4, నవంబర్ 2012, ఆదివారం

పద్య రచన - 150

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

9 కామెంట్‌లు:

 1. భామా సంయుత రామా!
  రామానుజ సేవితపద! ప్రణతులు దేవా!
  సీమ దొరల సంస్థలు మి
  మ్మామోదించుటయు చోద్య మంబుజనయనా!

  రిప్లయితొలగించండి
 2. నాణెము చూడగ గత వి
  న్నాణెము నందించుచుండె నాహా! ఓహో!
  పాణిని కోదండమ్మును
  నాణెముగా పట్టినట్టి నాధునకున్ జే!

  రిప్లయితొలగించండి
 3. పాత కాలపు నాణేల పైన జూడ
  రామ లక్ష్మణ ప్ర తిమలు రమ్య ముగను
  గాన వచ్చును జూడుడు కన్ను లార
  దైవ భక్తికి ఋ జువ ది తనయు లార!

  రిప్లయితొలగించండి
 4. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 5. ఒప్పు నీస్టిండియా పేరు నొక్కవైపు
  ఒప్పు రామలక్ష్మణ సీత లొక్క వైపు
  దొరికె నరుదైన నాణెమ్ము దొరల నాటి
  కాలపు దపురూపముగ భాగ్య వశమనగ.

  రిప్లయితొలగించండి
 6. గురువుగారికి, సభకు నమస్కారములు.
  ఈ అపురూపమైన నాణెం ఈ మధ్యకాలంలో దొరికిందా?

  ప్రాతఃస్మరణీయులయిన
  సీతారాములగుపించి చింతల దొలగన్
  జేతురనిన వింతయగునె?
  యా తారక మంత్రమదియె యద్భుతమనుచున్

  కాసుల పైనను ముద్రణ
  చేసిన ఘనతయు పరులదె, చెప్పుటె తప్పౌ
  బాసట నిచ్చుట కెవరిక
  దోసిలి నొగ్గెదను తీర్చు దుఃఖము , రామా!

  రిప్లయితొలగించండి
 7. శ్రీరామా!

  దోచెడు వారలు సైతము

  చూచిరి నీలోని ధర్మసూత్యములన్నిన్

  జూఛాయగఁదెల్సిరపుడె

  పాచికలీదేశమందుపారబరువనిన్ !

  రిప్లయితొలగించండి
 8. శ్రీగురుభ్యోనమః
  రెండవపాదంలో టైపాటు
  'చూచిరినీలోనిధర్మసూత్రములన్నిన్'
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 9. పండిత నేమాని వారూ,
  పరప్రభుత్వాలు మన సంస్కృతికి విలువ నిచ్చాయి కాని, మన ప్రభుత్వం అటువంటి నాణాలను ముద్రించే సాహసం చేయగలదా? సెక్యులరిజం దెబ్బతుంటుందంటుంది.
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  ‘నాణెము’ శబ్దంతో మీరు చేసిన చమత్కారం బాగుంది. మంచి పద్యం. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  బాగుంది మీ పద్యం. అభినందనలు.
  *
  లక్ష్మీదేవి గారూ,
  ఆ నాణెం ఈమధ్య దొరికిందే.
  మీ పద్యాలు చాలా బాగున్నవి. అభినందనలు.
  *
  సహదేవుడు గారూ,
  బాగుంది మీ పద్యం. అభినందనలు.
  ‘అని’ ద్రుతాంతం కాదు.

  రిప్లయితొలగించండి