్కలకు ఆస్తిపంపకమును నిరసిస్తున్న ఒక తమ్మునికి హితబోధగా.....
రిప్లయితొలగించండిరెక్కలువంచి కష్టపడె రేయిబవళ్ళనుభేదమెంచకన్
మక్కువజూపిపెంచిరి, సమానముగా తగభాగమివ్వగా
లెక్కలజూపితీవు నిట లేదనబోకుము మీదుసంపదౌ
నక్కలపాలు, సేయదగునా యిటులక్కట? యీనగాచినన్.
సంపద+ ఔను+ అక్కలపాలు = సంపదౌనక్కలపాలు
యీన = హీనము
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినక్కలె యెక్కువయ్యె మన నాయకులందరి వెన్క జేరుచున్
రిప్లయితొలగించండిదక్కినదెల్ల మెక్కుచు నిధానములెల్లను కొల్లగొట్టుచున్
నిక్కుచు నీల్గుచుండ ధరణిన్ బరిపాలన గాంచ హావిధీ!
నక్కలపాలు సేయదగునా యిటు లక్కట యీనగాచియున్
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిప్రస్తుత రాష్ట్ర ఆందోళనకరమైన పరిస్థితికి అద్దం పడుతున్నది మీ పూరణ. చాలా బాగుంది. అభినందనలు.
*
శ్రీపతి శాస్త్రి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
వసంత కిశోర్ గారూ,
చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
నాల్గవ పాదంలో యతి తప్పింది. ‘తలతురే’ అన్నదాన్ని ‘తలతురో’ అని సవరిస్తే సరి!
*
నాగరాజు రవీందర్ గారూ,
మీ పూరణ చాలా బాగుంది. దళారులను నక్కలతో పోల్చటం బాగుంది. అభినందనలు.
*
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
సమస్యను ఖండించి వైవిధ్యంగా చెపిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
హీన శబ్దం ఈన కాదు. ఈన శబ్దానికి చీపురుపుల్ల అని అర్థం.
*
పండిత నేమాని వారూ,
ఉత్తమమైన పూరణ చెప్పారు. అభినందనలు.
శంకరార్యా ! ధన్యవాదములు !
రిప్లయితొలగించండిఅందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
రాఖీ సినిమాలో వరకట్న దాహానికి బలై పోయిన యువతి తల్లిదండ్రుల నుద్దేశించి :
01అ)
_________________________________________
మక్కువ తీర బెంచుకొని - మన్ననతో పలు కట్నకానుకల్
లెక్కకు మిక్కిలౌ విధము - లేమకు తోడుత పంప , యేలకో
రక్కసి మూకలేయనగ - రాక్షస వృత్తిని భర్త, యత్తయున్
ఉక్కడగించగా దలతు - రొంటిని కట్నము చాలదంచటన్ !
చక్కని చుక్కనొక్కతెకు - జన్మము నిచ్చిన తల్లి దండ్రులే
నక్కలపాలు సేయఁదగునా యిటు లక్కట యీనఁగాచియున్ !
_________________________________________
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచిక్కులనెన్నో పెట్టి నిను చింతలు పాలుగ చేసినట్టి ఆ
రిప్లయితొలగించండిరక్కసు చావు చుడకయే రాజ్యము వద్దని యుద్దభూమి లో
మక్కువ కల్గెనే విజయా, మారాకు నీవని క్రిష్ణుడిట్లనేన్
నక్కలపాలు చేయతగున ఇటులక్కట ఈనకాచియున్!!
చక్కని రూపి శూర్పణఖ సఖ్యత జేయగ రాము జేరగా
రిప్లయితొలగించండిమక్కువ వీడి రాముదల మాన్యుదనుంగు జేర బొమ్మనా
అక్కసు నేలనీకు నిల ఆర్థక జవ్వని యవ్వనమ్ము తా
నక్కలపాలు సేయతగునా యిటు లక్కట యీన గాచియున్
ఆజం ఖానూ:
రిప్లయితొలగించండిమక్కువ మీర నాయికయె మంచిగ నేలగ పార్లమెంటునున్
తిక్కగు మాటలాడుచును తియ్యగ నాపెకు కన్నుగొట్టిభో!
గ్రక్కున నావుపాలనట గాడిద కుక్కల కొండముచ్చులన్
నక్కలపాలు సేయఁదగునా యిటు లక్కట యీనఁగాచియున్!