4, నవంబర్ 2012, ఆదివారం

సమస్యాపూరణం - 868 (కొందఱికి మేత)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
కొందఱికి మేత, పలు వాత లందఱకును.

ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

12 కామెంట్‌లు:

  1. మేలైన పాలన మేము చేయుదుమంచు
    ....తగు నుపన్యాసముల్ దంచు వారు
    మేమె నీతి కొలంది మిమ్ము నేలెదమంచు
    ....తరచుగా చేసి వాగ్దానములను
    మేమె పెంచెదమంచు మెండుగా వనరుల
    ....తమ శక్తి కొలదిగా దాచుకొనుచు
    మేలిమి సంపదల్ చాల దోచుకొనుచు
    ....తరతరాలకు పంచు సరణి పెరుగు
    చుండి నేతలు మెండుగా సుంకములను
    ప్రజలపై వాతలనువేయు పద్ధతులను
    చూడరే రాజకీయాల వేడుకలన
    కొందరికి మేత పలువాత లందరకును

    రిప్లయితొలగించండి
  2. కలదు మనకధికారంబు గాచు ననుచు

    కొల్లగొట్టగ మార్గాల కూర్చి దోచ

    బట్ట బయలయ్యి జిల్లకువరుస గట్ట


    కొందరకు మేత పలు వాత లందరకును

    రిప్లయితొలగించండి
  3. శుష్కవాగ్దానములఁజేసి చూపరులకు
    స్వర్గసౌఖ్యమ్ముకలిగించు వారలమని
    రాజకీయనాయకులిట రాజ్యమేల
    కొందఱికిమేత పలువాత లందఱకును.

    రిప్లయితొలగించండి
  4. భాస్కరుండిచ్చు తాపమ్ముపత్రహరిత
    మిచ్చి కాచుట గలదట యెంత వింత?
    గ్రీష్మ ఋతువున వేడిమి కీడు కాదు;
    కొందఱికి మేత, పలు వాత లందఱకును.

    రిప్లయితొలగించండి
  5. అన్ని శాఖల యందున నధిక మయ్యె
    లంచ గొండు తనము నిల ,నించు కేని
    పాప భీతి యె లేకుండ పరుల సొమ్ము
    కొందరికి మేత పలు వాత లందరకును

    రిప్లయితొలగించండి
  6. శ్రీగురుభ్యోనమః
    మూడవపాదంలోటైపాటు సవరణ:
    'బట్టబయలయ్యిజైల్లకువరుసఁగట్ట'
    స్వస్తి .

    రిప్లయితొలగించండి
  7. ప్రజల సౌలభ్య మాశించు ప్రభుత ; కాని
    "కొందఱికి మేత , పలువాత లందఱికిని"
    యనెడు చందము నుండును పనులు కొన్ని
    పథకము లిటులగును స్వార్థ పరుల వలన.

    రిప్లయితొలగించండి
  8. పండిత నేమాని వారూ,
    మీ పూరణ అత్యుత్తమంగా ఉంది. ధన్యవాదాలు.
    *
    సహదేవుడు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘జిల్లా’ శబ్దం దీర్ఘాంతమే. ‘జిల్ల’ అంటే బిల్లంగోడు. జిల్లా తెలుగు కాదు. అన్యభాషాపదమే.. కానీ తెలుగులో దాని ప్రయోగం విస్తృతంగా ఉంది.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    స్వాగతం!
    మీ పూరణ వైవిధ్యంగా ఉంది. బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. సోదరులు శ్రీ గన్నవరపు వారి ఆనంద దాయక మైన ఆహ్వానం శ్లాఘ నీయం. .పుట్టింటికి అంటే విమానా లెందుకు ? రెక్కలు గట్టుకుని అసలు పిలవక పోయినా , వచ్చెయ్యడం ,మన ఆచారం. ఇప్పుడైనా మించి పోయింది లేదు. మేము రెడీ .పల్లెలో ఉండే ప్రకృతి సౌందర్యాలు , ప్రేమాభి మానాలు బస్తీలొ ఎక్కడివి తమ్ముడూ !
    ఇక .....శ్రీ పండితుల వారి కుమారుడు చిరంజీవి నంద కిషోర్ గారికి ఫోన్ చేద్దా మంటె , ఫోనె లేదు గదా ! ఏది ఏమైనా , అందరి శుభాశీస్సులతో గట్టెక్కాము. మీ అందరి ఆదరాభి మానములకు క్ర్తజ్ఞతలు + ధన్య వాదములు

    రిప్లయితొలగించండి
  10. జంగిడి రాజేందర్ఆదివారం, నవంబర్ 04, 2012 9:10:00 PM

    పాఠశాలయం దెల్లరు బాలకులును
    విద్య నభ్యసించుచునున్న వేళయందు
    బాలురందు నొకడు పొరపాటు చేయ
    కొందరికి మేత పలు వాత లందరకును.

    రిప్లయితొలగించండి
  11. వచ్చె నీలమ్ము రూపున వాన ముప్పు
    తెచ్చె కడగండ్లు బ్రతుకున చిచ్చు రేపి
    కొందరికి మేత పలు వాత లందరకును
    ప్రభువు లిచ్చెడు పరిహార విభవమందు

    రిప్లయితొలగించండి